భారత
దేశం |
|||||||
భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో
మొదటిది జంబూ ద్వీపం
|
|||||||
జంబూ
అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా
నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చినది.
|
|||||||
రెండవ
పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు
మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు".
ఇతనువిశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క
కుమారుడు.
|
|||||||
మూడవ
పేరు హిందూదేశం, ఇది సింధుానది పేరు మీదగా వచ్చినది
|
|||||||
తరువాత
హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన
ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది
|
|||||||
భారతదేశ
చరిత్ర 34,000 ఏళ్ళ కిందట హోమో సెపియన్స్ కాలం నుండే
ప్రారంభమయింది
|
|||||||
వాస్కోడిగామ 1498 లో
భారతదేశానికి దగ్గర దారిని కనుగొని యూరోపు దేశాల పరిపాలనకు ద్వారాలు తెరిచినాడు.
|
|||||||
1619లో సూరత్ నందు
బ్రిటీషువారు తమ తొలి పోష్టును ఏర్పాటుచేసుకున్నారు.
తరువాతపోర్చుగీసువారు, డచ్చి వారు కూడా వచ్చే సరికి, తమ
పోష్టును మద్రాసునకుమార్చుకున్నారు.
|
|||||||
బ్రిటిషు
మొదట వ్యాపారం నిమిత్తము దేశానికి ఈష్టు ఇండియా కంపెనీ అనే పేరు మీద
వచ్చి, చంద్రగిరి రాజు దగ్గర అనుమతి తీసుకోని చెన్నై వద్ద ఓ
కోట నిర్మించుకోని (తమ సరుకుల రక్షణ కోసం) వ్యాపారం సాగించినారు.
అప్పటి నుండి
ఇక్కడి రాజుల మధ్య తగాదలలో తలదూరుస్తూ, తమ స్వార్దమే పరమావధిగా
మారుతూ, విభజించి పాలిస్తూ ఇతర ఐరోపా కంపెనీలపై పైచేయి
సాధిస్తూ తమ కుటిల నీతితో దేశాన్ని ఒక్కో భాగాన్ని కబలించినారు.
|
|||||||
అవే
కుటిలనీతితో మొత్తం దేశాన్ని ఆక్రమించినారు.
| |||||||
తరువాత
జరిగిన పోరులో మహాత్మా గాంధీ కాంగ్రెసు పార్టీ ద్వారా భారతీయులందరినీ ఓ తాటిపై
నడిపి, అహింసా పోరాటం జరిపి, భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టాడు
|
|||||||
భారత
గణతంత్ర రాజ్యము నూటఇరవై కోట్లకు పైగా జనాభా తో ప్రపంచంలో
అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యము లో ప్రపంచంలో ఏడవది
|
|||||||
దక్షణాసియాలో ఏడు
వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత
ఉపఖండములోఅధిక భాగాన్ని కూడుకొని ఉంది
|
|||||||
భారతదేశం దక్షిణాన
హిందూ మహాసముద్రం, నైరుతిన అరేబియా సముద్రం, మరియు ఆగ్నేయాన బంగాళాఖాతం ఎల్లలుగా
ఉన్నాయి
|
|||||||
పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్మరియు ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో
సరిహద్దులను పంచుకుంటోంది
|
|||||||
భారత
ఆర్థిక వ్యవస్థ నామమాత్ర GDP మరియు కొనుగోలు శక్తి తుల్యత (PPP) ద్వారా మూడవ
అతిపెద్ద ద్వారా ప్రపంచ పదకొండో స్థానంలో ఉంది.
|
|||||||
భారతదేశం
29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద
పాలించబడే ఒక ఫెడరల్ రాజ్యాంగ గణతంత్రం. భారతదేశం ఒక, బహుభాషా, మరియు బహుళ జాతి
సొసైటీ
|
|||||||
ప్రపంచంలో
మూడవ అతిపెద్ద సైన్యం కలిగి ఉంది. ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో ఎనిమిదవ స్థానంలో
ఉంది.
|
|||||||
భారత
దేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా 26 జనవరి 1950న అవతరించింది
|
|||||||
భారత
దేశం యొక్క ఆక్షరాస్యత 74.04%, ఇందులో పురుషుల అక్షరాస్యత 82.14% మరియు మహిళల
అక్షరాస్యత 53.7%. ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారు.
|
|||||||
దేశంలోని
80.5% ప్రజలు హిందువులైనప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక ముస్లిము జనాభా
ఇక్కడ ఉన్నారు.
|
|||||||
(13.4%).
ఇతర మతాలు: క్రైస్తవులు(2.33%), సిక్కులు (1.84%), బౌద్ధులు (0.76%), జైనులు
(0.40%), యూదులు, పార్సీలు, అహ్మదీయులు, మరియు బహాయీలు.
|
|||||||
1853
లో ముంబాయి నుండి థానే మధ్య ప్రారంభమైన రైలు మార్గము
ప్రస్తుతం 62 వేల కిలోమీటర్లకు పైగా నిడివిని కల్గిఉంది. భారతీయ
రైల్వే 16 జోన్లుగా విభజితమై ఉంది.
|
|||||||
సాంప్రదాయికమైన
సమష్టి కుటుంబ వ్యవస్థలోని ఆర్ధిక అవరోధాల దృష్ట్యా చిరు కుటుంబాలు
ఎక్కువైపోతున్నప్పటికీ, సాంప్రదాయిక కుటుంబ విలువలను పవిత్రంగా భావిస్తారు,
గౌరవిస్తారు.
|
|||||||
ప్రపంచంలొనే
అత్యధికంగా సినిమాలు నిర్మించేది భారత దేశమే .
|
|||||||
జాతీయ
పతాకము : త్రివర్ణ పతాకము
|
|||||||
జాతీయ
ముద్ర : మూడు తలల సింహపు బొమ్మ
|
|||||||
జాతీయ
గీతం : జనగణమన....
|
|||||||
జాతీయ
గేయం : వందేమాతరం....
|
|||||||
జాతీయ
పక్షి : నెమలి
|
|||||||
జాతీయ
జంతువు : పెద్దపులి (రాయల్ బెంగాల్ టైగర్)
|
|||||||
జాతీయ
వృక్షం : మర్రిచెట్టు
|
|||||||
జాతీయ
క్రీడ : హాకీ
|
|||||||
జాతీయ
పుష్పం : కలువ పువ్వు(తామర)
|
|||||||
జాతీయ
క్యాలెండర్ : శక క్యాలెండర్ (శక సం.పు
క్యాలెండర్)
|
|||||||
|
|||||||
|
|||||||
భారతీయుడిని
అని గర్వించు - భారతీయుడిగా జీవించు
|
|||||||
భారత దేశం - ప్రపంచ దేశాల సమాచారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment