I.Q (''ఇంటిలిజెంట్‌ కోహియంట్‌'' ) అంటే ఏమిటి ? మీ ఐ.క్యు ఎంత ? ఐ.క్యు పెంచుకోవడం ఎలా ?



 మనిషి తెలివితేటల స్థాయిని నిర్ణయించడానికి మనస్తత్వ శాస్త్రవేత్తలు రూపొందించిన 
సంవిధానాన్ని ఐ.క్యు అంటారు. దీని పూర్తి పేరు ''ఇంటిలిజెంట్‌ కోహియంట్‌'' దీన్ని సంఖ్యా 
రూపంలో పేర్కొంటారు. 

ఇందులో ముఖ్యమైనవి రెండు. ఒకటి వ్యక్తి యెక్క మానసిక వయసు, రెండవది వ్యక్తి
 అసలు వయసు.

           ఒక వ్యక్తి ఐ.క్యు. తెలుసుకోవాలంటే అతని మానసిక వయసును అతని వయసుతో 

భాగించి, ఆ భాగఫలాన్ని వందతో గుణించాలి. వచ్చిన దాన్ని అతని ఐ.క్యు. గా నిర్ధారిస్తారు. 
ఒక వ్యక్తి ఐ.క్యు. 130-140 మధ్య వుంటే అతనిని చాలా తెలివైన వానిగా గుర్తించవచ్చు. 
100 వుంటే ఒక మాదిరి తెలివిగల వానిగా, 70 లేక అంతకంటే తక్కువ వుంటే మానసిక
వైకల్యం గల వానిగా, మంద బుద్ధిగా పరిగణించాలి.


           అర్థం చేసుకునే లేక నేర్పగలిగే శక్తిని ఇంటెలిజెన్స్‌ లేక తెలివి అని మానసిక 
శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందులో తల్లిదండ్రుల జన్యువుల ద్వారా సంక్రమించే లక్షణాలు, 
పెరిగే పరిసరాలు, మానసిక ఆరోగ్యం, అభ్యాసం, బోధన అనే అంశాలపై ఒక వ్యక్తి యెక్క 
తెలివితేటలు ఆధారపడి వుంటాయి.

ఐ.క్యు. పెంచుకోవడం ఎలా...?

మీరు ప్రతిభా వంతులుగా తయారయి, కెరీర్‌లో ముందుకు దూసుకుపోవాలంటే 
ఐ.క్యు.స్థాయిని పెంచుకోవడమెలాగో తెలుసు కుంటారా.

మీరంతా ప్రతిరోజు పత్రికలు చదవాలి వార్తలు వినాలి. విజ్ఞాన సంబంధ కార్యక్రమాలను 
చూడాలి. మీకు దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి వెళ్లి అక్కడ ఉన్న నీతికథల పుస్తకాలను,
 గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను, వ్యక్తిత్వ వికాస పుస్తకా లను చదవాలి. దీని వలన 
ప్రపంచంలో జరిగే విషయాలను, చారిత్రకాంశాలను, విజ్ఞాన విశేషా లను, సమాజంలో 
వస్తున్న మార్పు లను తెలుసుకుంటారు.

అలాగే డిస్కవరీ ఛానెల్‌, ఏనిమల్‌ ప్లానెట్‌, హిస్టరీ ఛానెల్‌ను వీక్షించా రంటే విజ్ఞాన సంబంధ 
విషయాలను మానవ పరిణామక్రమాన్ని, జీవరాశి స్థితిగతులను, చారిత్రక సంపదలను
 గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది