జపాన్
జపాన్ అనేది తూర్పు ఆసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది చైనా, కొరియా, రష్యా దేశాలకు తూర్పు దిశగా ఉంది. జపాన్ దేశపు ఉత్తరాన ఉన్న సముద్ర భాగాన్ని ఓఖోట్‌స్క్ సముద్రం అని, దక్షిణాన్న ఉన్న సముద్ర భాగాన్ని తూర్పు చైనా సముద్రం అనీ అంటారు. జపాన్ భాషలో ఆ దేశం పేరు (నిప్పన్)ను వ్రాసే అక్షరాలు "సూర్యుని పుట్టుక"ను సూచిస్తాయి. కనుక జపాన్‌ను "సూర్యుడు ఉదయించే దేశం" అని అంటుంటారు. |
జపాన్ దేశాన్ని "యమాటో" అనికూడా అనేవారు. అంటే కూడా అర్ధం "సూర్యుడు ఉద్భవించేది" అని అర్థం . |
జపాన్ దేశంలో షుమారు 3,000 పైగా దీవులు ఉన్నందున ఇది ఒక ద్వీప కల్పం. |
ఈ దీవులలో పెద్దవైన నాలుగు దీవులు హోన్షూ, హొక్కయిడో, క్యూషూ మరియు షికోకూ కలిపి మొత్తం దేశం భూభాగంలో 97% వైశాల్యం కలిగి ఉన్నాయి. ఎక్కువ దీవులు పర్వత మయాలు లేదా అగ్ని పర్వత భాగాలు. జపాన్‌లోని అత్యంత ఎత్తైన ఫ్యూజీ పర్వతం కూడా ఒక అగ్నిపర్వతమే. |
అతి పురాతనమైన మట్టి పాత్రలు జపాన్ దేశము నుండే మనకు లభిస్తున్నాయి, ఇవి క్రీస్తు పూర్వం పదివేల ఐదువందల కాలానికి చెందినవి. ఆ తరువాత దొరికిన పాత్రల్లో పురాతనమైనవి చైనా మరియు భారత దేశముల నుండి లభిస్తున్నాయి ఇక్కడి మట్టి పాత్రలు సుమారుగా పన్నెండు వేల ఏడువందల సంవత్సరాల క్రితానికి చెందినవి. |
క్రీ.పూ. 3వ శతాబ్దంలో యాయోయ్ కాలంలో వరి సాగు, ఇనుము, ఇత్తడి తయారీ, క్రొత్త రకం పాత్రల తయారీ మొదలయ్యాయి. వీటిలో కొన్ని విధానాలు చైనా, కొరియాలనుండి వలసి వచ్చినవారు ప్రవేశపెట్టారు |
8వ శతాబ్దంలో "నారా కాలం"లో జపాన్ దేశం కేంద్రీకృతమైన పాలనతో ఒక రాజ్యంగా రూపొందింది. హేజో-క్యో అనే రాజనగరు అధికార కేంద్రంగా ఉండేది . |
784లో కమ్ము చక్రవర్తి రాజధానిని నారా నుండి నగోకా-క్యోకు, తరువాత 794లో హెయాన్-క్యోకు (ప్రస్తుతపు క్యోటో వగరం) మార్చాడు. తరువాత 1000 సంవత్సరాలపైగా క్యోటోనే దేశపు రాజధానిగా ఉంది. |
హెయాన్ కాలం అనబడే ఈ కాలంలోనే జపాన్ దేశం విలక్షణమైన సంస్కృతిని సంతరించుకొన్నది. జపాను జాతీయ గీతం ఈ కాలంలోనే వ్రాయబడింది. |
సమూరాయ్ అనే పాలక వర్గం వృద్ధి చెందినపుడు జపాను సమాజం ఫ్యూడల్ సమాజంగా పరిణమించింది. 1185లో వివిధ వర్గాల మధ్య జరిగిన తగవులు, షోగన్ వ్యవస్థ ఈ పరిణామానికి అంకురార్పణ జరిగింది. "కకమురా" కాలంలో (1185–1333) చైనానుండి జపానులోకి జెన్ బౌద్ధం ప్రవేశించింది. 1274-1281 సమయంలో కకమురా షోగన్ ప్రతినిధులు మంగోలు దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ సమయంలో సంభవించిన ఒక తుఫాను జపాను వారికి అనుకూలమయ్యింది. దీనిని జపనీయులు కమికాజి లేదా దివ్యమైన తుఫాను అంటారు. |
1854 మార్చి 31న, అమెరికా సైనికాధికారి కమొడోర్ మాత్యూ పెర్రీ నాయకత్వంలో అమెరికాకు చెందిన "నల్ల ఓడలు" బలవంతంగా జపాన్ ఏకాంతాన్ని విచ్ఛిన్నం చేశారు. తరువాత జరిగిన వివిధ ఒప్పందాలు, ఘటనలు, యుద్ధాల కారణంగా జపాన్ దేశంలో రాజకీయ, ఆర్ధిక సంక్షోభం నెలకొన్నది. పాశ్చాత్య పరిపాలన, ప్రజా ప్రాతినిధ్య విధానం అమలై రాజరికం నామమాత్రమయ్యింది. ఇలా జరిగిన పరిణామాలను మెయిజీ పునరుద్ధరణ అంటారు. ఆ తరువాత జపాన్ ఒక పారిశ్రామిక శక్తిగా రూపుదిద్దుకొంది. తన ప్రాబల్యాన్ని మరింత విస్తృత పరచేందుకు యుద్ధాలు చేసింది. 1894-1895 కాలంలో మొదటి చైనా - జపాను యుద్ధము , 1904-1905 లో రష్యా - జపాన్ యుద్ధము జరిగాయి. తైవాన్, కొరియా, దక్షిణ సఖలిన్ జపాన్ అధీనంలోకి వచ్చాయి |
20వ శతాబ్దం ఆరంభంలో జపాన్ మరింత బలపడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ మిత్ర పక్షాల తరఫున ఉండి విజయంలో భాగం పంచుకొంది. తరువాత తన అధికారాన్ని విస్తరిస్తూ 1931లో మంచూరియాను ఆక్రమించింది. దీనిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అందుకు నిరసనగా జపాన్ నానాజాతి సమితి నుండి బయటకు వచ్చింది. 1936లో నాజీ జర్మనీతో కమ్యూనిస్టు వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకొంది. 1941లో అక్ష రాజ్యాల కూటమిలో చేరి జర్మనీ, ఇటలీలకు తోడుగా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంది |
1937లో జపాన్ మళ్ళీ చైనాపై దండెత్తింది. 1937-1945 కాలంలో రెండవ
చైనా - జపాన్ యుద్ధం జరిగింది. |
1941న జపాన్ అమెరికా యొక్క పెరల్ హార్బర్ నౌకా స్థావరంపై దాడి చేసింది. అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్‌పై యుద్ధం ప్రకటించింది. దీంతో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో భాగస్వామి అయ్యింది. 1945లో హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు ప్రయోగం మరియు సోవియట్ యూనియన్ ఆగస్టు యుద్ధం తరువాత జపాను ఓటమిని అంగీకరించి ఆగస్టు 15న లొంగిపోయింది. |
యుద్ధం కారణంగా జపాన్‌లో అపారమైన ప్రాణ నష్టం జరిగింది. పరిశ్రమలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి. |
1947లో జపాన్ క్రొత్త శాంతియుత రాజ్యాంగాన్ని అమోదించింది. ఈ రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యం అమలయ్యింది. 1956లో జపాన్‌కు ఐక్య రాజ్య సమితి సభ్యత్వం లభించింది. |
జపాన్ ఒక రాజ్యాంగబద్ధ రాజరికం. రాజు లేదా చక్రవర్తి కేవలం జాతికి, దేశానికి, జాతి సమైక్యతకు చిహ్నంగా మాత్రమే ఉంటాడు. నిజమైన అధికారం ప్రధానమంత్రి చేతుల్లోను, ఎన్నుకొనబడిన ప్రతినిధుల (డయట్) చేతిలోను ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం నిజమైన సార్వభౌమత్వం ప్రజలదే. ప్రస్తుత చక్రవర్తి పేరు అకిహిటో. అతని తరువాత నరుహిటోకు వారసత్వంగా చక్రవర్తి పదవి లభిస్తుంది |
జపాన్ పార్లమెంటు అయిన డయట్‌లో రెండు సభలున్నాయి. ఇందులో ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలలో ఎన్నుకొనబడే 480 మంది ప్రజాప్రతినిధుల సభ ప్రతినిధుల సభ. మరొక సభలో 242 మంది కౌన్సిలర్లు ఉంటారు. పదవీ కాలం 6 సంవత్సరాలు. జపాన్‌లో 20 సంవత్సరాలు దాటిన వారందరికీ వోటు హక్కు ఉంది |
ప్రభుత్వం నాయకుడైన ప్రధానమంత్రిని చక్రవర్తి నియమిస్తాడు. ఇతను ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధుల సభ విశ్వాసం కలిగి ఉండాలి. కేబినెట్ మంత్రులను ప్రధానమంత్రి నియమిస్తాడు. ప్రస్తుతం జపాన్ ప్రధాన మంత్రి యాసువో ఫుకుడా |
సాధారణంగా జపాన్‌ను 8 ప్రాంతాలుగా వర్ణిస్తారు. కాని పాలనా పరంగా 47 జిల్లాలు(prefectures)గా విభజింపబడింది. ఒకో జిల్లాకు ఎన్నికైన గవర్నర్, చట్ట సభ, పాలనాధికార వ్యవస్థ ఉన్నాయి |
128 మిలియన్ల జనాభా కలిగిన జపాన్ ప్రపంచంలో జనాభా ప్రకారం పదవ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశాలలో జపాన్ ఒకటి |
పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న జపాన్ దేశంలో మూడువేలపైగా దీవులు ఉత్ర దక్షిణాలుగా విస్తరించి ఉన్నాయి. వీటిలో హొక్కయయిడో, హోన్షూ, షికోకు, క్యూషూ అనేవి పెద్ద దీవులు.ర్యుకూకు, ఒకినావా దీవులు క్యూషూ దీవికి దక్షిణాన ఉన్న చిన్న దీవిల సముదాయం. అన్నీ కలిపి "జపాన్ ద్వీప కల్పం" (Japanese Archipelago) అంటారు. |
ఆర్ధికంగా జపాన్ ప్రపంచంలో చాలా ప్రముఖ స్థానం కలిగి ఉంది ప్రపంచంలో ఇది నామినల్ జి.డి.పి. క్రమంలో రెండవ పెద్ద దేశం. అభివృద్ధి చెందిన దేశాల సమాఖ్యలలో (G8, G4, OECD, APEC) సభ్యత్వం కలిగి ఉంది. ఇంకా ఇది ప్రపంచంలో నాలుగవ పెద్ద ఎగుమతిదారు మరియు ఆరవ పెద్ద దిగుమతిదారు. సాంకేతిక, మెషినరీ రంగాలలో అగ్రగామి. |
జపాన్ అధికారిక పేరు : Nippon-koku / Nihon-koku |
జపాన్ జాతీయగీతం : Kimi ga Yo (君が代) Imperial Reign |
జపాన్ రాజధాని : టోక్యో |
జపాన్ అధికార భాషలు : జపనీస్ భాష |
జపాన్ ప్రభుత్వం : రాజ్యాంగ బద్ధ రాజరికము |
జపాన్ రాజు : అకియోటో |
జపాన్ ప్రధాన మంత్రి : నవోతో కాన్, డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్) |
జపానీస్ రాజ్యాంగము : మే 3 1947 |
జపాన్ విస్తీర్ణం మొత్తం : 377,873 కి.మీ² |
జపాన్ జనాభా : 127,433,494 |
జపాన్ జీడీపీ (PPP) : $4.220 త్రిల్లిఒన్2 |
జపాన్ కరెన్సీ : జపనీస్ యెన్ (అంతర్జాతియ ¥ జపనీస్ 円 En) (JPY) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment