ప్రపంచంలో తెల్లరంగు రక్తంగల జీవి? -వి.ఆర్‌.వో., వి.ఆర్‌.ఏ. పరీక్షల ప్రత్యేకం





మొక్కలనుంచి వచ్చే శిలాజ ఇంధనాలు?
బొగ్గు, పెట్రోలియం

 అతి పెద్ద శాఖీయ మొగ్గ?
 క్యాబేజి

తెల్లరంగు రక్తంగల జీవి?
గొల్లభామ

పరిసరాలకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతను మార్చుకునే జంతువులు?
శీతలరక్త జంతువులు

ప్రధమ చికిత్సకు ఆద్యుడు?
ఇస్మార్క్‌

నోటిలో ఆహారం వాయునాళంలోనికి పోకుండా కాపాడే త్వచం?
 కైమ్‌

 యూరియా విసర్జక జంతువులు?
కప్ప, మనిషి

కండరాల నొప్పులు, పట్టుకున్నట్లు ఉండటం, పట్టుకోల్పోవడం వంటివి ఏ వ్యాధి లక్షణాలు?
చికెన్‌గున్యా

 మానవ శరీరంలో అతి చిన్న ఎముక
చెవి ఎముక

శరీరంలోని రక్తంలో ఐరన్‌ శాతం?
60-70 శాతం

బియ్యంలో ఎక్కువగా ఏ పోషకాలుంటాయి?
కార్బోహైడ్రేట్లు

 ఎదిగే పిల్లలకు ఎక్కువగా అవసరమయ్యే ఆహార పదార్థాలు?
మాంసకృత్తులు, పిండి పదార్థాలు

. ఎర్రరక్తకణాల జీవితకాలం?
120 రోజులు

 టైఫాయిడ్‌ ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది?
పేగులు/ఉదరం

సేకరించిన రక్తాన్ని ఎన్ని నెలలు నిల్వ చేయవచ్చు?
3 నెలలు

మూత్రపిండాలు రోజుకు వడపోసే నీటి పరిమాణం?
170 లీటర్లు

 కాలేయం స్రవించే రసం?
పైత్య రసం

. శరీరంలో జలతుల్యతను కాపాడేది?
మూత్రపిండాలు

రెండు వలయాల్లో రక్తాన్ని పంపుచేసే హృదయాన్ని ఏమంటారు?
ద్వివలయ ప్రసార హృదయం

శ్వాసక్రియ ఏ చర్య?
ఉష్ణమోచక చర్య

 యాలుకలు మొక్కలో ఏ భాగం?
ఫలం

 కంటిరంగును దేన్నిబట్టి నిర్ణయిస్తారు?
కనుపాప

 ఆహారంగా ఉపయోగించే శైవలం?
చైనాగడ్డి

కొత్తరకం ఇంధనాల్ని ఏమంటారు?
సాంప్రదాయేతర ఇంధనాలు

 చర్మంలో ఉండే ప్రోటీన్‌?
కెరాటిన్‌

 అత్యధిక ప్రొటీన్లనిచ్చే ఆహార పదార్థాలు?
సోయా చిక్కుళ్లు