ఆంధ్ర ప్రదేశ్ లో మే నెలలో డీఎస్సీ పరీక్ష - జూన్ లో రిజల్ట్స్ - మంత్రి గంటా శ్రీనివాసరావు


dsc exams కోసం చిత్ర ఫలితం



ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మే నెలలో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని, జూన్ నాటికి ఉద్యోగ నియామకాలు జరుపుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

డిఎస్సీ కోసం చిత్ర ఫలితం
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఏపీని విజ్ఞాన హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.  బుధవారం శాసనమండలిలో ఆయన ఈ ప్రకటన చేశారు.

మరోవైపు జిల్లా పరిషత్తులు ఉన్నందున జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీలను (డీడీఆర్‌సీ) రద్దు చేశామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

రాష్ట్రంలోని 20వేల మంది టైమ్ స్కేలు ఉద్యోగుల్లో అర్హులైన వారిని ప్రభుత్వ సర్వీసులో విలీనం చేస్తామని ప్రకటించారు. మిగతా వారికి పీఆర్‌సీ సిఫార్సులు, నిబంధనల మేరకు ఇతర అలవెన్సులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.
330 కొత్త బస్సులు
మరో రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు 300 కొత్త బస్సులు రానున్నట్లు మంత్రి సిద్దా రాఘవరావు ప్రకటించారు. బాలికోన్నత పాఠశాలలు, బాలికల జూనియర్ కళాశాలల నుంచి గ్రామాలకు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ముస్లిం మైనారిటీ బాలికల వివాహానికి ప్రభుత్వ ప్రోత్సాహాన్ని రూ.25వేల నుంచి రూ.51వేలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఐటీ శాఖ పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment