జె.ఆర్.డి.టాటా అసలు పేరు జహంగీర్ రతన్ జీ దాదాభాయి టాటా. |
జె.ఆర్.డి.టాటా జూలై 29, 1904 న పారిస్, ఫ్రాన్సు నందు జన్మించారు . |
పారిసు లో జన్మించిన ఈయనను "జెహ్" లేక "జేఆర్డీ"గా సంబోధిస్తారు. ఈయన తల్లి ఫ్రాన్సు దేశస్థురాలు కావడంతో, ఈయన ఫ్రెంచి భాష ను మొదటి భాషగా నేర్చుకున్నాడు. |
టాటా
వంశీకులు పార్శీ మతానికీ చెందినవారు. ఎనిమిదవ శతాబ్దంలో వారు భారతదేశానికి
వలసవచ్చి వ్యాపారం చేసుకుంటూ భారతీయ సంస్కృతికి అలవాటుపడిపోయి భారతీయులుగా
స్థిరపడిపోయారు. ఆ రోజుల్లో వారికి ఇంటిపేరు ఉండేదికాదు. వారు చేసే వ్యాపారాలను
బట్టి వారి ఇంటి పేరు ఉండేది. ఉదాహరణకు "ఇంజనీర్" అనీ, డాక్టరు అని,
"బాటిల్ వాలా" అని ఉండేది. ఆ ప్రకారంగానే జీ వంశీకులకు టాటా అనే పేరు
వచ్చింది. |
1929 లో
ఈయన భారతదేశములోనే మొట్టమొదటి పైలట్ లైసెన్సు పొందాడు. 1932 లో ఈయన భారతదేశపు
తొలి వాణిజ్య విమానసేవలను టాటా ఎయిర్ లైన్స్ పేరుతో ప్రవేశపెట్టాడు. |
1946లో అది "ఎయిర్ ఇండియా"గా రూపాంతరం చెందింది. తర్వాతికాలంలో ఆయన భారతదేశపు పౌరవిమానయాన పితామహుడుగా ప్రశంసింపబడ్డాడు. |
34 ఏళ్ళ వయసులో ఆయన టాటా వ్యాపారసంస్థలకు పెట్టుబడిదారీ సంస్థ అయిన టాటా సన్స్ సంస్థకు చైర్మనుగా బాధ్యతలు చేపట్టి 1991 వరకు ఆ పదవిలో కొనసాగాడు. |
సుదీర్ఘమైన ఆయన హయాములో టాటా గ్రూపు ఆస్తులు అరవైరెండు కోట్ల రూపాయల నుండి పదివేల కోట్ల రూపాయల పైబడి పెరగగా, గ్రూపులో సంస్థలు పదిహేను నుండి నూటికి పైగా చేరుకున్నాయి. |
టాటా గ్రూప్ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు కార్పొరేట్ గ్రూప్ మరియు ప్రపంచంలోని బాగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలలో ఒకటిగా గుర్తించబడింది. |
వ్యాపారలావాదేవీలు ఉక్కు,ఆటోమొబైల్స్,సమాచార సాంకేతికత,కమ్యూనికేషన్,విద్యుత్తు, టీమరియు ఆతిథ్య రంగాలలో ఉన్నాయి . టాటా గ్రూప్ తన వ్యాపారలావాదేవీలను ఆరు ఖండాలలోని 85 దేశాలకుపైగా విస్తరించింది మరియు తన సంస్థలు వస్తువులు మరియు సేవలు 80 దేశాలకు ఎగుమతి చేస్తాయి. టాటా గ్రూప్ లో 114 సంస్థలు మరియు అనుబంధసంస్థలు ఏడు వ్యాపార విభాగాలుగా ఉన్నాయి |
ఈ గ్రూప్ లోని అధిక భాగం సంస్థలు టాటా ఉక్కు,కోరస్ ఉక్కు,టాటా మోటార్స్,టాటా కంసల్టన్సీ సేవలు,టాటా సాంకేతికసంస్థ,టాటా టీ,టైటాన్ సంస్థలు,టాటా విద్యుత్తు,టాటా సమాచార వ్యవస్థ,టాటా దూరవాణీ సేవలు మరియు తాజ్ హోటల్స్. |
జె అర్ డి టాటా 89 సంవస్తరాల వయసులో స్విడ్జర్లాండ్ లోని జెనివా లో 1993 న మరణించారు |
ఈయనకు
1992 లో భారతరత్న పురస్కారం ఇవ్వబడినది. |
జె.ఆర్.డి.టాటా(JRD Tata) - ముఖ్యమైన వ్యక్తులు - జీవిత చరిత్ర
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment