ఆంధ్ర ప్రదేశ్ లో పెట్రోల్ మరియు డీజల్ పైన ప్రభుత్వం వ్యాట్ (VAT) వేసింది - అసలు వ్యాట్ (VAT) అంటే ఏమిటి ? దీని వల్ల ఎవరికి లాభం ? దీన్ని మొదట కనిపెట్టింది ఎవరు ?


వ్యాట్ అంటే విలువ ఆధారిత పన్ను
    ( Value - Add - Tax )

--:> ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి లేదా అమ్మకపు దశలలో పెరిగిన విలువపై మాత్రమే విధించే పన్నును విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అంటారు.
--:> ఈ పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది.
--:> ప్రజల వద్ద నుండి పన్నుల వ్యవస్దను సరళతరం చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ప్రవేశపెట్టడం జరిగింది.
--:> ఈ వ్యాట్‌ను తొలిసారిగా 1954లో ఫ్రాన్స్‌లో ప్రవేశపెట్టారు. మన దేశంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తొలిసారిగా ఎల్ కె ఝూ కమిటీ (197) సూచించింది.
--:> 1939 లో మద్రాసు రాష్ట్రం మొదటిసారిగా సాధారణ అమ్మకపు పన్నును విధించింది. మధ్యపాన నిషేధం వల్ల వచ్చే నష్టాన్ని భరించేందుకు ఈ పన్నును ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించింది.
--:> ఆ తర్వాత 1991లో రాజా చెల్లయ్య అధ్యక్షతన పనిచేసిన పన్నుల సంస్కరణ కమిటీ కేంద్రీకృత వాల్యు యాడెడ్ ట్యాక్స్‌ను సూచించింది. దీని తర్వాత 2000-01 బడ్జెట్ నుండి ఎక్సైజ్ సుంకాల విషయంలో సెన్ వ్యాట్ (CENVAT) ను ప్రవేశపెట్టారు.
--:> భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాట్‌ను అమలుపరిచేందుకు విధివిధానాలను రూపొందించేందుకు 2000వ సంవత్సరంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వ్యాట్ సాధికార కమిటీ ఏర్పడింది.
--:> భారత రాజ్యాంగం ప్రకారము వార్తా పత్రికలు మినహ మిగితా అన్ని వస్తువుల అమ్మకం, కొనుగోళ్ళపై అమ్మకపు పన్నును విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.
--:> అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థికమంత్రి ఆసిన్ దాస్ గుప్తా ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించారు.
--:> మన దేశంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను అమలు చేసిన మొదటి రాష్ట్రం హర్యానా.
--:> చివరిగా వ్యాట్‌ను ఆమోదించిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఇక కేంద్రపాలిత ప్రాంతాలైన పాండిచ్చేరి, అండమాన్, లక్షదీవులలో అమ్మకం పన్ను అమలులో లేనందున వ్యాట్ అమలులో లేదు.
--:> హైదరాబాదు ప్రాంతంలో తొలిసారిగా1950 లో అమ్మకపు పన్నును విధించడం జర్గింది.
--:> ఇక మన రాష్ట్రానికి వస్తే వ్యాట్‌ 2005 ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్నారు. 
వ్యాట్ (VAT)  వల్ల లాభాలు:
--:> రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది.
--:> రాష్ట్రంలోపన్ను ఎగవేతను అరికట్టవచ్చును.
--:> రాష్ట్రంలో పన్ను భారాన్ని తగ్గించవచ్చును.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment