భూమికి - సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డంగా వచ్చి చంద్రుని నీడ భూమి మీద పడటం
సూర్య గ్రహణం అయితే, చంద్రుడికి - సూర్యుకి మధ్య భూమి అడ్డుగా వచ్చి భూమి నీడ
చంద్రుని మీద పడటాన్ని చంద్ర గ్రహణం అంటున్నాము.
ఈ రెండు రకాల గ్రహణాల్లోనూ చంద్రుడు నిర్వహించే పాత్ర చాలా ముఖ్యమైనది.
ఎందుకంటే ఒకవేళ చంద్రుడు మన భూమికి ఇప్పుడున్నంత దూరంలో కాక చాలా
దూరంలో గాక చాలా దూరం (17,000 కి.మీ. ల దూరం) జరిగిపోయినట్లయితే అప్పుడు
ఏ సందర్భంలోనూ చంద్రుని నీడ భూమి మీద పడటం గాని, లేదా భూమి నీడ చంద్రుని
పైన పడటం గాని జరగదు.
అంటే దాని అర్థం అప్పుడు సూర్యగ్రహణం గాని, చంద్రగ్రహణం గాని ఏర్పడవు. ఇలాంటి
గ్రహణాలు లేని రోజు కూడా వస్తుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. అదెలాగంటే...
.
మనకు కన్పించినా కన్పించక పోయినా చంద్రుడు మన భూమి నుంచి క్రమ క్రమంగా
దూరం జరుగుతూ ఉన్నాడు. ఏడాదికి 4 సెంటీ మీటర్ల చొప్పున చంద్రుడు భూమికి
దూరమవుతున్నాడు.
ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కల ప్రకారం ప్రస్తుతం భూమికి - చంద్రుడికి మధ్య ఉన్న సగ టు
దూరం మరో 4.6 శాతం అంటే 17,000 కి. మీ.లు పెరిగి నట్లయితే ఇక అప్పుడు ఎలాంటి
గ్రహణాలు ఏర్పడేందుకు ఆస్కారం ఉండదు.
ఇది జరిగేందుకు సరిగ్గా ఇంకో 50 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ ఏ కారణం
వల్లనయినా చంద్రుడు భూమి నుంచి దూరం జరిగే వేగం బాగా పెరిగినట్లయితే అప్పుడు
'గ్రహణాలు లేని కాలం' మరింత ముందుగా వస్తుంది.
ఇంకా చదవండి:
జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్
ఏపిసెట్/నెట్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్
జలసంధులు గురించి తెలుసా ?
నెపోలియన్ ఏ సంవత్సరంలో మరణించాడు ?
తప్పు జరిగింది ఎవరికి చెప్పుకోవాలి?
కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?