మనం ఆహారం తినడానికి కొన్ని నిముషాలు చాలు. కానీ అది జీర్ణం
కావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది.
హిమోగ్లోబిన్ నుండి ఆక్సిజన్ అన్ని శరీర భాగాలకు సరఫరా చేయడంలో
ఐరన్ ముఖ్యపాత్ర వహిస్తుంది.
మనం వాడే యాంటిబయాటిక్ మందులు మన శరీరంలోని బ్యాక్టీరియా
మీద పనిచేస్తాయి కానీ వైరస్ మీద పనిచేయవు.
వైరస్ కంటే బ్యాక్టీరియా వంద రెట్లు పెద్దగా ఉంటాయి.
మనం పీల్చే గాలిలో పావు వంతు మన మెదడే ఉపయోగించుకుంటుంది.
మన గుండె రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది.
శరీర రంగు మనలో ఉండే మెలనిన్ అనే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది.
మెలనిన్ తక్కువగా ఉంటే గోధుమ రంగులో, ఎక్కువగా ఉంటే నలుపు రంగులో
శరీరం ఉంటుంది.
మనిషి శరీరంలోని అతి చిన్న ఎముక పొడవు 2.8 మి.మీ. అది మధ్య
చెవిలో ఉంటుంది.
మనిషి శరీరంలోని ఎడమవైపు భాగాన్ని కుడివైపు ఉన్న మెదడు, కుడివైపు
శరీర భాగాన్ని ఎడమవైపు మెదడు కంట్రోల్ చేస్తాయి.
ఇంకా చూడండి:
»ఇళ్లలో ఉన్న ఫ్యాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు తేడా ఏమిటి ?
»పెన్సిల్ గురించి మీకు ఎంతవరకు తెలుసు ?
»భోజనం తర్వాత నిద్ర వస్తుంది ఎందుకు?
»మహామహులు
» భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి