విశ్వంలో నక్షత్రాలెన్ని?

ఈ విశ్వం మన ఊహకందనంత దూరం వ్యాపించి అనేక వేల కోట్ల నక్షత్ర మండలాలను
 తనలో కలిగి ఉంది. మళ్ళీ ఒకో నక్షత్ర మండలంలోను (గేలక్సీ) కొన్ని వేల కోట్ల నక్షత్రాలు
 ఉన్నాయి. 

అయితే విశ్వంలో ఉన్న నక్షత్ర మండలాల లెక్కే ఇంకా పూర్తిగా తేలలేదు. ఇక నక్షత్రాల 
సంగతి గురించి చెప్పేదేముంటుందని? ఏదేమైనా... ఇప్పటిదాకా శాస్త్రజ్ఞులు చేసిన వివిధ 
పరిశోధనల ఫలితాలను బట్టి ఈ విశ్వంలో సుమారు 10,000 కోట్ల నక్షత్ర మండలాలు 
ఉన్నాయని ఒక అంచనా వేయబడింది. 

ఇందులోని ఒక్కో నక్షత్ర మండలంలోనూ సుమారు 25,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయని
 కూడా శాస్త్రజ్ఞులు ఒక అంచనాకు వచ్చారు.

ఆ లెక్కన మన విశ్వంలో మొత్తం 1,00,00,00,00,000 x 2,50,00, 00,00,000 = 25,00,00,0,00,00,00,00,00,00,000 నక్షత్రాలు ఉన్నాయన్న మాట. 

అంటే సుమారుగా 250 కోట్ల కోట్ల నక్షత్రాలన్న మాట. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. 
వాస్తవానికి ఇంతకన్నా చాలా పెద్ద సంఖ్యలోనే నక్షత్రాలు ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు 
అంటున్నారు. 

ఏదేమైనా ఇన్ని కోట కోట్ల నక్షత్రాలలో (పాలపుంత లేక మిల్కీవేలో ఉన్న) మన 
సూర్యుడూ ఒక నక్షత్రమేననీ, ఆ సూర్యుడి చుట్టూ తిరిగే కొన్ని గ్రహాలలో భూమి అనబడే 
ఓ గ్రహంపైన మనం జీవిస్తున్నామని మీకు తెలిసిందేగా.