ఫిబ్రవరి - 5
|
¤ '15వ దిల్లీ సుస్థిర అభివృద్థి సదస్సు' దిల్లీలో ప్రారంభమైంది. » ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి లారెంట్ ఫేబియస్ ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు. వాతావరణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల చర్చల్లో భారత్ కీలకమని ఫేబియస్ వ్యాఖ్యానించారు. 21వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీవోపీ 21) అధ్యక్షుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. » హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గెర్ కూడా 15వ దిల్లీ సుస్థిర అభివృద్ధి సదస్సులో పాల్గొన్నారు.
|
ఫిబ్రవరి - 7
|
¤ 120 దౌత్య కార్యాలయాలకు చెందిన భారత ఉన్నతస్థాయి దౌత్యవేత్తల సదస్సును న్యూదిల్లీలో నిర్వహించారు. » ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఈ సదస్సుకు హాజరై ప్రసంగించారు. పాత ఆలోచనలుమాని, మారుతున్న ప్రపంచ పరిస్థితులను వేగంగా ఆకళింపు చేసుకోవాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినాన్ని ఐక్యరాజ్య సమితి త్వరగా గుర్తించడంపై భారత దౌత్య వర్గానికి ప్రధాని కితాబిచ్చారు.
|
ఫిబ్రవరి - 8
|
¤ ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటైన 'భారత పరివర్తన జాతీయ సంస్థ (నీతి ఆయోగ్)' పాలక మండలి తొలి సమావేశం దిల్లీలో జరిగింది. » నీతి ఆయోగ్ ఛైర్మన్ హోదాలో ప్రధాని నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరఫున ముఖ్యమంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. 'సబ్ కా సాథ్.....సబ్ కా వికాస్ (అందరితో కలిసి.....అందరి వికాసం కోసం)' అనే నినాదంతో కేంద్రం-రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచాలని ప్రధాని పిలుపునిచ్చారు. » నీతి ఆయోగ్ కింద ముఖ్యమంత్రులతో మూడు ఉపబృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.ఆ బృందాలివే...ఉపబృందం - 1: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత నిధులతో అమల్లో ఉన్న 66 పథకాల్లో ఏవి కొనసాగించాలి? ఏ పథకాలను రాష్ట్రాలకు అప్పగించాలి? వేటిని పూర్తిగా రద్దు చేయవచ్చు? అనేది ఇది అధ్యయనం చేస్తుంది.ఉపబృందం - 2: రాష్ట్రాల పరిధిలో నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాల కల్పనపై ఇది అధ్యయనం చేస్తుంది.ఉపబృందం - 3: స్వచ్ఛభారత్ కార్యక్రమం నిరంతరం కొనసాగేలా వ్యవస్థాగతమైన కార్యాచరణను రూపొందించడం ఈ బృందం లక్ష్యం. » పేదరికాన్ని పారద్రోలడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ ఉత్పత్తిని పెంచడం కోసం రెండేసి కార్యసాధక బృందాలను (టాస్క్‌ఫోర్స్‌లు) ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలను ప్రధాని కోరారు. » ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావు, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ సహా వివిధ రాష్ట్రాల సీఎంలు సమావేశానికి హాజరయ్యారు. » నీతి ఆయోగ్ సమావేశానికి పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కాలేదు. కీలకమైన ఈ సమావేశంలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. » కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ అంశాల్లో నీతి ఆయోగ్ సిఫార్సులు చేస్తుందనీ, వాటిఅమలును ఆయా ప్రభుత్వాలకే వదిలిపెడుతుందని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. శాశ్వత ప్రాతిపదికన పనిచేసే 'భారత జట్టు (Team India)' సహా పరిశోధన, నైపుణ్య సలహాలు లాంటి వివిధ విభాగాలు ఉండే ఈ సంస్థలో నిపుణులు, వివిధ రంగాల ప్రతినిధులు తమ మేధస్సును వినిమోగిస్తారని వివరించింది.
|
ఫిబ్రవరి - 11
|
¤ రెండు రోజుల పాటు జరిగే 46వ గవర్నర్ల సదస్సు దిల్లీలో ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. » ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, 21 మంది గవర్నర్లు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. » అన్ని దేశాలతో శాంతియుత సంబంధాలనే భారత్ కోరుకుంటోందని రాష్ట్రపతి చెప్పారు. సరిహద్దు వివాదాలు సహా అన్నింటినీ శాంతి యుత పద్ధతుల్లోనే పరిష్కరించుకుంటామని తెలిపారు. 2025 నాటికి 4.7 కోట్లమంది మిగులు కార్మికులతో భారతదేశం అతిపెద్ద కార్మిక శక్తిగా అవతరిస్తుందని రాష్ట్రపతి వెల్లడించారు.
|
ఫిబ్రవరి - 12
|
¤ ఇండియన్ రీజియన్ 'కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్' (సీపీఏ) అయిదో సదస్సును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గోవా రాజధాని పనాజీలో ప్రారంభించారు. » పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తున్నారు.
|
ఫిబ్రవరి - 15
|
¤ మొదటి రెన్యువబుల్ ఎనర్జీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ (ఆర్ఈ-ఇన్వెస్ట్)ను దిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించారు. » మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది. » భారత రెన్యువబుల్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధనం) సత్తాను ప్రపంచానికి చాటడం, 20 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యాలుగా ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. » జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ (ఎన్టీపీసీ 10 వేల మెగావాట్లు), రిలయన్స్ పవర్ (6 వేల మెగావాట్లు) సుజ్లీన్ ఎనర్జీస్ (11 వేల మెగావాట్లు) లాంటి 293 కంపెనీలు రాబోయే అయిదేళ్లలో 266 గిగా వాట్ల (2.66 లక్షల మెగావాట్లు) పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నట్లు సదస్సులో ప్రకటించాయి. » పునరుత్పాదక ఇంధన రంగంలో ఛత్తీస్‌గఢ్‌కు ఈ సదస్సులో పురస్కారాన్ని ప్రదానం చేశారు.
|
ఫిబ్రవరి - 20
|
¤ విజయవాడలోని లయోలా కళశాలలో 'ఆక్వా ఆక్వేరియా ఇండియా - 2015' మూడు రోజుల ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.
|
ఫిబ్రవరి - 23
|
¤ అంతర్జాతీయ 'రామాయణ మేళా'ను దిల్లీలో నిర్వహించారు. » ప్రధాని నరేంద్రమోదీ ఈ మేళాను ప్రారంభించి ప్రసంగించారు. అలనాడు రామాయణంలో సీతమ్మ వారిని కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన జటాయువును పురుషులకు స్ఫూర్తి ప్రదాతగా పేర్కొనవచ్చని ప్రధాని అన్నారు.
|
ఫిబ్రవరి - 27
|
¤ 'ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్ ఎడ్యుకేటర్' సదస్సును హైదరాబాద్‌లో గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రారంభించారు. » ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ), బ్రిటిష్ కౌన్సిల్ సంయుక్తాధ్వర్యంలో దీన్ని నిర్వహించారు.
|
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment