జనవరి - 12
¤ జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
» స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తారు.
» ఇది స్వామి వివేకానంద 152వ జయంతి.
జనవరి - 24
¤ జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
జనవరి - 25
¤ 5వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
» ఆంధ్రప్రదేశ్‌లోని 42,323 పోలింగ్ కేంద్రాల్లో, తెలంగాణలోని 31,502 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
» ఉత్తమ ఎన్నికల ఆచరణ పద్ధతులకు, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించినందుకు జాతీయస్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ''ఉత్తమ రాష్ట్ర అవార్డు" లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు ఈ అవార్డును దిల్లీలో అందజేశారు.
» ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, టాక్లింగ్ మనీపవర్ రంగంలో ఉత్తమ ఎన్నికల ఆచరణ పద్ధతుల అవార్డు 2014 కింద సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ జాతీయ పురస్కారాన్ని పొందారు.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment