ధీరుబాయి అంబాని(Dhirubhai Ambani) - ముఖ్యమైన వ్యక్తులు - జీవిత చరిత్ర





dhirubhai ambani కోసం చిత్ర ఫలితం


>>  ధీరుబాయి అంబాని అసలు పేరు ధీరాజ్లాల్ హిరచాంద్ అంబానీ. ఈయన 1932 డిసెంబర్ 28 న భారతదేశం లోని గుజరాత్ రాష్ట్రం లో చోర్వాడ్ దగ్గర కుకస్వాడలో నిరాడంబరమైన మోడ్ కుటుంబంలో జన్మించారు.ఈయన తల్లి తండ్రులు హీరాచంద్ గోర్ధన్ భాయ్ అంబానీ , జమ్నాబెన్. బడిపంతులైన వారి తండ్రిగారికి ఈయన రెండవ సంతానం.
dhirubhai ambani కోసం చిత్ర ఫలితం
>>   ఆయన, 16 సంవత్సరాల వయసులో యెమెన్దేశములోనున్న ఎడెన్ కు వెళ్ళారు.A.Besse & Co. లో 300రూపాయల జీతానికి పనిచేసారు. రెండు సంవత్సరాల తర్వాత, A. Besse & Co. షెల్ ఉత్పతులకు పంపిణీదారులయ్యారు, ఎడెన్ రేవు వద్ద ఉన్న కంపెనీ ఫిల్లింగ్ స్టేషన్ కు నిర్వాహకుడిగా ధీరూభాయి ఉద్యోగపు హోదాను పెంచారు.
dhirubhai ambani కోసం చిత్ర ఫలితం
>>   ఆయన కోకిలబెన్ ను వివాహం చేసుకున్నారు, వీరికి ఇద్దరు కుమారులు, ముకేష్ మరియు అనిల్, మరియు ఇద్దరు కుమార్తెలు, నీతా కొఠారి మరియు రీనా సల్గౌన్కర్.
dhirubhai ambani కోసం చిత్ర ఫలితం
>>   1962 లో ధీరుబాయి భారతదేశం తిరిగి వచ్చి రిలయన్స్ మొదలు పెట్టారు. 
>>   రిలయన్స్ కంపనీ పాలిస్టర్ ను దిగుమతి చేసుకొని, మసాలా దినుసులను ఎగుమతి చేసేది.ఆయన, తనతో పాటు ఎడెన్ యెమెన్ లో ఉన్న రెండవ దాయాది చంపకలాల్ దమాని తో ఉమ్మడి వ్యాపారాన్ని ఆరంభించారు.1965 లో చంపక్ లాల్ దమాని మరియు ధీరుబాయి అంబానీ వారి ఉమ్మడి వ్యాపారాన్ని విరమించి, ధీరూభాయి సొంతంగానే ప్రారంభించారు.
dhirubhai ambani కోసం చిత్ర ఫలితం
>>   ధీరుబాయి సాహసానికి పెట్టింది పేరు మరియు నిల్వలు పెంచడం వల్ల, భవిష్యత్తు లో ధర పెరుగుతుందని, లాభాలు వస్తాయని నమ్మాడు

>>   1968 లో ఇతను దక్షిణ ముంబై లోని ఆల్టామౌంట్ రోడ్డులో ధనికులు నివసించే ప్రాంతములోని అపార్ట్మెంటులో చేరారు. 1970 నాటికి అంబానీ నికర ఆస్తి 10 లక్షలుగా అంచనా వేయబడింది.

dhirubhai ambani కోసం చిత్ర ఫలితం
>>   ఈయన 'బహిరంగ విధానాల'ని అనుసరించారు.ఉద్యోగస్థులు అతని గదిలోనికి వెళ్ల గలిగి వారి సమస్యలు అతనితో చర్చించే అవకాశం ఉండేది .
>>   నేత పరిశ్రమలో మంచి అవకాశాన్ని ఊహించి,ధీరుబాయి నేత మిల్లుని 1977 లో అహ్మదాబాద్ లోని నరోడా లో ఆరంభించారు. 
>>   ధీరుబాయి "విమల్ "' అనే బ్రాండ్ ను మొదలుపెట్టారు, అది ఆయన పెద్ద అన్నయ్య కుమారుడు విమల్ అంబానీ పేరు. 
>>   కాలక్రమేణా ధీరుబాయి తన వ్యాపారాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో విభిన్నీకరణ చేశారు, అవి పెట్రో రసాయనాలు మరియు ఎక్కువ ఆసక్తి టెలీకమ్యూనికేషన్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , ఎనర్జీ , పవర్ , రిటైల్ , టెక్స్టైల్ స్ వ్యవస్థాపక సేవలు , మూలధనం మార్కెట్ , మరియు లాజిస్టిక్స్ లో కనపరిచారు.
>>   1977వ సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూ రంగంలోకి ప్రవేశించిన 'రిలయన్స్' కంపెనీకి నేడు దాదాపు నాలుగు మిలియన్లకు పైగా ఇన్వెస్టర్లు ఉన్నారు. 
>>   1991వ సంవత్సరంలో 'హజారియా' గ్యాస్ క్రాకర్ ప్లాంట్ ఏర్పాటు గురించి ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లో జిడిఆర్ ఇష్యూను జారీ చేయడం ద్వారా ఆ విధంగా చేసిన తొలి భారతీయ కంపెనీగా 'రిలయన్స్' చరిత్ర సృష్టించింది. అంతేకాక రిలయన్స్ కంపెనీ తన సామ్రాజ్యాన్ని వివిధ రంగాల్లోకి విస్తరించడం ప్రారంభించింది. అందులో భాగమే ప్లాస్టిక్స్ మరియు పివిసి (1993), హజిరా గ్యాస్ ప్లాంట్ (1994) వంటిది. 
>>   1996వ సంవత్సరంలో విద్యుత్ మరియు టెలికాం రంగాల్లోకి ప్రవేశించిన రిలయన్స్ కంపెనీ రూ. 1000/- కోట్ల ప్రాఫిట్ స్ధాయినందుకున్న తొలి భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. 1997వ సంవత్సరంలో హజీరా ప్లాంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన 'మల్టీఫీడ్‌ క్రాకర్' ను నెలకొల్పారు. 1999వ సంవత్సరంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన 'గ్యాస్‌ రూట్ రిఫైనరీ' ని రిలయన్స్ కంపెనీ ప్రారంభించింది. 
dhirubhai ambani కోసం చిత్ర ఫలితం

>>   ఒక మామూలు పాఠశాల అధ్యాపకుని కుమారునిగా జన్మించిన ధీరూబాయ్ అంబానీ, తిరిగి వెళ్ళేనాటికి దాదాపు అరవైఐదు వేలకోట్ల రూపాయల 'రిలయన్స్' మహా సామ్రాజ్యాధినేత. ఇది అంబానీకి ఎలా సాధ్యమైంది? ఆశ, ఆశయం, కృషి - యీ మూడూ అంబానీని సామాన్యుడి స్ధాయినుండి అసామాన్య స్ధాయికి చేర్చాయి
>>   1986వ సంవత్సరంలో తొలిసారి గుండెపోటు రావడంతో ధీరూబాయి అంబానీ విశ్రాంతి తీసుకుని, ప్రధాన బాధ్యతలన్నీ కుమారులు ముఖేష్ అంబానీ మరియు అనిల్ అంబానీలకు అప్పగించారు. తండ్రి బాటలోనే సాగిన అనిల్, ముఖేష్‌లు 'రిలయన్స్' ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చారు.
dhirubhai ambani కోసం చిత్ర ఫలితం
>>   2002వ సంవత్సరం జులై 6వ తేదీన మరోసారి తీవ్రమైన గుండెపోటు రావడంతో తన 'రిలయన్స్' వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను పూర్తిగా తన కుమారులకప్పగించి ధీరుబాయ్ అంబానీ శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు.


" వెయ్యిమైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది"
ధీరూభాయ్ అంబాని . 




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment