థామస్ అల్వా ఎడిసన్ ఫిబ్రవరి 11, 1847 న మిలాన్, ఓహియో, యునైటెడ్ స్టేట్స్ నందు జన్మించారు.తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ (1804-1896) మరియు తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ (1810-1871) లకు ఏడవ మరియు చివరి సంతానం.
మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.
డిసెంబర్ 25, 1871న 24 సంవత్సరాల వయసులో ఎడిసన్ రెండు నెలలు ముందుగా కలుసుకున్న 16 యేళ్ళ మారీ స్టిల్ వెల్ ను వివాహమాడాడు. వీరికి ముగ్గురు సంతానం.
1862 లో ఎడిసన్ ఒక స్టేషను మాష్టర్ బిడ్డను ప్రమాదం నుంచి రక్షించి అందుకు ప్రతిఫలంగా ఆయన వద్ద నుంచి టెలీగ్రఫీ ని నేర్చుకున్నాడు. బతుకు తెరువు కోసం తన టెలిగ్రాఫ్ పరికరాన్ని అమ్ముకున్నాడు.
1912 లో యీయనకు నోబెల్ బహుమతి రావల్సింది కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు. అయితే ఇది ఆయన గొప్పతనాన్ని ఏ కొంచెం కూడా తగ్గించలేదు.
ఆయన అక్టోబరు 18 1931 న వెస్ట్ ఆరెంజ్, న్యూ జెర్సీ, యునైటెడ్ స్టేట్స్ లో కన్నుమూశారు .
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment