బేరింగ్ జలసంధి : ఇది ఈశాన్య ఆఫ్రికాలోని సైబీరియాను ఉత్తర అమెరికాలో
వాయువ్య ప్రాంతమైన అలస్కాను కలుపుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం
96 కి.మీ.
మాజిలాన్ జలసంధి : ఇది దక్షిణ అమెరికా చివర, అర్జెంటీనా వద్ద పసిఫిక్
మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతున్న జలసంధి.
డేవిస్ జలసంధి : ఇది గ్రీన్‌లాండ్, లాబ్రాడర్ ప్రాంతాలను కలుపుతుంది.
ఇది అతిపెద్ద జలసంధి.
బాఫిన్ జలసంధి : ఇది గ్రీన్‌లాండ్ను, బాపిన్ దీవులను కలుపుతుంది.
డెన్మార్క్ జలసంధి : ఇది గ్రీన్‌లాండ్కు, ఐస్‌లాండ్‌కు మధ్యలో ఉంది.
డోవర్ జలసంధి : ఇది ఫ్రాన్స్ బ్రిటన్ దేశాల మధ్య ఇంగ్లీష్ ఛానల్‌ను ఉత్తర
సముద్రంలో కలుపుతుంది.
జీబ్రాల్డర్ జలసంధి : ఇది ఆఫ్రికా యూరప్ ఖండాల మధ్యలో ఉంది. దీనిని
'మధ్యధరా సముద్రం తాళం చెవి' అంటారు.
మలక్కా జలసంధి : ఇది మలయా దీవులను ఆంటీల దీవులను హిందూ
మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంలో కలుపుతుంది.
టోరస్ జలసంధి : ఇది ఆస్ట్రేలియా, న్యూగినియా దీవులను కలుపుతుంది.
బాస్ జలసంధి : ఇది ఆస్ట్రేలియాను, టాస్మేనియాను దీవులను కలుపుతుంది.
ఫ్లోరిడా జలసంధి : ఇది అమెరికా, క్యూబా మధ్యలో ఉంది. మెక్సికో
సింధూశాఖ, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది.
బాస్‌పోరిస్ : నల్లసముద్రం, మధ్యధరా సముద్రంను కలుపుతుంది.
బాబ్-ఎల్-మాన్‌డెడ్ : అరల్, ఎర్ర సముద్రాన్ని కలిపే సన్నని జలసంధి.
హర్ముజ్ : పర్షియా సింధుశాఖ, ఒమన్ లను కలుపుతుంది. ఇది వ్యూహాత్మక
జలసంధి.
పాక్ జలసంధి : మన్నారు సింధు శాఖ బంగాళాఖాతాన్ని కలుపుతుంది. ఇది
భారత్, శ్రీలంకను కలుపుతుంది.
కొరియా జలసంధి : కొరియా, జపాన్‌లను కలుపుతుంది. ఇది జపాన్ సముద్రానికి,
తూర్పు సముద్రానికి మధ్య ఉంది.
మలక్కా జలసంధి : సమత్రా దీవులు, మలేషియా మధ్య ఉంది. ఇది ఆగేయ ఆసియా
దేశాలకు ప్రధాన వాణిజ్య మార్గాలు
సుండా జలసంధి : జావా సముద్రం హిందూ సముద్రంలను కలుపుతుంది. జావా,
సుమత్రా దీవుల మధ్య ఉంది.
కుక్ జలసంధి : ఇది న్యూజిల్యాండ్‌లోని ఉత్తర దక్షిణ ద్వీపాలను కలుపుతుంది.
ఇంకా :
జీవిత కాలంలో నీరు త్రాగని జీవి ఎక్కడ ఉంది ?
పెన్సిల్ గురించి మీకు ఎంతవరకు తెలుసు ?
ఇళ్లలో ఉన్న ఫ్యాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు తేడా ఏమిటి ?
యాగాలు ఎన్ని రకాలు ?
తలస్నానం ఏరోజు చేయాలి?