ఒకటి కాదు రెండు కాదు 25 కేజీల బంగారు -News



అర్జంటైనా: పురాతన కాలానికి చెందిన బంగారాన్ని దేశం దాటిస్తున్న ఇద్దరిని అర్జంటైనా పోలీసు అధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 25 కేజీల పురాతన బంగారం స్వాదీనం చేసుకున్నారు. అరెస్టు అయిన నిందితులు ఇద్దరు పెరుగ్వే దేశానికి చెందిన వారు. 

వీరిద్దరు ప్రస్తుతం అర్టంటైనాలో నివసిస్తున్నారు. నిందితులు ఇద్దరు మంగళవారం ప్రయాణిలు ప్రయాణించే ట్రక్ లో బంగారం పెట్టారు. తరువాత అర్జంటైనా దేశం నుండి వేరే దేశానికి తరలించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ప్రయాణికులు వెలుతున్న ట్రక్ ను అర్టంటైనా అథారిటి అధికారులు సరిహద్దులో నిలిపారు. 


అందులో ఉన్న ఇద్దరు పెరుగ్వే దేశస్తులను ప్రశ్నించారు. ఒక వ్యక్తి పోంతన లేకుండ మాట్లాడటం మొదలు పెట్టాడు. పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలకు ఇష్టం వచ్చినట్లు సమాదానం ఇచ్చాడు. 

పోలీసు అధికారులకు అనుమానం రావడంతో ట్రక్ ను స్కాన్ చేశారు. ట్రక్ లో ప్రయాణికులు కుర్చునే సీట్ల కింద 25 కేజీల పురాతన బంగారం బటయటపడింది.

వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని బంగారం స్వాదీనం చేసుకున్నారు. 19 శతాభ్దం చెందిన పురాతన బంగారం అని అధికారులు గుర్తించారు. బంగారం మీద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పెరుగ్వే 1824 అని ముద్రించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

స్వాదీనం చేసుకున్న బంగారం విలువ ప్రస్తుతం మార్కెట్ రూ. 2.27 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని పోలీసు అధికారులు చెప్పారు. వీరు ఎక్కడ నుండి పురాతన బంగారం తీసుకు వచ్చారు అని ఆరా తీస్తున్నారు. అర్జంటైనాలోని ఫెడరల్ పబ్లిక్ రెవెన్యూ అడ్మినిస్టేషన్ (AFIP) అధికారులు విచారణ చేస్తున్నారు.




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment