Q . కార్బోహైడ్రేట్లు అనేవి?
1) మాంసకృత్తులు
2) పిండి పదార్థాలు
3) కొవ్వులు
4) విటమిన్లు
Q . మానవ శరీరంలో ఉండే మాంసకృత్తులు?
1) కార్బోహైడ్రేట్లు
2) లిపిడ్లు
3) ప్రోటీన్లు
4) విటమిన్లు
Q . సాధారణ కార్బొహైడ్రేట్ల నిర్మాణంలో ఉండని మూలకమేది?
1) హైడ్రోజన్
2) కార్బన్
3) ఆక్సిజన్
4) నైట్రోజన్
Q . పోటీన్ల నిర్మాణంలో అవసరమైన మూలకాలేవి?
1) హైడ్రోజన్, కార్బన్ మాత్రమే
2) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే
3) కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్
4) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్
Q . కిందివాటిలో ప్రోటీన్లు ప్రధానంగా లేని పదార్థం ఏది?
1) గోళ్లు
2) వెంట్రుకలు
3) మాంసం
4) బియ్యం
Q . టేబుల్ షుగర్ రసాయన నామం?
1) సుక్రోజ్
2) గ్లూకోజ్
3) ఫ్రక్టోజ్
4) మాల్టోజ్
Q . పాలలోని చక్కెర ఏది?
1) గ్లూకోజ్
2) సుక్రోజ్
3) ఫ్రక్టోజ్
4) లాక్టోజ్
Q . తేనెలో ఉండే కార్బొహైడ్రేట్?
1) ఫ్రక్టోజ్
2) గ్లూకోజ్
3) లాక్టోజ్
4) మాల్టోజ్
Q . మొలాసిస్ నుంచి ఆల్కహాల్ తయారు చేసే ప్రక్రియ?
1) డయాలసిస్
2) కిణ్వప్రక్రియ (ఫెర్మెంటేషన్)
3) కిరణజన్యసంయోగక్రియ (ఫొటోసింథసిస్)
4) లాక్టైజేషన్
Q . పోటీన్లలో ఉండే ప్రత్యేక బంధం ’–CO–NH–’ ను ఏమంటారు?
1) ఎస్టర్ బంధం
2) ఈథర్ బంధం
3) ఎమైడ్ బంధం
4) పాలిఎమైడ్
Q . పాలిఎమైడ్‌లు అనేవి?
1) లిపిడ్లు
2) ప్రోటీన్లు
3) కార్బోహైడ్రేట్లు
4) విటమిన్లు
Q . హీమోగ్లోబిన్‌లో ప్రధానంగా ఉండేవి?
1) లిపిడ్ కణాలు
2) ప్రోటీన్ కణాలు
3) కార్బోహైడ్రేట్లు
4) విటమిన్లు
Q . గుండెజబ్బులకు ప్రధాన కారణమైన కొలె స్టిరాల్ అనేది ఒక?
1) లిపిడ్
2) విటమిన్
3) చక్కెర
4) ప్రోటీన్
Q . కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వ్యాధిగ్రస్థుల చికిత్సకు సంబంధించిన ప్రక్రియ?
1) ఫెర్మెంటేషన్
2) లాక్టేషన్
3) డయాలసిస్
4) ఆస్మాసిస్
Q . కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ల ఆహా రంలో ఏవి తక్కువ మోతాదులో ఉండాలి?
1) ప్రోటీన్లు
2) లిపిడ్లు
3) విటమిన్లు
4) కొర్బోహైడ్రేట్లు
Q . నూనెలను ‘డాల్డా’ లాంటి కొవ్వులుగా మా ర్చే ప్రక్రియ?
1) హైడ్రోజనీకరణం
2) హైడ్రాలిసిస్
3) ఎస్టరిఫికేషన్
4) ఫెర్మెంటేషన్
Q . సబ్బుల పరిశ్రమల్లో సహ ఉత్పన్నం ఏది?
1) గ్లిజరాల్
2) గ్లైకాల్
3) ఇథైల్ ఆల్కహాల్
4) అసిటోన్
Q . సోడియం హైడ్రాక్సైడ్ లాంటి క్షారంతో వేటిని మరిగిస్తే సపోనిఫికేషన్ జరిగి సబ్బు ఏర్పడుతుంది?
1) నూనెలు (లిపిడ్లు)
2) కార్బోహైడ్రేట్లు
3) ప్రోటీన్లు
4) ఆల్కహాల్‌లు
Q . మాయిశ్చరైజింగ్ సోప్‌లలో ఉండేది?
1) ఇథైల్ ఆల్కహాల్
2) గ్లిజరాల్
3) మిథైల్ ఆల్కహాల్
4) ఆస్కార్బికామ్లం
Q . మొలకెత్తిన ధాన్యాల్లో అభివృద్ధి చెందే ప్రధాన విటమిన్ ఏది?
1) ఎ
2) బి
3) సి
4) ఇ
Q . నీటిలో కరిగే విటమిన్లేవి?
1) ఎ, బి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) సి, డి మాత్రమే
4) అన్ని విటమిన్లు నీటిలో కరుగుతాయి
Q . ఆవుపాలు పసుపురంగులో ఉండటానికి కారణమైన విటమిన్?
1) పిరిడాక్సిన్ (B6)
2) రైబోఫ్లోవిన్ (B2)
3) థయమిన్ (B1)
4)సైనకోబాలమిన్ (B12)
Q . ఏ విటమిన్ లోపిస్తే వ్యంధ్యత్వం వస్తుంది?
1) ఎ
2) బి
3) సి
4) ఇ
Q . కోబాల్ట్ లోహ అయాన్ ఉండే విటమిన్ ఏది?
1) B1
2) B2
3) B12
4) B6
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment