1. ఈశాన్య రాష్ట్రాల్లో హిమాలయ పర్వతాలను ఏమంటారు ?
పూర్వాచల్
2. కె2 శిఖరంగా పేరుగాంచిన గాడ్విన్ ఆస్టిన్‌ను పాకిస్థాన్‌లో ఏమని పిలుస్తారు ?
చౌగోరి
3. ఏ నదిని పద్మానదిలో కలవక ముందు జమున అని కలిశాక మేఘన అని పిలుస్తారు ?
బ్రహ్మపుత్ర
4. సముద్రంలో కలిసే ముందు అయిదు శాఖలుగా విడిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ అనే డెల్టాను ఏర్పరిచే నది ఏది ?
గోదావరి
5. లాంగుల్య అనే పేరున్న నది ఏది ?
నాగావళి
6. శివపురి జాతీయ పార్కు ఎక్కడ ఉంది ?
మధ్యప్రదేశ్
7. భారతదేశంలో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్టు ఏది ?
జిమ్‌కార్బెట్ నేషన్ పార్కు
8. శారావతి నదిపై ఉన్న జలపాతం ఏది ?
జోరసోప్పా
9. అష్టముడి, వెంబనాడ్ సరస్సులున్న తీరం ఏది ?
కేరళ
10. ఈజిప్ట్ దేశాన్ని నైలునది ప్రసాదంగా పేర్కొన్నది ఎవరు ?
హెరటోడస్
11. మైపాడ్ బీచ్ ఏ జిల్లాలో ఉంది ?
నెల్లూరు
12. శివసముద్రం జలపాతం ఏ నదిపై ఉంది ?
కావేరి
13. విస్తీర్ణపరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఏది ?
రాజస్థాన్
14. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు ?
1972
15. అయోధ్య పట్టణం/ నగరం ఏ నది ఒడ్డున ఉంది ?
సరయు
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment