ఫిబ్రవరి - 3
|
¤ ఫిబ్రవరి 17, 18 తేదీల్లో ఖతార్‌లో జరగనున్న 'వరల్డ్ ఇన్నోవేషన్ సమిట్ ఫర్ హెల్త్ (విష్-WISH)' సదస్సులో సమర్పించడానికి తయారు చేసిన నివేదిక ప్రకారం ఏటా ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌పై చేస్తున్న ఖర్చు సుమారు రూ.18 లక్షల కోట్లుగా వెల్లడైంది. 2010 లెక్కల ప్రకారం ఈ నివేదికను తయారు చేశారు. » నివేదిక ప్రకారం 2030లోగా క్యాన్సర్ ప్రభావం అధిక ఆదాయ దేశాల్లో 65 శాతం, మధ్య ఆదాయ దేశాల్లో 80 శాతం, నిరుపేద దేశాల్లో 100 శాతం పెరగనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య బడ్జెట్‌లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కోసం వెచ్చిస్తున్న మొత్తంలో 16 నుంచి 32 శాతం పెరుగుదల ఉంటుంది.
|
ఫిబ్రవరి - 4
|
¤ అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సెంటర్ (జీఐపీీసీ) మూడో అంతర్జాతీయ ఐపీ సూచీని విడుదల చేసింది. » మేథోసంపత్తి (ఐపీ) విధానాల అమలు, సంరక్షణలో గత రెండేళ్లుగా చివరి స్థానంలో నిలిచిన భారత్ ఈ సారి ఒక మెట్టు పైకెదిగి 29వ స్థానానికి చేరుకుంది. » మొత్తం 30 దేశాలతో కూడిన ఈ జాబితాలో 28.53 స్కోరుతో అమెరికా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, థాయ్‌లాండ్ చివరి స్థానంలో ఉంది. భారత్‌కు 7.23 స్కోరు లభించింది. » ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 30 ఆర్థిక వ్యవస్థలకు ఐపీ సూచీ హోదాలను ప్రకటించింది.¤ 'ప్రపంచ వ్యాప్త సంపన్నుల జాబితా - 2015'ను చైనాకు చెందిన హురన్ సంస్థ విడుదల చేసింది.ముఖ్యాంశాలు అత్యధిక కుబేరులున్న దేశాల విషయంలో రష్యా, బ్రిటన్‌ను భారత్ వెనక్కు నెట్టింది. అమెరికా, చైనా తర్వాత మూడో స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 2,089 మంది బిలియనీర్లు ఉండగా, భారత్‌లో 97 మంది నివసిస్తున్నారు. ఈ 97 మందిలో 41 మంది వారసత్వసంపదను కలిగి ఉండగా, 56 మంది సొంతంగా ఎదిగినవారు ఉన్నారు. ఈ జాబితా ప్రకారం అంతర్జాతీయ సంపన్నుల్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రథమ స్థానంలో నిలిచారు. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 1800 కోట్ల డాలర్లతో హిందుజా గ్రూపునకు చెందిన ఎస్.పి.హిందుజా అగ్రస్థానంలో నిలిచారు. ద్వితీయ స్థానాన్ని లక్ష్మీ నివాస్ మిట్టల్ (1400 కోట్ల డాలర్లు) దక్కించుకున్నారు.అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ (రూ.1.2 లక్షల కోట్లు) అగ్ర స్థానంలో ఉన్నారు. సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ (రూ.1.02 లక్షల కోట్లు), టాటా సన్స్‌కు చెందిన పల్లోంజీ మిస్త్రీ (రూ.96,000 కోట్లు) ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.అజీమ్ ప్రేమ్‌జీ (రూ.84,000 కోట్లు), శివ్ నాడార్ (రూ.66,000 కోట్లు), కుమార మంగళం బిర్లా (రూ.60,000 కోట్లు), సునీల్ మిట్టల్ (రూ.60,000 కోట్లు) తొలి పది మందిలో ఉన్నారు. మహిళల్లో సావిత్రి జిందాల్ (కుటుంబ ఉమ్మడి సంపద రూ.16,200 కోట్లు), చెన్నెట్ కోల్‌మన్‌కు చెందిన ఇందు జైన్ (రూ.15,000 కోట్లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.¤ భారత్‌లో ఇప్పటికీ సుమారు 30 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. » 'మిలీనీయం అభివృద్ధి లక్ష్యం (ఎంజీడీ)' కార్యక్రమం గడువు డిసెంబరులో పూర్తవుతున్న నేపథ్యంలో కూడా ఈ పరిస్థితి నెలకొని ఉందని వెల్లడించింది. » నిరక్షరాస్యత, ఆకలి, అనారోగ్యాల నుంచి లక్షలాది మందికి విముక్తి కల్పించాలన్నదే ఐరాస ప్రతిపాదించిన ఎంజీడీ లక్ష్యంగా ఉంది. » భారత్ 2000 సంవత్సరంలో ఎంజీడీని ఆచరణలోకి తెచ్చింది. లింగవివక్షను రూపుమాపడం, మహిళా సాధికారత సాధన, హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై పోరు, పర్యావరణ పరిరక్షణ తదితర ఎనిమిది అంశాలు ఎంజీడీ లక్ష్యాలుగా ఉన్నాయి. » భారత్ ఎంజీడీ విషయంలో ప్రగతిని సాధించినప్పటికీ లక్ష్యాల సాధన క్రమంలో అక్కడక్కడా లోటుపాట్లు ఉన్నట్లు ఐరాస నివేదిక పేర్కొంది.
|
ఫిబ్రవరి - 10
|
¤ పాఠశాలల్లో జరగుతున్న దాడులపై ఐరాస రూపొందించిన 'మానవ హక్కుల నివేదిక'లో ఝార్ఖండ్‌లో నలుగురు బాలికలపై జరిగిన అత్యాచారాన్ని ఉదాహరణగా తీసుకుంది. » గత అయిదేళ్లలో 70 దేశాల్లో పాఠశాలలపై దాడులు జరిగాయని వెల్లడించింది. వీటిలో కొన్ని ప్రత్యేకంగా బాలికలపై జరిగాయని, ఇది విద్యావిధానంలో లింగవివక్షపై ప్రభావం చూపుతోందని పేర్కొంది.
|
ఫిబ్రవరి - 15
|
¤ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ 'హిజ్బ్‌ట్ తహ్రీర్' అత్యంత పకడ్బందీగా తమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తోందని, ఇది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ కంటే ఎక్కువ ప్రమాదకరం కానుందని, దక్షిణాసియాలో ఈ సంస్థ ఉనికి భారత్‌కు ప్రమాదకరం కానుందని 'సీటీ ఎక్స్' జర్నల్ నివేదిక వెల్లడించింది. » ఈ ఉగ్రవాద సంస్థ సుమారు 50 దేశాల్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని, ఈ సంస్థలో 10 లక్షల మంది సభ్యులు ఉన్నారని నివేదిక వెల్లడించింది. 1952లో జెరూసలెంలో దీన్ని స్థాపించగా, ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉందని, మధ్య ఆసియా, యూరప్, దక్షిణాసియాలో శాఖలు ఉన్నాయని తెలిపింది.
|
ఫిబ్రవరి - 25
|
¤ ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరీ (టీఆర్ఏ) సంస్థ 'బ్రాండ్ ట్రస్ట్ ఇండియా స్టడీ - 2015' నివేదికను విడుదల చేసింది.ముఖ్యాంశాలు దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లుగా ఎల్‌జీ, శామ్‌సంగ్ మొబైల్స్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత సోనీ, టాటా, నోకియా ఉన్నాయి. ఎల్‌జీ, శామ్‌సంగ్ సంస్థలు రెండూ కొరియాకు చెందినవే.¤ భారత్‌లో కొత్త సర్కారు హయాంలో మత హింస ప్రబలిందని ప్రపంచ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ వల్ల భూ హక్కుదారులు ముప్పు ఎదుర్కొబోతున్నారని పేర్కొంది. ఈ నివేదికలో ఎన్నికల సంబంధ హింస, మత ఘర్షణలు, కార్పొరేట్ ప్రాజెక్టుల విషయంలో సంప్రదింపుల్లో వైఫల్యం, తదితర అంశాలను ప్రముఖంగా ప్రస్తావించింది.
|
ఫిబ్రవరి - 26
|
¤ ఆంధ్రప్రదేశ్, ఒడిశాపై విరుచుకుపడిన హుద్ హుద్ తుపాను వల్ల రూ.67.95 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఐరాస 'ఆసియా, పసిఫిక్‌లో సహజ విపత్తులు: 2014 సంవత్సర సమీక్ష' నివేదికలో వెల్లడించింది. » ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా నష్టం సంభవించిన విపత్తుల్లో హుద్‌హుద్ రెండో స్థానంలో నిలిచిందని ఐరాస పేర్కొంది. ఈ తుపాను విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండటం, సరైన సమయంలో ప్రజల తరలింపు వంటి చర్యల వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడగలిగినట్లు తెలిపింది. » 2014లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ప్రకృతి విపత్తుల వల్ల కలిగిన ఆర్థిక నష్టాల్లో 45 శాతం (రూ.1.66 లక్షల కోట్లు) భారత్‌లోనే కలిగాయని నివేదిక తెలిపింది. చైనాలో రూ.1.42 లక్షల కోట్లు, పాకిస్థాన్‌లో రూ.1.11 లక్షల కోట్ల నష్టం సంభవించగా, కశ్మీర్‌లో వరదల వల్ల భారత్, పాక్‌లలో సంయుక్తంగా రూ.98 వేల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది.
|
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment