ప్రపంచంలోనే అత్యంత విలువయిన కోహినూర్ వజ్రం గురించి తెలుసా ?





కోహినూర్ వజ్రం కోసం చిత్ర ఫలితం



భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూరు
కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల
(21.6 గ్రాములు)వజ్రము.
కోహినూరు వజ్రం తెలుగునాట కొల్లూరు గనులులో ఈ ప్రఖ్యాతమైన వజ్రం లభించింది.
మాల్వా రాజు మహలక్ ‌దేవ్‌ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు.
ఆయన చేతిలో క్రీ.శ.1300లో ఈ వజ్రం ఉండేదని, క్రీ.శ.1305లో వింధ్యకు నర్మదకు మధ్యభాగాన్ని
దాదాపు వేయి సంవత్సరాలు పరిపాలించిన మాల్వా పాలకవంశాన్ని తుదకు అల్లాఉద్దీన్
 జయించి అక్కడి ధనరాశులన్నిటితో పాటుగా కోహినూరును కూడా స్వాధీనం
చేసుకున్నారు



1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , 
కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు
ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు
మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్
రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు.


ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా 
బాబర్ 
వశమయ్యింది. హుమాయున్‌కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు
అతని తండ్రి 
బాబర్  తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యవస్తువులు
దానం చేయాల్సిందిగా సలహాఇచ్చారు. తనవద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం
ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆపైన కొద్దిరోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసినా వజ్రాన్ని నిలపుకున్నారని అక్బరునామాలో వ్రాశారు. ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది.

క్రీ. శ. 1913వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్‌ రాజుల నుంచి పంజాబ్‌పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌దీన్ని సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన
దులీప్‌సింగ్‌ ద్వారా బ్రిటిష్‌ గవర్నర్‌ 
లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు.



రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది. సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా
ఎనబై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం
చేయించి ఆమె ధరించింది.
హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి దక్కినది
1877లో విక్టోరియా మహారాణి హిందూదేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలయినపుడు ఆమె
కిరీటములో ప్రధానమైన వజ్రముగా పొదగబడింది.
బాబర్ నామాలో మొఘల్‌ చక్రవర్తి బాబర్ కోహినూర్‌ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ "ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్‌ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది' అన్నాడు.


కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారు ఉన్నారు
బ్రిటిష్‌ రాజకుటుంబం కోహినూరు వజ్రాన్ని ఆ ఇంటి పెద్దకోడలికి వారసత్వ కానుకగా ఇస్తోంది.
బాబర్ చక్రవర్తి నూట ఎనభైఆరు క్యారెట్ల బరువైన ఆ వజ్రం ఖరీదు 'ప్రపంచానికంతా రెండున్నర రోజులు భోజనం పెట్టినంత' అన్నాడట
ఆల్బర్ట్‌ యువరాజు దానిని సానబట్టిస్తే రెండువేల వజ్రాలు అరిగిపోయాయి. బరువు
నూటఅయిదు క్యారెట్లకు పడిపోయింది




నీటిలో మేకు మునుగుతుంది ఓడ తేలుతుంది ఎందుకు?
పిల్లి చీకట్లో ఎలా చూడగలదు?
భోజనం తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది?
కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?
నరదిష్టి అనేది నిజంగా ఉందా?
దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవాలయంలో చేయకూడని పనులు ఏమిటి?
మంగళవారం పనిని మొదలు పెట్టకూడదా?
నిద్ర లేవగానే ఎవర్ని చూస్తే ఆ రోజంతా శుభప్రధం అవుతుంది
ఇంటికి ఎన్ని పిల్లర్స్ ఉండాలి?
టీ బ్యాగ్‌ల తయారీ పరిశ్రమ
శారీ ఫాల్స్‌ తయారి పరిశ్రమ
పుట్టగొడుగుల (మష్రూమ్) ఉత్పత్తి