కంబోడియా
>> కంబోడియా (కంపూచియా), ఆధికారికంగా కంపూచియా సామ్రాజ్యము అని గుర్తించబడే ఈ దేశం ఆగ్నేయ ఆసియా లోని ఇండోనీషియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉంది. |
>> కాంబోడియా వాయవ్య సరిహద్దులలో థాయ్ లాండ్, ఈశాన్యంలో లావోస్ తూర్పున వియత్నాం, ఆగ్నేయంలోథాయ్ లాండ్ జలసంధి ఉన్నాయి. 1.48 కోట్ల జనాభా కలిగిన కంబోడియా ప్రపంచంలో జనసాంద్రత లో 68వ స్థానంలో ఉన్నది. |
>> కంపూచియా పురాతన నామము " కాంభోజ". 802 లో రెండవ జయవర్మ స్వయంగా తనకు తాను రాజుగా ప్రకటించుకోవడంతో ఖైమర్ సామ్రాజ్యం అంకురించింది. ఖైమర్ సామ్రాజ్యం దిగ్విజయంగా సమర్థులైన రాజులతో 600 సంవత్సరాల కాలం కొనసాగింది. |
>> ఈ రాజవంశమే దాదాపు 13వ శతాబ్దం వరకు అధికారం చలాయించింది. 14వ శతాబ్దం నుండి కాంబోడియా పతన దిశలో నడిచింది. 18వ శతాబ్దంలో ఫ్రెంచి రాజులు కాంబోడియాను ఆక్రమించుకున్నారు. అనేక పోరాటాల తర్వాత 1953లో ఫ్రాన్స్ నుండి కాంబోడియాకు విముక్తి లభించి స్వతంత్రదేశంగా అవతరించింది. |
>> 1955 సింహానౌక్ తన తండ్రి కోరిక మీద, రాజ్యాధికారం వదిలి రాజకీయాలలో పాలుపంచుకుని ఎన్నికలు నిర్వహించి ప్రధానమంత్రిని ఎన్నుకున్నాడు. 1960 లో తండ్రి మరణించిన తరువాత సింహానౌక్ రాజ్యనాయకునిగా మారి, ప్రిన్స్ బిరుదాన్ని స్వీకరించాడు. |
>> 1967లో వాషింగ్టన్ పత్రికావిలేఖరి స్టాన్లీ కార్నోవ్‌తో కంబోడియలను చంపకుండా వియత్నాం కమ్యూనిస్ట్ శరణాలయాల మీద బాంబులు వేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాడు. 1968లో ఈ సందేశం అలాగే అప్పటి యు.ఎస్ అధ్యక్షుడైన జాన్‌సన్ కార్యాలయానికి చేరింది. సింహానౌక్ పాలనా విధానాలు, అమెరికా పక్షం వహించడం వంటివి ప్రభుత్వం మరియు సైన్యంలో అలజడికి కారణం అయింది. |
>> 1970లో సింహానౌక్ బీజింగ్ విజయం తరువాత ప్రధానమంత్రి జనరల్ లాన్ నోల్ మరియు ప్రిన్‌స్ సిసోవాత్ మాతక్ నాయకత్వంలో నిర్వహించిన సైనిక చర్యతో పదవీభ్రష్టుడు అయ్యాడు |
>> 1975 నూతన సంవత్సర ప్రారంభంలో అనైతికంగా సాగించిన 117 రోజుల భయంకర యుద్ధం తరువాత ఖేమర్ రిపబ్లిక్ పతనం అయింది. |
>> కాంబోడియాలో వరిధాన్యం ఎక్కువగా పండుతుంది. అన్నంలో సూపులు, నూడుల్స్, చేపలకూర, చేపల పులుసు, చేపల సూపు, పాలు, చింతపండు, అల్లం మొదలైన వాటితో ఆహార పదార్థాలు తయారుచేస్తారు. ఖ్మేర్ ప్రాంతంలో తినే వంటకాలను ‘ప్రహోక్’ అంటారు. ఇందులో చేపలతో చేసిన పేస్టు ప్రత్యేకంగా ఉంటుంది. వీరికి ఇష్టమైన పానీయం ‘అమోక్’. వీరు కొబ్బరిపాలను మనం కాఫీ తాగినట్లుగా తాగుతూ ఉంటారు. |
>> దేశంలో వరి, మొక్కజొన్న, అరటి, రబ్బరు, పొగాకు, జనుము, కలప ఎక్కువగా పండుతాయి. సముద్ర తీరంలో చేపలు, అడవులలో కలప బాగా లభిస్తాయి. దేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు బాగా ఉన్నాయి. చేపలను విదేశాలకు ఎగుమతి చేయడం, కలప వ్యాపారం వీరి ముఖ్యమైన వ్యాపారాలు. ఇవేకాదు, వివిధ రకాల కూరగాయలను, ముడి రబ్బరును కూడా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. |
>> కాంబోడియా దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 25 ప్రాంతాలుగా విభజించారు. అలాగే దేశంలో 159 జిల్లాలు, 26 పురపాలక నగరాలు ఉన్నాయి. ముఖ్యమైన నగరాలలో సిసోప్రాన్, బట్టమ్‌బాంగ్, కాంపాంగ్‌బామ్, కాంపాంగ్ స్పే, కాంపాంగ్ ధామ్, కాంపోట్, టాఖ్మో, క్రాంగ్ ఖెప్, క్రాచే, సెన్మనోరమ్, సమ్‌రోంగ్, నామ్‌ఫెన్, సిహనౌక్ బెంగ్ మీంచే, పుర్సట్, ప్రేవెంగ్, బాన్‌లుంగ్, సీమ్‌రీప్, స్టంట్‌ట్రెంగ్, స్వేరీంగ్, టేకియో, సువాంగ్ ఉన్నాయి. |
>> కాంబోడియాలో బౌద్ధమత ప్రాచుర్యం అధికంగా ఉండడం వల్ల ఎక్కడ చూసినా బౌద్ధ సన్యాసులు దర్శనమిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారు క్రామా అనే దుస్తులను ధరిస్తారు. |
కాంబోడియా పూర్తి పేరు :
కింగ్‌డమ్ ఆఫ్ కాంబోడియా కాంబోడియా నినాదం : "Nation, Religion, King" కాంబోడియా జాతీయగీతం : Nokoreach కాంబోడియా రాజధాని : Phnom Penh కాంబోడియా అధికార భాషలు : ఖ్మెర్ కాంబోడియా ప్రభుత్వం : Democratic constitutional - King : నోరోదోం శిహమొని - ప్రైమ్ మినిస్టర్ : Hun Sen కాంబోడియా ఇండిపెండెన్స్ - from France 1953 - from Vietnam 1989 కాంబోడియా విస్తీర్ణం : మొత్తం 181,035 కి.మీ² కాంబోడియా జనాభా : July 2006 అంచనా 13,971,000 కాంబోడియా జీడీపీ (PPP) 2006 అంచనా : మొత్తం $36.82 billion కాంబోడియా కరెన్సీ : Riel (KHR) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment