ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమికోన్నత పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడానికి అనుసరించే పద్ధతి ఏది? టెట్‌ : ఈ ప్రశ్నలు రావచ్చు



tet exam కోసం చిత్ర ఫలితం


విద్యార్థి నమ్మకంగా తన పరిశీలనను నమోదు చేయుట ఈ వాక్యం ఏ ముఖ్య లక్షణాన్ని
సూచిస్తుంది?
1. అవగాహన
 2.వైఖరి
3. నైపుణ్యం
4.జ్ఞాపకం

ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానము12 బోధించుటలో మూల లక్ష్యం ?
1. శాస్త్రీయ దృక్పథం పెంపొందించుట
2. శాస్త్రము పట్ల అభిరుచి పెంచుట
3. సృజనాత్మకతను పెంపొందించుట
4. పర్యావరణాన్ని పరిశీలించుట

పరిసరాల విజ్ఞానం-2 ముఖ్యోద్దేశం ?
1. శాస్త్రీయ వైఖరిని పెంపొందించుట
2. ఎక్కువ మార్కులను స్కోరు చేయడం
3. ప్రయోగాలను ఎక్కువగా చేయడం
4. పరిసరాలపై శాస్త్రీయ అవగాహనను కలిగించుట

 విద్యార్థులను వేసవిలో పుష్పించే పూల పేర్లు చెప్పండి? అని ప్రశ్నించడం
1. జ్ఞానం
2.అవగాహన
3.వినియోగం
4.నైపుణ్యం

'విద్యార్థులు మానవుని గత చరిత్రకు వర్తమానమునకు గల సంబంధమును గమనింతురు'
 అని ప్రధాన సామర్ధ్యమునకు ఈ కింది వాటిలో ఏది సరైన ఉపసామర్ధ్యం?
1. జీవితంలో పనియొక్క ప్రాముఖ్యతను గుర్తించెదరు
2.విద్యార్థులు పనిముట్లలో వచ్చిన క్రమరూప ప్రగతిని గమనించెదరు
3.పాఠశాల, ఆస్పత్రి వంటి పబ్లిక్‌ స్థలముల ప్రాముఖ్యతను గుర్తించెదరు
4.ఇల్లు యొక్క ఆవశ్యకతను ప్రశ్నించెదరు.

జ్ఞానేంద్రియాలు ఎన్ని? అవి ఏవి ? ఈ ప్రశ్న యొక్క లక్ష్యం ?
1. అవగాహన
2.జ్ఞానం 
3. నైపుణ్యం
 4.వినియోగం

 వినియోగం లక్ష్యం యొక్క స్పష్టీకరణ
1. నూతన పద్ధతులను సూచించుట
2.దోషాలను గుర్తించి సరిచూడటం
3.ఫలితాలను సరిచూడటం
4.ఇచ్చిన కొలతలను బట్టి పట్టాలు, రేఖా చిత్రాలు గీయడం

విద్యార్థి ప్రతి ఉపకరణాన్ని వీలైనన్ని విధాల ఉపయోగిస్తాడు. ఇది ఏ లక్ష్యానికి
సంబంధించిన స్పష్టీకరణ?
1. అవగాహన
 2.జ్ఞానం
3. వినియోగం
4.నైపుణ్యం

కొఠారి కమిషన్‌ సూచించిన ప్రాథమిక దశలోని లక్ష్యాలు, బోధనాంశాలలో ఒకటి.
1. పరిశీలనాత్మక దృష్టిని పెంపొందించడం
2.జ్ఞాన సముపార్జనతో పాటు తార్కికంగా ఆలోచించడం
3.నిర్ణయాలు చేసుకొనే సామర్ధ్యాన్ని పెంచడం
4.విస్తృత పఠనానికి దోహదం చేయడం

. సాధారణీకరణం అనగా..
1. పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత కూడా ఉన్న వివరణ 
2.సిద్ధాంతాలను సూత్రీకరించుట
3.పరికల్పనలను ప్రతిపాదించుట 
4.సమస్యలను విశ్లేషించుట

 1986 జాతీయ విద్యా విధానంలో పోల్చ దగిన విద్యా ప్రమాణాలను సాధించడానికి
చేర్చబడిన అంశం?
1. సార్వత్రిక ప్రాథమిక విద్య
2.కనీస అభ్యసన స్థాయి
3. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం
4.మౌల్య విద్య

 విజ్ఞాన శాస్త్ర బోధనోద్దేశ్యం ?
1. శాస్త్ర పరిజ్ఞానం
2. శాస్త్రీయ ఆలోచన 
3. శాస్త్రీయవైఖరి
4.పైవన్నీ

శాస్త్రీయ అభిరుచిని ప్రవర్తన ద్వారా ఎలా పెంపొందించవచ్చు ?
1. పుస్తకాలను చదువుట 
2. శాస్త్రీయ భావాలను గుర్తించుట
3. మాదిరులను సేకరించుట 
4.రాతపరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుట.

 బేసిక్‌ విద్యకు, పని విద్యకు ప్రధాన స్థానం ఇవ్వాలని సూచించింది.
1. ఉన్నత విద్యా కమిషన్‌
2.ఈశ్వరీభాయి పటేల్‌ కమిటీ
3.జాతీయ విద్యా విధానం
4. కొఠారి కమిషన్‌

 ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమికోన్నత పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడానికి అనుసరించే
 పద్ధతి?
1. ఇవిఎస్‌ పద్ధతి 
2.సామాన్యశాస్త్ర పద్ధతి 
3. భౌతిక రసాయన శాస్త్రాలు 
4.భౌతిక శాస్త్ర రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, విభాగాలుగా సైన్సు బోధించడం

పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను, ఉద్దేశ్యాలను రూపు దిద్దేటట్లు చేయడానికి ఒక
 కళాకారుడిగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులమ్‌ అని తెలిపిన వారు?
1. కన్నింగ్‌హావమ్‌
2.బ్లూవమ్స్‌ 
3.కార్ల్‌ పియర్‌సన్‌
4.బ్రూనర్‌

 సాధారణ విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉపయోగించే ప్రశ్న?
1. జతపరుచుట
 2.ప్రత్యామ్నాయ ప్రశ్న 
3. బహుళైచ్ఛిక ప్రశ్న
4.సత్య అసత్య విచక్షణ

 ఇంటి పనిని ఇచ్చుటలో గల లక్ష్యం.
1. విద్యార్థుల క్రమ శిక్షణ 
2.తరగతి గదిలో ఉపాధ్యాయుని భారాన్ని తగ్గించుట
3.విద్యార్థుల్లో క్రవ బద్ధంగా చదువుకునే అలవాటును కలిగించుట 
4. తల్లిదండ్రులకు వారి పిల్లల అభివృద్ధిని తెలుసుకొనుటకు అవకాశ మిచ్చుట.

ఒక ఉపాధ్యాయుడు యూనిట్‌ పరీక్ష కోసం కింది బహుళైచ్ఛిక ప్రశ్నను తయారు చేశాడు.
 ధామస్‌ అల్వా ఎడిసన్‌ కనుగొనినది ?
1. విమానం
 2.గ్రామ్‌ఫోన్‌ 
3.రేడియో
 4.టెలిఫోన్‌

 తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన తగిన మూల్యాంకన పద్ధతి ?
1. సమస్యా నిర్ధారక మూల్యాంకనము
2. సమగ్ర మూల్యాంకనము
3. అంశము వారీ మూల్యాంకనము
4.నిర్మాణాత్మక మూల్యాంకనకము

 విద్యార్థుల ప్రజ్ఞా పాటవాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది.?
1. ప్రత్యక్ష మాపనం
2.పరోక్ష మాపనం
3. సాపేక్ష మాపనం4. వ్యక్తిగత మాపనం

పరిసరాల విజ్ఞానంలో జ్ఞానాన్ని పరీక్షించాల్సివచ్చినపుడు జ్ఞానానికి సంబంధించిన పదజాలాన్ని ప్రక్రియలను, భావనలను పరీక్షిస్తే ఆ పరీక్ష కలిగిన లక్షణం ?
1. సప్రమాణత
 2.విశ్వసనీయత
3. లక్ష్యాత్మకత
4.ఆచరణాత్మకత

 ప్రశ్నా పత్రము తయారు చేయుటలోని సోపానాలు వరుసగా?
1. భారత్వ పట్టికలను తయారు చేయుట
2. బ్లూప్రింట్‌ తయారు చేయుట
3. ప్రశ్నా పత్రమును రూపొందించుట
4. ప్రశ్నవారీ విశ్లేషణ పట్టిక

ఆవాలు-కొవ్వులతు-సోయాబీన్‌..అనే ప్రశ్న ఏ రకానికి చెందిన ప్రశ్న ?
1. వర్గీకరణ ప్రశ్న
2.పూరణ ప్రశ్న
3. సాదృశ్య ప్రశ్న
4.జతపరచే ప్రశ్న

 బ్లూప్రింట్‌లో బ్రాకెట్లు బయల ఉన్న అంకెలు దేనిని తెలియజేయును?
1. ప్రశ్నాపత్ర నిర్మాణ పట్టిక 
2.ప్రశ్నకిచ్చిన మార్కులను
3. లక్ష్యాలను
4.అన్ని

 నాల్గో తరగతిలో నీటిని శుభ్రపరచడం అను పాఠాన్ని బోధించడానికి అనువైన బోధనా పద్ధతి ?
1. ఉపన్యాస పద్ధతి
2.చర్చాపద్ధతి
3. ప్రదర్శనా పద్ధతి
4.ప్రకల్పనా పద్ధతి

5వ తరగతిలోని పక్షులు-ఆహారపు అలవాట్లు అనే పఠాన్ని బోధించేందుకు అనువైన పద్ధతి ?
1. ప్రదర్శనా పద్ధతి
2.ప్రకల్పన పద్ధతి
3. ఉపన్యాస పద్ధతి
4.యూనిట్‌ పద్ధతి

విత్తనాలు మొలకెత్తడానికి కావాల్సిన పరిస్థితులు అనే పాఠ్యాంశాన్ని ఏ పద్ధతిలో
ఉపయుక్తంగా బోధించవచ్చు ?
1. అన్వేషణా పద్ధతి
2.శాస్త్రీయ పద్ధతి
3. పరిశీలనా పద్ధతి
 4.ఉపన్యాస పద్ధతి

నీరు అనే యూనిట్‌ను ఏ పద్ధతి ద్వారా ఉపయుక్తంగా బోధించవచ్చు ?
1. ఉపన్యాస పద్ధతి
2. ప్రాజెక్టు పద్ధతి
3. కృత్యపద్ధతి
4.ప్రదర్శనా పద్ధతి

బావులు తవ్వడం, పొలం దున్నడం, పైరు నాటడం, కాయ గూరలు పండించడం
మొదలైన కృత్యాలు ఏ రకమైన కృత్యరకం?
1. కొనుక్కొనే కృత్యం
2.నిర్మాణాత్మక కృత్యం
3. ప్రదర్శిత కృత్యం
4.పైవన్నీ

 ఎర్ర రక్త కణాలు తయారయ్యే భాగం ? 
1. కండరం
2.ఎముక
3.గుండె
4.ఊపిరితిత్తులు

బొంగరపు కీలు ఉండే శరీర భాగం ?
1. మోచేయి
 2.భుజం
3.మణికట్టు
4.మొడ

రక్తం ఇక్కడ శుభ్రపడుతుంది ?
1. గుండె
2.మూత్రపిండాలు
3.ఊపిరితిత్తులు 4. జీర్ణాశయం

 ఆంత్రరసమును ఉత్పత్తి చేసే అవయవం ?
1.జీర్ణాశయం
 2.నోరు
3.కాలేయం
4.చిన్నపేగు

టోర్నికిట్‌ అనగా ?
1. పాముకాటు గాయానికి 5సె.మీ పైన హృదయం దిశలో గుడ్డను గట్టిగా కట్టడం
2.పాము కాటు గాయానికి 15సెమీ పైన హృదయం దిశలో గుడ్డను గట్టిగా కట్టుట. 
3. పాముకా టు గాయానికి 5సెమీ దిగువన హృదయానికి వ్యతిరేకదశలో గుడ్డను కట్టడం. 
4.పాము కాటు గాయానికి 10 సెమీ దిగువన హృదయానికి వ్యతిరేక దశలో గుడ్డను కట్టుట.

 ప్రథమ చికిత్సకు ఆద్యుడు ?
1. బిస్‌మార్క్‌
2.ఇస్‌ మార్క్‌ 
3.లామార్క్‌
 4.డార్విన్‌

ఆకుల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క ?
1. గులాబి
 2.కరివేపాకు
3.రణపాల
4.ఏదీకాదు

 అత్యంత ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో నివాసం ఏర్పరచుకొనే 
జీవి ?
1. బొద్దింక
 2. దోమ
3. సాలీడు
4.ఈగ

 జీవులను మొక్కలు, జంతువులు అనే రెండు ప్రధాన రాజ్యాలుగా విభజించిన వాడు ?
1. కెరోలస్‌ లిన్నేయస్‌
2.అరిస్టాటిల్‌
3.బెంధమ్‌
4.హుకర్‌

 పుష్పించని మొక్కలను ఏమంటారు ?
1. క్రిఫ్టోగావమ్స్‌
2.ఫానిరోగావమ్స్‌
3.ఏంజియోస్పర్మ్స్‌
4.జిమ్నోస్పర్మ్స్‌

ద్వినామీకరణ సిద్ధాంతమును ప్రవేశ పెట్టినవాడు ?
1.కెరోలస్‌ వాన్‌ లిన్నేయస్‌ 2.జాన్‌రే
3.అరిస్టాటిల్‌
4.గేలస్‌

 అతిపురాతనమైన జీవులు ?
1. ప్రొటిస్టా
2.మొనీరా 3.ఫంగి
4.ఆల్గే

ఒక సంవత్సరం లోపలే పుష్పించి విత్తనాలను ఇచ్చి జీవిత కాలాన్ని పూర్తి చేసుకునే
 మొక్కలు ?
1. ఏక వార్షికాలు 2.ద్వివార్షికాలు 
3. బహువార్షికాలు
4.అన్ని

 ఎముకలు గాలితో నిండి ఉండే జీవులు ?
1. ఉభయ జీవులు
2.క్షీరదాలు 
3.సరీసృపాలు
 4.పక్షులు

 సముద్ర నక్షత్రం ఈ వర్గానికి చెందుతుంది ?
1.ఆర్థోపోడా
 2.మొలస్కా
3.కార్డేటా
4.ఇఖైనోడెర్మాట

ఈ కింది వాటిలో కీటకాహార మొక్క కానిది ఏది?
1. డ్రోసెరా
 2.సెపెంథిస్‌ 
3.డయోనియో
 4.హైబిస్కస్‌

ఈ కిందివాటిలో స్థూలపోషకము ?
1. కార్బన్‌   2.ఐరన్‌
3.కాల్షియం
4.కాపర్‌

వేరు నుంచి నీరు నేలపై ఉండే మొక్క ఇతర భాగాలకి ప్రసరించే ప్రక్రియను ఏమంటారు?
1. ద్రవోద్గమము
2.విసరణ
3.సక్రియారవాణా
4.ద్రవాభిస్మృతి

. అమైనో ఆమ్లాల, న్యూక్లియిక్‌ ఆమ్లాల జీవక్రియలో అంత్య ఉత్పన్నకాలు ?
1. నత్రజని సంబంధిత పదార్ధాలు 
2.కార్బన్‌ సంబంధిత పదార్ధాలు 
3.అకార్బనిక్‌ సంబంధిత పదార్ధాలు 
4.సల్ఫర్‌ సబంధిత పదార్ధాలు

క్వినయిన్‌ ఈ మొక్క బెరడునుండి లభిస్తుంది ?
1. సింకోనా అఫిసినాలిస్‌
2.నికోటియానా టుబాకం
3. పపావరేసి సోమ్నిఫెరవమ్‌
4.రావోల్ఫియా సర్పెంటైనా

వేదకాలం నుంచి మన దేశంలో సాగులో ఉన్న పంట?
1. గోధుమ
2.వరి 3. మిరప
4.మొక్కజొన్న

 అంతర్జాతీయ వరి పరివోధనా కేంద్రం ఎక్కడ ఉంది ?
1. మనీల
 2.టోక్యో
3.సింగపూర్‌
4.కౌలాలంపూర్‌

 ఇండియన్‌ రైస్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ ఇక్కడ ఉంది.
1.మనీల
2.కటక్‌
3.ఢిల్లీ
4.ముంబై

పప్పు ధాన్యాలలో ఎక్కువగా ఉండే పోషక పదార్ధాలు ?
1. కార్బోహైడ్రేటులు
2.మాంసకృత్తులు 
3.విటమినులు
 4.ఖనిజ లవణాలు

 మలేరియా నివారణకు వాడే మందు పేరు?
1. అట్రోవిన్‌
2.క్వినైన్‌
3.బ్రూసిన్‌
4.మార్ఫిన్‌

 ఎలుకల్ని చంపడానికి ఉపయోగించేది ?
1. జింక్‌
 2.జింక్‌ నైట్రేట్‌
3. జింక్‌ ఫాస్పైడ్‌
4.జింక్‌ క్లోరైడ్‌

ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఏ నేలలకు ప్రసిద్ధి?
1. నల్లరేగడి
2.ఒండ్రు నేల
3.ఎర్రనేల
4.ఇసుక నేల

రక్త పుష్టికి కావాల్సిన ఖనిజ లవణం ?
1. కాల్షియం
2.ఇనుము
3.భాస్వరం
4.నత్రజని

 మైలుతుత్తం రసాయనిక నామం?
1. అమ్మోనియం సల్ఫేట్‌
2.కాపర్‌ సల్ఫేట్‌
3. సోడియం సల్ఫేట్‌
4.ఏదీకాదు

 ఇసుక నేలలకు నీటిని నిలుపుకునే సామర్థ్యం ?
1. తక్కువ
 2.వెక్కువ
3.పై రెండు
4.ఏదీకాదు

 ధృవ ప్రాంతపు ప్రజలు నివసించే ఇల్లు ?
1. ఇగ్లూ
2.భవనం
3.మట్టిఇల్లు
4.మంచె

. గాలిలో నత్రజని, ఆక్సిజన్‌ల నిష్పత్తి ?
1. 4:1
 2.1:4
3.3:2
4.2:3

 టీకాలు వేసే పద్దతిని కనుగొన్న శాస్త్రవేత్త ?
1. అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌
2.సి.వి రామన్‌
3.ఎడ్వర్డ్‌ జన్నర్‌
4.జెసి బోస్‌

కార్బన్‌ మోనాక్సైడ్‌ రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలవడం వల్ల ఏర్పడును?
1. కార్బన్‌కి హిమోగ్లోబిన్‌
2.మోనాక్సిహిమోగ్లోబిన్‌
3.నైట్రాక్సి హిమోగ్లోబిన్‌
 4.ఏదీకాదు

 ప్రపంచంలో 1/3 వంతు ఆక్సిజన్‌ దీని ద్వారా లభిస్తుంది ?
1. కాంగో పరివాహక ప్రాంత అడవుల ద్వారా
2.గంగా పరివాహక ప్రాంత అడవుల ద్వారా
3.అమెజాన్‌ పరివాహక ప్రాంత అడవుల ద్వారా
4.గోదావరి పరివాహక ప్రాంత అడవుల ద్వారా

 ప్లోస్కోడియం పరాన్న జీవిని కనిపెట్టినవాడు ?
1. పాట్రిక్‌ మాన్‌సన్‌
2.చార్లెస్‌ లావిరన్‌
3.సర్‌ రోనాల్డ్‌ రాస్‌
4.లూయీ పాశ్చర్‌

 సోల్మొనెల్లా టైపై బాక్టీరియా కలుగచేయు వ్యాధి ?
1. కలరా
2.టైఫాయిడ్‌
3.క్షయ
4.ధనుర్వాతం

 నాలుక తడి ఆరిపోవుట, కళ్లు గుంటలు ఏర్పడుట, కండరాల నొప్పులు కలుగుట
ఈ వ్యాధి లక్షణాలు ?
1. టైపాయిడ్‌
2.డిఫ్తీరియా
3.కలరా 4.టెటనస్‌

గవదబిళ్లలు కలిగించు వైరస్‌ ?
1. మిక్సోవైరస్‌ పెరోటైటిస్‌
2.ఆర్భోవైరస్‌
3. పారామిక్సో వైరస్‌
4.ఏదీకాదు

 పోలియో వ్యాధివల్ల ఈ జీవవ్యవస్థ ప్రభావానికి గురవు తుంది ?
1. జీర్ణవ్యవస్థ
2.నాడీవ్యవస్థ
3.రక్తప్రసరణ వ్యవస్థ
4.విసర్జన వ్యవస్థ