గోంగూరను ఉత్తర మండలం( తెలంగాణ) లో ఏ విధంగా పిలుస్తారు ? - టెట్‌ మెటీరియల్‌ - తెలుగు





 కర్మణి వాక్యంలో క్రియను ఏ ప్రత్యయం చేర్చబడును ? 
ఎ. అను
బి. బడు 

సి. అక
డి.ఏదీకాదు

 కర్తిరి వాక్యం నుండి కర్మణిలోనికి మార్చునపుడు ? 
ఎ. కర్తను ద్వితీయా విభక్తితో కలిసి ఉండేలా రాయాలి
బి. కర్తను తృతీయా విభక్తితో కలిసి ఉండేలా రాయాలి
సి. కర్త, చతుర్థీ విభక్తితో కలిసి ఉండేలా రాయాలి
డి. ఏదీ కాదు

 సంశ్లిష్ట, సంయుక్త వాక్యాల్లో ఈ వాక్య లక్షణాలుండును? 
ఎ. క్రియారహిత
బి. అకర్మక
సి. సామాన్య వాక్య
 డి.సకర్మక

క్రియారహిత వాక్యాల్లో మొదటి నామాన్ని ఏమంటారు ? 
ఎ. విభక్తి ప్రత్యయమం
బి.నిర్ధారణం
సి. ఉద్దేశం
 డి.నామవాచకం

 భూత కాలిక అనుమాపక క్రియను ఏమంటారు ? 
ఎ. క్వ్తార్థకం
బి. శత్రర్థకం
సి. మతుబర్థకం
 డి.చాత్మార్థకం

వాక్యంలోని పదాలు పరస్పరం అన్వయం కలిగివుండటం ? 
ఎ. ఆకాంక్ష
 బి.ఆసక్తి
సి. విధేయం
డి. యోగ్యత

 జరగాల్సిన వాప్యారాలను సూచించేది ? 
ఎ. క్వ్తార్థకం
బి.చేదర్థం
సి. శత్రర్థకం
డి. ఏదీకాదు

 వివేకానందుడు నాకు మర్గాదర్శకుడు. ఇది ? 
ఎ. ఆత్మార్థకం
బి.ప్రేరణార్థకం
సి. విద్యర్థకం
డి. అనుమత్యర్థకం

 సమాపక క్రియలతో కూడిన పదాలను నామ పదాలుగా కూర్చడం ? 
ఎ. నామ్నీకరణం
 బి.సంశిష్టం 
సి. సంయుక్తం
డి. సామాన్యం

 తాను రసజీవినని చాసో అన్నాడు. ఇది ? 
ఎ. ప్రత్యక్షం
బి. పరోక్షం
సి. కర్మణీ
డి. కర్తరీ

 ఇనా ప్రత్యయం దేనికి చేరుతుంది ? 
ఎ. చేదర్థకం
 బి.శత్రర్థకం
సి. క్వ్తార్థకం
డి. అప్యర్థకం

 లోకములో ఈ సూత్ర శబ్దమునకు కీలకమనెడి యర్థమున్నది. ఈ వాక్యానికి సరైన ఆధునిక ప్రామాణిక భాషా వాక్యం ? 
ఎ. లోకంలో ఈ సూత్రశబ్దానికి కీలకము నర్థము కలదు.
బి. లోకంలో ఈ సూత్ర శబ్ధానికి కీలకమనెడి యుద్ధం కలదు.
సి. లోకమునందు ఈ సూత్ర శబ్దానికి కీలకమనే అర్థం ఉంది.
డి. లోకంలో ఈ సూత్ర శబ్దానికి కీలకమనే అర్థముంది

నీ కంఠంబు కౌగిలించి పట్టుకొని వచ్చెదను. ఈ వాక్యమును వ్యవహారభాషలో ఇలా రాస్తారు ? 
ఎ. నీ కంఠము కౌగిలించి పట్టుకొని వచ్చెదను 
బి. నీ కంఠంబు కౌగలించి పట్టుకొని వస్తాను
సి. నీ కంఠంబు పైవవేసి పట్టుకుని వచ్చెదను
డి. నీ కంఠాన్ని కౌగిలించుకుని పట్టుకొని వస్తాను

 ముహూర్తం, అంతస్థు అనునవి అర్థసామ్యత/ అర్థోత్కర్షకు ఉదాహరణలు, అయితే వీటికి సంబంధించిన పదాలు కింది వానిలో గుర్తించండి ? 
ఎ. శర్కరకేళి
 బి.చీర, కోక
సి. చాందసుడు, దేవదాసి
డి. వైతాళికుడు, ముహూర్తం

ప్రాచీనార్థంలోని పదం నవీనార్థంలోని నీచమైతే ? 
ఎ. అర్ధాపకర్ష
బి.అర్థసంకోచం
సి. సభ్యోక్తి
డి. అర్థసౌమ్యత

మొక్కజొన్న, నారదసింహాచలం, చక్రకేళి వీటికి ఉదాహరణ ? 
ఎ. సభ్యోక్తి
 బి.అలంకారిక ప్రయోగం
సి. లక్ష్యార్థసిద్ధి
డి. లోకనిరుక్తి

 ముష్టి అనగా మల్లయుద్ధం కాని నేడు బిక్ష యాచించడం అని అర్థం, ఇది ? 
ఎ. లక్ష్యార్థసిద్ధి
 బి. అర్థ వ్యాకోచం
సి. అర్థ సంకోచం
డి. అర్థగ్రామ్యత

 చీర అంటే వస్త్రం అని అర్థం. ప్రస్తుతం స్త్రీలు ధరించే వస్త్ర విశేషమని అర్థం. ఇటువంటి అర్థ పరిణామాన్ని అర్థసంకోచం అంటారు. క్రింది వాటిలో అర్థ సంకోచం జరిగిన పదాలు ? 
ఎ. చందమామ, వస్తాదు, కోరిక
బి. ఛాందసుడు, కైంకర్యం, పత్రం
సి. సీసా, నూనె, ముష్టి
డి. ఆర్యాధుడు, సీసా, పత్రం

మొదటి పరిమితార్థాన్ని బోధించే పదం, కాలక్రమంలో విస్తృతర్థాన్ని బోధించుటను ఏమంటారు ? 
ఎ. అర్థ సంకోచం
బి. అర్థ గ్రామ్యత
సి. అర్థసౌమ్యత
డి. అర్థవ్యాకోచం

 ఒకనాడు నిందార్థంలో వాడబడిన పదం, కాల క్రమంలో గౌరవార్థకంగా ప్రయోగించడాన్ని ఏమంటారు ? 
ఎ. అర్థోత్కర్ష
బి.అర్థాపకర్ష
సి. అర్థ సంకోచం
డి. అర్థ వ్యాకోచం

 మక్కా జొన్న జనవ్యవహారంలో మొక్కజొన్నగా మారడం ? 
ఎ. అలంకారిక ప్రయోగం
 బి.సభ్యోక్తి
సి. లోక నిరుక్తి
 డి. ఏదీకాదు

ఉచ్ఛారణలో కొంత వైవిధ్యం కల్గి, ఒక వృత్తికో కులానికో పరిమితమైన భాషను ఏమంటారు ? 
ఎ. గ్రాంథికము
బి. మాండలికము
సి. జాతీయము
డి. ఏదీకాదు

వ్యక్తులు పుట్టి, పెరిగిన ప్రాంతాన్ని అనుసరించి ఏర్పడిన భాషాభేదమును ఏమంటారు
ఎ. వర్గ మాండలికం
 బి. వైయుక్తిక మాండలికం
సి. ప్రాంతీయ మాండలికం
డి. ఏదీకాదు

గోంగూరను ఉత్తర మండలం( తెలంగాణ) లో ఈ కింది విధంగా పిలుస్తారు ? 
ఎ. గోగాకు
బి.పుంటికార
సి. గోంగూర
డి. పైవన్నీ

మధ్య మండలానికి చెందినవి ? 
ఎ. మహబూబ్‌నగర్‌, ఖమ్మం
బి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు.
సి. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం.
డి. కడప, కర్నులు, చిత్తూరు, అనంతపురం.