ఐసోటోపులు (Isotopes)



మూలకాల కృత్రిమ పరివర్తనం 
ఐసోటోపులు కోసం చిత్ర ఫలితం
ఒక స్థిర మూలకాన్ని ప్రయోగశాలలో భారయుతమైన కణాలతో ఢీ కొట్టించి మరొక స్థిర మూలకంగా మార్చడాన్ని మూలకాల కృత్రిమ పరివర్తనం అంటారు. దీనిని రూథర్‌ఫర్డ్ కనుగొన్నారు. 

ఐసోటోపులు 
isotopes of hydrogen కోసం చిత్ర ఫలితం

ఒకే పరమాణు సంఖ్య, వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్య ఉంటే ఒకే మూలక పరమాణువులను ఐసోటోపులు అంటారు. ఐసోటోపులను ఆస్టన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు.

ఉదా: హైడ్రోజన్ ఐసోటోపులు
1H1 - ప్రోటియం
1H2 - డ్యుటీరియం
1H3 - ట్రిటియం

-హైడ్రోజన్ రేడియోధార్మిక ఐసోటోపు - ట్రిటియం (1H3) రేడియో ఐసోటోపుల ఉపయోగాలు రేడియోధార్మికత కలిగిన ఐసోటోపులను రేడియో ఐసోటోపులు అంటారు.

వైద్యరంగం 
ఐసోటోపులు కోసం చిత్ర ఫలితం
-రేడియోధార్మిక సోడియం (11Na24)ను ఉపయోగించి మానవ శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగాన్ని గుర్తించవచ్చు.
-రేడియో ధార్మిక కోబాల్ట్ (27co60)తో క్యాన్సర్ కణాలను నిర్మూలించవచ్చు.
-రేడియో అయోడిన్ (53I13)ను ఉపయోగించి థైరాయిడ్ గ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు.

పారిశ్రామిక రంగం 
-రేడియో ఐసోటోపులతో యంత్ర భాగాల పనితీరు, అరుగుదలను తెలుసుకోవచ్చు.
-రేడియో కోబాల్ట్ (27co60) ఐసోటోపుతో పోతపోసిన పదార్థాల్లోని లోపాలను తెలుసుకోవచ్చు.
-కొన్ని పదార్థాలపై నుంచి స్థావర విద్యుత్‌ను తొలగించడానికి కూడా రేడియం ఐసోటోపులను ఉపయోగిస్తారు.

వ్యవసాయ రంగం 
-విత్తనాల్లో అవసరమైన పరివర్తనలను రేడియో ఐసోటోపుల వికిరణాలతో నియంత్రించవచ్చు / ఆపుచేయవచ్చు.
-రేడియో పాస్ఫరస్‌తో ఒక నేలలో ఉపయోగించాల్సిన ఉత్తమ ఎరువులను, దానిలో ఉన్న పాస్పరస్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు.
-తృణధాన్యాలు, ఉల్లిపాయలు, పప్పుల వంటి పదార్థాలను r - వికిరణాలకు గురిచేసి, అవి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయవచ్చు.

వాతావరణ రంగం 
ఐసోటోపులు కోసం చిత్ర ఫలితం
-ఋతుపవన మార్గాలు, వాటి మార్గాల్లో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, రేడియోధార్మిక వాయువులను పంపించి శోధిస్తారు.

కార్బన్ డేటింగ్ 
కృత్రిమ రేడియోధార్మికతను ఉపయోగించి శిలాజాల వయస్సును తెలుసుకునే పద్ధతిని కార్బన్ డేటింగ్ అంటారు. ఈ పద్ధతికి లిబ్బి అనే శాస్త్రవేత్త కనుగొన్నారు.

-జీవరాశుల్లో 6C14 / 6C12 నిష్పత్తి ఒక స్థిరాంకంగా ఉంటుంది. జీవరాశుల మరణానంతరం ఈ నిష్పత్తి తగ్గుతుంది. దీనిఆధారంగా శిలాజాల వయస్సును నిర్ణయిస్తారు.





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment