పక్షుల గుడ్లు పొదగబడే కాలం ఆయా పక్షుల రకాలను బట్టి వేర్వేరుగా ఉంటుంది.
అలాగే ఆయా ప్రదేశాల ఉష్ణోగ్రతను బట్టి, ఋతువులను బట్టి కూడా గుడ్లు పొదగబడే
కాలంలో కొద్దిగా తేడాలు వస్తాయి.
మనందరికీ తెలిసిన కోడిగుడ్లు పొదగబడడానికి 20 నుంచి 22 రోజుల సమయం
పడితే, పావురం గుడ్ల నుంచి పిల్లలు వచ్చేందుకు 14 నుంచి 18 రోజుల సమయం
పడుతుంది. అలాగే టౌకన్ అనే పక్షి గుడ్లు 18 రోజుల్లో పొదగబడితే హంస గుడ్లు
30 రోజుల పాటు పొదగబడ తాయి.
ఇక పక్షుల్లో అతి పెద్దదైన నిప్పుకోడి గుడ్లు పొదగబడటానికి 42 నుంచి 50 రోజుల
సమయం పడుతుంది. నిప్పుకోడిలాగే దాని గుడ్లు కూడా భారీ సైజులో ఉంటాయి.
అవి అడ్డంగా 11 సెంటీమీటర్లు, నిలువుగా 18 సెంటీమీటర్ల వరకూ కొలతలతో ఉంటూ,
సుమారు 1.4 కిలోల బరువు ఉంటాయి. ఒకో నిప్పుకోడి గుడ్డు సుమారుగా రెండున్నర డజన్ల కోడిగుడ్లకు సమానమవుతుంది.
పక్షులు తమ గూళ్ళను సాధారణంగా చెట్ల పైన, పెద్ద పెద్ద శిలల అంచుల్లోనూ,
గుహల్లోనూ, ఇళ్ళ చూరుల్లోనూ నిర్మించు కుంటాయి. కొన్ని పక్షులు నేలలోనే గుంతలను
తవ్వి గుడ్లను పెడతాయి.
కొన్ని పక్షులు తమ గుడ్లను పొదగనప్పటికీ, చాలా పక్షులు తమ గుడ్లను పొదగడమేగాక,
వాటి నుంచి వచ్చిన పిల్లలు తమకు తాముగా ఆహారాన్ని సంపాదించు కోగలిగేదాకా
వాటిని సంరక్షిస్తాయి. పొదిగే పనిని, పిల్లల్ని సంరక్షించే పనిని ఆడ-మగ పక్షుల్లో ఏదో
ఒకటి గానీ, లేదా రెండూ వంతుల వారీగా గానీ చేస్తుంటాయి.
అయితే కోకిల వంటి ఒకటి-రెండు రకాల పక్షులు మాత్రం ఇలాంటి బాధ్యతలేవీ
తీసుకోకుండా, వేరే గూళ్ళలో గుడ్లను పెట్టి ఊరుకుంటాయి.
గ్రంథాలు – రచయితలు (భారతదేశంలో...) |
గ్రంథాలు – రచయితలు (ప్రపంచంలో...) |
ప్రధాన ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు |
ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు |
భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు |