జనవరి - 6
¤ 2015 వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యుల జట్టును ముంబయిలో సందీప్ పాటిల్ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
15 మంది ఆటగాళ్లు: మహేంద్రసింగ్ ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్య రహానే, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఆర్.అశ్విన్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, స్టువర్ట్ బిన్నీ.
» 2011 ప్రపంచ్‌కప్ గెలిచిన భారత జట్టులోని నలుగురు మాత్రమే (ధోనీ, కోహ్లీ, రైనా, అశ్విన్) ఈ సారి మళ్లీ ప్రపంచకప్ ఆడబోతున్నారు.
» ప్రపంచకప్‌కు ఎంపికైన నాలుగో హైదరాబాదీ అంబటి రాయుడు. రాయుడు కంటే ముందు హైదరాబాద్ తరఫున తొమ్మిది మంది టీమ్ ఇండియాకు వన్డేలు ఆడారు. అందులో ముగ్గురికి మాత్రమే ప్రపంచకప్ ఆడే అవకాశం లభించింది. అబిద్ అలీ (1975), మహ్మద్ అజారుద్దీన్ (1987, 1992, 1996, 1999), వెంకటపతిరాజు (1992, 1996) వన్డే ప్రపంచకప్‌లో ఆడిన హైదరాబాదీలుగా రికార్డుల్లో చోటు పొందారు.
జనవరి - 10
¤ భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని 2 - 0 తో ఆస్ట్రేలియా గెలుచుకుంది.
» ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' గా ఎంపికయ్యాడు.
» స్మిత్ మొత్తం నాలుగు టెస్టుల్లో 769 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో 4 శతకాలున్నాయి.
» విరాట్ కోహ్లీ మొత్తం నాలుగు టెస్టుల్లో 692 పరుగులు చేసి ద్వితీయ స్థానంలో నిలిచాడు. అతడూ 4 శతకాలు చేశాడు. భారత్ నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్ ఓ సిరీస్‌లో అత్యధికంగా చేసిన పరుగులివే కావడం విశేషం.
¤ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా జరిగిన బ్రిస్బేన్ ఓపెన్‌లో రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా విజేతగా నిలిచింది. ఫైనల్లో 6 - 7, 6 - 3, 6 -3 తో అనా ఇవనోవిచ్ (సెర్బియా)ను ఓడించింది. షరపోవాకు కెరీర్‌లో ఇది 34వ సింగిల్స్ టైటిల్.
జనవరి - 11
¤ డిఫెండింగ్ ఛాంపియన్ స్టానిన్లాస్ వావ్రింకా చెన్నై ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.
» ఫైనల్లో స్లొవేనియా ఆటగాడు అల్జాజ్ బెదేనెను 6-3, 6-4తో ఓడించాడు.
» గతంలో చెన్నై ఓపెన్ నెగ్గిన తర్వాత వావ్రింకా ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు.
¤ స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో 6-4, 6-7, 6-4తో మిలోస్ రోనిచ్ (కెనడా)పై విజయం సాధించాడు.
» రోజర్ ఫెదరర్ కెరీర్లో ఇది 83వ టైటిల్. అంతే కాకుండా ఆయన కెరీర్‌లో 1000వ మ్యాచ్ విజయం కావడం విశేషం.
» 1000 అంతకంటే ఎక్కువ ఏటీపీ విజయాలు సాధించిన వారిలో జిమ్మీ కాన్సర్ (1253), ఇవాన్ లెండిల్ (1071) ఫెదరర్ కంటే ముందున్నారు.
జనవరి - 16
¤ సానియా మిర్జా, బెథానీ మాటెక్ (అమెరికా) జోడీ ఏసియా ఇంటర్నేషనల్ మహిళల డబుల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. సానియా కెరీర్‌లో ఇది 23వ డబ్ల్యూటీఏ టైటిల్.
¤ భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా స్టీఫెన్ కాన్‌స్టెంటైన్ రెండోసారి నియమితులయ్యారు. ఇంగ్లండ్‌కు చెందిన స్టీఫెన్ 2002 నుంచి 2005 వరకు భారత్ కోచ్‌గా పని చేశారు.
జనవరి - 18
¤ ఆస్ట్రేలియాలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ప్రారంభమైన ముక్కోణపు వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
» మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియా.
¤ దక్షిణాఫ్రికాలోని జొహనెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ అనేక ప్రపంచ రికార్డులకు వేదిక అయ్యింది.
» మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 2 వికెట్లకు 439 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ స్కోరు వన్డేల్లో రెండో అత్యధిక స్కోరు. శ్రీలంక చేసిన 443/9 ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది.
» వెస్టిండిస్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 291 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 148 పరుగుల తేడాతో ఓడిపోయింది.
» దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (అబ్రహం బెంజిమన్ డివిలియర్స్) ఈ మ్యాచ్‌లో ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో వేగవంతమైన అర్ధసెంచరీ, సెంచరీ నమోదు చేశాడు. డివిలియర్స్ 16 బంతుల్లో అర్థసెంచరీ, 31 బంతుల్లో సెంచరీ చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. మొత్తం మీద 44 బంతుల్లో 9 ఫోర్లు, 16 సిక్స్‌లతో 149 పరుగులు చేశాడు.
» ఇదే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు హషీమ్ ఆమ్లా, రొసౌ కూడా సెంచరీలు నమోదు చేశారు. దీంతో వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మన్‌లు సెంచరీ సాధించినట్లయ్యింది. ఇలా జరగడం వన్డే చరిత్రలో ఇదే తొలిసారి.
» జయసూర్య (శ్రీలంక) నమోదు చేసిన 17 బంతుల్లో అర్థసెంచరీ, కోరె అండర్సన్ (న్యూజిలాండ్) నమోదు చేసిన 36 బంతుల్లో సెంచరీల రికార్డును డివిలియర్స్ అధిగమించాడు.
టాప్-5 వేగవంతమైన శతక వీరులు
బ్యాట్స్‌మన్
బంతులు
ప్రత్యర్థి
సంవత్సరం
డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)
31
వెస్టిండిస్
2015
అండర్సన్ (న్యూజిలాండ్)
36
వెస్టిండిస్
2014
షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)
37
శ్రీలంక
1996
మార్క్ బౌచర్ (దక్షిణాఫ్రికా)
44
జింబాబ్వే
2006
బ్రియన్ లారా (వెస్టిండిస్)
45
బంగ్లాదేశ్
1999
జనవరి - 20
¤ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డేలో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.
» మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: స్టీవెన్ ఫిన్, ఇంగ్లండ్.
జనవరి - 24
¤ కోల్‌కతలో జరిగిన జాతీయ స్నూకర్ ఛాంపియన్‌షిప్ విజేతగా పంకజ్ అడ్వాణీ నిలిచాడు.
» ఫైనల్లో అడ్వాణీ 6-3తో వరుణ్ మదన్‌పై విజయం సాధించాడు.
» పంకజ్ ఇటీవలే జాతీయ బిలియర్డ్స్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు.
జనవరి - 25
¤ లక్నోలో జరిగిన సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్స్ పోరులో పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ , మహిళల విభాగంలో సైనానెహ్వాల్ విజేతలుగా నిలిచారు.
» ఫైనల్స్‌లో శ్రీకాంత్‌పై కశ్యప్, స్పెయిన్‌కు చెందిన కరోలినా మరిన్ పై సైనా నెహ్వాల్ విజయం సాధించారు.
జనవరి - 28
¤ ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్‌గా పి.ఆర్. మోహన్ నియమితులయ్యారు.
» సభ్యులుగా కరణం మల్లీశ్వరి, త్యాగి, సత్తిగీత, షకీల్‌షిఫి, డి.జయచంద్ర, బి.హనుమంతరావు, ఎం.రవీంద్రబాబు నియమితులయ్యారు.
¤ ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా మేనేజర్‌గా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్షద్ అయూబ్ ఎంపికయ్యారు.
» ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించనున్న రెండో హైదరాబాదీ అర్షదే. 1983లో ప్రపంచకప్ గెల్చిన టీమ్ ఇండియాకు మాన్‌సింగ్ మేనేజర్‌గా వ్యవహరించాడు.
జనవరి - 29
¤ వన్డే క్రికెట్‌లో అత్యధిక ఔట్‌లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర రికార్డు సాధించాడు.
» వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కోరె అండర్సన్ క్యాచ్ అందుకున్న సంగక్కర ఇప్పటిదాకా 474 ఔట్‌లలో పాలుపంచుకున్నాడు. (378 క్యాచ్‌లు, 96 స్టంపింగ్‌లు)
» గత రికార్డు ఆస్ట్రేలియా వికెటర్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (472 ఔట్‌లు) పేరిట ఉంది.
జనవరి - 31
¤ 35వ జాతీయ క్రీడలు కేరళ రాజధాని తిరువనంతపురంలో ప్రారంభమయ్యాయి.
» కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు క్రీడల్ని ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు.
» క్రీడల జ్యోతిని సచిన్ తెందూల్కర్ దిగ్గజ అథ్లెట్లు పి.టి.ఉష, అంజుబాబీ జార్జ్‌లకు అందజేయగా కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ జ్యోతిని వెలిగించి క్రీడల్ని ఆరంభించారు.
» ఈ వేడుకల్లో కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కేంద్ర క్రీడల మంత్రి సర్బానంద సోనోవాల్, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
» 15 రోజుల పాటు జరిగే ఈ జాతీయ క్రీడల్లో సుమారు పదివేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
¤ మొదటి ఆసియన్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ టైటిల్‌ను ఆస్ట్రేలియా నెగ్గింది.
» సిడ్నీలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 2-1 గోల్స్‌తో దక్షిణ కొరియాను ఓడించింది.
¤ ఆస్ట్రేలియన్ ఓపెన్-2015 మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా అమెరికా స్టార్ సెరీనా విలియమ్స్ నిలిచింది.
» ఫైనల్లో సెరెనా 6-3, 7-6 (7-5)తో షరపోవా (రాష్యా)ను ఓడించింది.
» 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుని 18 టైటిళ్లు నెగ్గిన మార్టినా నవ్రతి లోవా, క్రిస్ ఎవర్ట్‌లను అధిగమించి ఆల్‌టైమ్ టైటిళ్ల రికార్డులో రెండో స్థానంలో నిలిచింది. స్టెనీగ్రాఫ్ 22 టైటిళ్లతో తొలి స్థానంలో కొనసాగుతోంది.
» ఓపెన్ శకంలో ఆస్ట్రేలియన్ టైటిల్ గెలిచిన పెద్ద వయస్కురాలు (33 సంవత్సరాలు)గా సెరెనా నిలిచింది.
» పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఇటలీ జోడీ ఫాగ్ నిని-బొలెలి గెలుచుకుంది. ఫైనల్లో ఈ జంట 6-4, 6-4తో హెర్బెర్ట్-మహుత (ఫ్రాన్స్) జోడీని ఓడించింది.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment