పాముల్లోని ఓ ప్రత్యేక గుణం వల్ల ఇది జరుగుతుంది. పాము జీవించి ఉన్నంత
కాలం వాటి శరీరం పెరుగుతూనే వుంటుంది. పాము వయసు పెరిగేకొద్దీ ఈ పెరుగుదల
తగ్గుతుంది.
పాము శరీరం పెరిగినప్పుడు చర్మం చిన్నదవుతుంది. దానికి తోడు ఇది నేలమీద
పాకుతున్నప్పుడు రాళ్లు రప్పలు, చిన్న చిన్న పొదలు చర్మాన్ని గీరుకుని చర్మం
గాయపడుతుంది.
ఇటువంటి చర్మాన్ని పాము గరకుగా ఉన్న ప్రదేశానికి తన శరీరాన్ని ఒరిపిడి చేసి
కుబుసాన్ని (చర్మాన్ని) విడుస్తుంది. కుబుసం విడుస్తున్నప్పుడు చర్మం లోపలి
భాగం బయటకు, వెలుపలి భాగం లోపలికి మారుతుంది.
ఇలా జరగడం వల్ల దాని శరీరానికి ఎలాంటి హానీ జరగదు. ప్రపంచంలోని
2,400 రకాల పాములకు ఈ లక్షణం ఉంది.