స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నూతన డైరెక్టర్‌గా ఎవరు నియ మితులయ్యారు? - జి.కె అండ్‌ కరెంట్‌ అవేర్‌నెస్‌




Q  . రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు?
- బయ్యారపు ప్రసాదరావు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. (డీజీపీ దినేష్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఇయన వచ్చారు)

. గ్రామీణాభివృద్ధికి విశిష్ట సేవలు అందిస్తున్నందుకు హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)కు ఏ పురస్కారం లభించింది?
- సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పురస్కారం

. తాష్కెంట్‌ గ్రాండ్‌ ప్రి టోర్నమెంట్లో ఎవరు విజేతగా నిలిచారు?
- కోనేరు హంపి (ఇది ఆమెకు వరుసగా రెండో గ్రాండ్‌ ప్రీ టైటిల్‌)

. భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు ఏ పురస్కారం లభించింది?
- స్పోర్స్ట్‌ ఇలస్ట్రేటెడ్‌. (2012 సంవత్సరానికిగాను ఉత్తమ క్రీడాకారిణి అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. ఈ అవార్డు రావడం ఆమెకు రెండోసారి. (ఈ పురస్కారాన్ని స్పోర్స్ట్‌ ఇలస్ట్రేటెడ్‌ క్రీడా మేగజైన్‌ అందిస్తుంది.)

. జమాతే ఇస్లామీ పార్టీపై ఏ దేశం నిషేధం విధించింది?
- బంగ్లాదేశ్‌

. అమెరికా ఏ దేశంలోని మదరసాలపై ఆంక్షలు విధించింది?
- పాకిస్తాన్‌

. బలవన్మరణాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో స్థానంలో ఉంది?
- నాలుగో స్థానం

. దక్షిణాప్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలాకు ఏ అవార్డు లభించింది?
- మొదటి మహాధీర్‌ అవార్డు. (ఈ అవార్డును మహాధీర్‌ విశ్వశాంతి సంస్థాపక సంస్థ రూపొందించింది. ప్రపంచ స్థాయి శాంతి కాముకులకు ఈ అవార్డు అందజేస్తారు)

. మహాత్మాగాంధీ అంతర్జాతీయ అవార్డు ఎవరికి లభించింది?
- దక్షిణ ఆప్రికా ఎన్నికల నిర్వహణ సంఘం మాజీ అధినేత బ్రిగాలియా బామ్‌కు. (ప్రజాస్వామ్యంలో శాంతి మరియు సయోధ్యను నెలకొల్పటానికి అంకితభావంతో ఆమె చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది)

. ప్రపంచ దేశాలపై అమెరికా జరిపిన గూఢచర్య రహస్యాల వివరాలను బయటపెట్టిన నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ) మాజీ డైరెక్టర్‌ ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు జర్మనీ ఏ పురస్కారం అందజేసింది?
- విజిల్‌బ్లోయర్‌ (ప్రజావేగు) పురస్కారం

. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
- రాజీవ్‌ రిషి

. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నూతన డైరెక్టర్‌గా ఎవరు నియ మితులయ్యారు?
- అరుంధతి భట్టాచార్య
అరుంధతి భట్టాచార్య 
. 2013 ఆగస్టు 1న అంగన్‌వాడీ పిల్ల లతోపాటు ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వారానికి మూడు సార్లు ఉచితంగా పాలను అందించే ఏ పథకాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారం భించారు?
- దుద్‌భాగ్య

. వడోదరకు చెందిన భాషా పరిశోధనా, ప్రచురణ సంస్థ ఇటీవల విడుదల చేసిన అధ్యయన వివరాల ప్రకారం 1961 నాటికి భారత దేశంలో ఎన్ని భాషలు వాడుకలో ఉండేవి?
-1100

. ఎన్ని దేశాలతో భారత దేశం వాణిజ్య లోటును కలిగి ఉందని, వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్‌ శర్మ ఇటీవల ప్రకటించారు?
- 80 దేశాలు

. మొత్తం ఎన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లలో పెట్టుబడులు సంబంధిత యజమానులు వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించారని 2013 ఆగస్టు 5న కేంద్రం ప్రకటించింది?
-58

. పది ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రణాళికేతర వ్యయం కింద, వివిధ చెల్లింపులకు కేంద్రం ఎంత మొత్తాన్ని ఇవ్వనుంది?
- రూ.128.3 కోట్లు
. ఇటీవల శాస్త్రజ్ఞులు మధ్య అమెరికా, కరేబియన్‌లలో ఎన్ని కొత్త చీమ జాతులను కనుగొన్నారు?
-33

. 2013 ఆగస్టు 5న జ్ఞాపక శక్తికి సంబంధించి 'గ్రిడ్‌సెల్స్‌' అనే కొత్త రకం మెదడు కణాలను ఏ దేశపు శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
- అమెరికా



. 2013 ఆగస్టు 4న ప్రపంచంలోనే మొదటిసారిగా మాట్లాడే మర వ్యోమగామి (రోబో ఆస్ట్రానాట్‌) ''కిరోబో''ను ఏ దేశం విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది?
- జపాన్‌

. వాహనాలకు చార్జింగ్‌ చేసేలా 12 కిలోమీటర్ల రహదారిని ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం రూపొందించింది?
- ఉత్తర కొరియా

. 2013 ఆగస్టు 7న దేశంలో మొదటి సారిగా ఆధార్‌ లింక్డ్‌ బ్యాంక్‌ ఖాతాల ద్వారా సిబ్బంది జీతం చెల్లించాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది?
- మహారాష్ట్ర

. 2013 ఆగస్టు 11న దేశంలోనే మొదటి సైబర్‌ ఫోర్సెనిక్‌ ప్రయోగశాల ఏ రాష్ట్ర హైకోర్టులో ప్రారంభించారు?
- త్రిపుర

. ఏ దేశం యొక్క ప్రధాని ఇటీవల ఉరిశిక్షల అమలును తాత్కాలికంగా ఆపాలని అధికారులను ఆదేశించారు?
- పాకిస్తాన్‌

. ఆకాశ్‌ టాబ్లెట్లు ఏ సంవత్సరం జనవరి నాటికి సిద్ధం అవుతాయని 2013 ఆగస్టు 2న అప్పటి    కేంద్ర ఐటీ శాఖ మంత్రి కపిల్‌ సిబల్‌ తెలిపారు?
-2014

. 2013 అక్టోబర్‌ నుండి ఏ దేశానికి భారతదేశం విద్యుత్తును అందించ నుంది?
- బంగ్లాదేశ్‌




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment