చింపిరి చింపిరి గుడ్డలు కట్టుకొని ముత్యాల్లాంటి బిడ్డల్ని కన్నది - తెలుగు బిట్స్



 సామెత దీని ఆధారంగా రూపొందించబడింది ? 
ఎ. ఊహ 
బి. సామ్యత
సి. విషమత 
డి. ఏదీకాదు

 సామెతను తమిళంలో కింది విధంగా పిలుస్తారు ? 
ఎ. సుభాషితం 
బి. పళచోల్లు
సి. సామెతె 
డి. గాదె

 విద్యార్థులకు మెదడుకు మేత లాంటివి? 
ఎ. సామెతలు 
బి. జాతీయాలు
సి. పొడుపుకథలు 
డి. పైవన్నీ

 ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ కింది అంశంలో డాక్టరేట్‌ పొందినారు ? 
ఎ. సామెతలు 
బి. కథలు
సి. పొడుపుకథలు 
డి. నవలలు

 చింపిరి చింపిరి గుడ్డలు కట్టుకొని ముత్యాల్లాంటి బిడ్డల్ని కన్నది. 
ఈ పొడుపు కథ విప్పండి ? 
ఎ. వరికంకి 
బి. మొక్కజొన్న
సి. అరటిపండు 
డి. ఏదీకాదు

 నీడజము అనగా పక్షి అని అర్థము. దీనికి వ్యుత్పత్తి ఏమిటి ? 
ఎ. కొండల యందు జన్మించినది
బి. నీడను ఇచ్చునది.
సి. గూటి యందు పుట్టునది
డి. ఏదీకాదు

 శివుడు, రుద్రుడు, శంకరుడు..ఈ పదానికి అర్థాలు ? 
ఎ. హవ్యవాహనుడు 
బి. నృపాలుడు 
సి. ఇంద్రుడు 
డి. శంభుడు

పక్షి అనే అర్థాన్నిచ్చే పదాలు ఏవి ? 
ఎ. మంచు, తుహినం, హిమం
బి. ఖగం, విహంగం, పులుగు
సి. హరిణం, సారంగం, మృగం
డి. ఏదీకాదు

ఒక పదానికి అనేక అర్థాలు ఉంటే, వాటిని ఏమంటారు ? 
ఎ. పర్యాయపదాలు 
బి. నానార్థాలు
సి. జాతీయాలు 
డి. ఏదీకాదు

 గురువు అనగా ఉపాధ్యాయుడు. వేరొక అర్థం ఏమిటి ? 
ఎ. ఇంద్రుడు 
బి. ప్రభువు
సి. బృహస్పతి 
డి. ఏదీకాదు

 ఉద్యోగము అనగా పని అని సాధారణంగా అర్థం కలదు. మరొక 
అర్థమేదో క్రింది వానిలో గుర్తించండి ? 
ఎ. సంపద 
బి. సామర్థ్యం
సి. యత్నము 
డి. ఏదీకాదు

. బోనము అనే వికృతి పదానికి ప్రకృతి పదం ఏమిటి ? 
ఎ. భోజనము 
బి. ఫలారం
సి. అన్నం 
డి. పైవన్నీ

 వెజ్జు అనే వికృతి పదానికి ప్రకృతి ఏమిటి ? 
ఎ. ఒజ్జ 
బి. సజ్జ
సి. వైద్యుడు 
డి. ఉపాధ్యాయుడు

 పంక్తి అను ప్రకృతి పదమునకు వికృతి ఏమిటి ? 
ఎ. పంతి 
బి. బంతి 
సి.పొంతి 
డి. ఏదీకాదు

 ఆరితేరు జాతీయాన్ని ఈ సందర్భంలో వాడతారు ? 
ఎ. ఒక వ్యక్తి నిపుణత మరియు సమర్థతను గూర్చి చెప్పునపుడు
బి. ఒక వ్యక్తి కర్తవ్యదీక్ష గురించి చెప్పునపుడు
సి. ఒక వ్యక్తి మొండి ధైర్యం గురించి చెప్పునప్పుడు
డి. ఏదీకాదు

 స్పందించకుండా ఉండు అనే అర్థాన్నిచ్చే జాతీయం ? 
ఎ. నిమ్మకు నీరెత్తు 
బి. నివురుగప్పిన నిప్పు
సి. ఆపట్టు 
డి. ఏదీకాదు

 పులివాతపడడం అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడుతారు ? 
ఎ. ప్రమాదపరిస్థితుల్లో ఉన్నారను సందర్భంలో 
బి. ధైర్యసాహసాలు ప్రదర్శించారను సందర్భంలో
సి. పులికి వాతలు పెట్టారు అను సందర్భంలో
డి. ఏదీ కాదు

 భూతకాలిక అసమాపక క్రియ ? 
ఎ. తుమ్మున్నర్థకం 
బి. అనంతర్యార్థకం
సి. క్యార్థకం 
డి. చేదర్థకం

 ఆటపాటలతో కృత్యాలు చేయిస్తూ, విద్యాబోధన చేస్తే విద్యార్థులు బాగా 
     అభ్యసిస్తారు. ఈ వాక్యంలోని అసమాపక క్రియలు ? 
ఎ. క్యార్థకం, తుమున్నర్థకం 
బి. శత్రర్థకం, చేదర్థకం
సి. విధ్యర్థకం, చేదర్థకం 
డి. ఏదీకాదు

నిప్పుచే తడుపుచున్నాడు. ఈ వాక్యంలో లోపించినది ? 
ఎ. ఆసక్తి 
బి. యోగ్యత
సి. ఆకాంక్ష 
డి.పైవన్నీ

 దేవదత్తుడు.. పోవుచున్నాడు. ఈ వాక్యంలో లోపించింది ? 
ఎ. యోగ్యత 
బి. ఆసక్తి
సి. ఆకాంక్ష 
డి. పైవన్నీ

 ఒక ఉపవాక్యం, ఒక ప్రధాన వాక్యంతో కలిసి ఏర్పడే వాక్యము ? 
ఎ. సామాన్య వాక్యము 
బి.సంశ్లిష్ట వాక్యము
సి. సంయుక్త వాక్యం 
డి. ఏదీకాదు

.నాతో ఇన్ని బేరాలు లేవు. అని రచయిత తాతతో అన్నాడు. పరోక్ష 
వాక్యంలోకి మార్చగా.. ? 
ఎ. అన్ని బేరాలు నాతో ఉంటాయా అని రచయిత తాతతో అన్నాడు.
బి. తాతతో బేరాలే లేవని రచియత అన్నాడు.
సి. తనతో ఇన్ని బేరాలు లేవని రచయిత తాతతో అన్నాడు.
డి. ఏదీ కాదు

 వర్షాలు బాగా కురిశాయి. పంటలు బాగా పండాయి. కార్యకారణ సంబంధ 
వక్యంగా మార్చితే ? 
ఎ. వర్షాలు బాగా కురిస్తే, పంటలు పండుతాయి
బి. వర్షాలు బాగా కురవక, పంటలు పండలేదు
సి. వర్షాలు బాగా కురిశాయి కాబట్టి పంటలు పండాయి 
డి. పైవన్నీ

 కర్మణి వాక్యంలో క్రియను ఏ ప్రత్యయం చేర్చబడును ? 
ఎ. అను 
బి. బడు 
సి. అక 
డి.ఏదీకాదు

ఇంకా చదవండి :

భారత దేశం ఉనికి - సరిహద్దు రేఖలు
1857 తిరుగుబాటు
ఆధునిక భారతదేశ చరిత్ర
మహామహులు
ఆధునిక భౌతిక శాస్త్రము
ప్రదేశాలు కనుగొన్న వ్యక్తులు
న్యూమరికల్ / అనలటికల్ ఎబిలిటీ
ఏయే పదవుల్లో ఎవరెవరు ?