కర్నూలులో 16 వ శతాబ్దంలో అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోట, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల అది కొండారెడ్డి బురుజుగా పేరు గాంచింది. |
విజయనగర సామ్రాజ్యం యొక్క పాలకులు ఒక యుద్ధ తంత్రంగా శత్రువులను గమనించేందుకు ఈ బురుజును ఎత్తుగా నిర్మించారు. కర్నూలు పట్టణం నుండి 52 కి.మీ ఉన్న గద్వాల్ కి ఈ కోట నుండి స్వరంగ మార్గం ఉన్నది. తుంగభద్ర నది క్రింద నుండి వెళుతూ నల్లా సోమనాద్రి నిర్మించిన గద్వాల్ కోటను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. ముస్లిం దురాక్రమణదారుల నుండి తప్పించుకొనటానికి 17వ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాదీశుడు ఈ స్వరంగాన్ని ఉపయోగించేవాడని వినికిడి. |
. |
కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది. 1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్దీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. 1733లో ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు వారి హయాంలోనికి వచ్చింది. |
ఇంకా తెలుసుకోండి : |
కర్నూలు కొండారెడ్డి బురుజుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment