గ్రహాంతర వాసులు(Alien's) వస్తున్నారా ?





ఈ భూమి మీద లాగానే ఈ అనంత విశ్వంలొ కూడా ఎక్కడో గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని,వారు మనకన్నా చాలా తెలివైనవారని,వారే గ్రహాంతర వాసులు(Alien's) అంటూ ఉంటారు.వారు అప్పుడప్పుడు వారు ఎగిరే పళ్ళాలు ద్వారా ఈ భూమి మీదకు వస్తారని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం.

గ్రహాంతర వాసులు కోసం చిత్ర ఫలితం

గ్రహాంతర వాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద కచ్చితమైన ఆధారాలు లేవు. మన సౌరమండలంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు లేవు. భూమికి సమీపంలో ఉన్న మార్స్ (కుజ లేదా అంగారక) గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోడానికి ఇటీవల పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడికి చేరుకోడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. 

గ్రహాంతర వాసులు కోసం చిత్ర ఫలితం

సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజ గ్రహం మీదకు వెళ్లడానికే ఇంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌరమండలాలలోని గ్రహాల మీది పరిస్థితులు ఎలాంటివో తెలియడానికి ఎన్నో వందల ఏళ్లు పడుతుంది. ఆయా గ్రహాల మీద గ్రహాంతర వాసులెవరైనా ఉన్నా వాళ్లు భూమి దగ్గరకి రావడానికి కూడా అంతే కాలం పడుతుంది. అది సాధ్యం కాదు. కాబట్టి గ్రహాంతర వాసులు ఎక్కడో అక్కడ ఉన్నా వారిని మనం చూడడం దాదాపు అసంభవం.

గ్రహాంతర వాసులు కోసం చిత్ర ఫలితం

గ్రహాంతరవాసులు అప్పుడప్పుడు ఎగిరే పళ్ళాలు సహాయంతొ ఈ భూమి మీదకు వస్తూఉంటారని,ఆ వాహనాలను చూశామని చెబితూఉంటారు.వాటిని ఫొటోలు కూడా తీశారు.దీన్ని బట్టి చూస్తే వారు మనకన్నా ఎన్నో రెట్లు తెలివైనవారని అనుకోవచ్చు.

గ్రహాంతర వాసులు కోసం చిత్ర ఫలితం

ఒక్కటైతే నిజం... సైన్స్ దృష్టితో చూస్తే ఇప్పటివరకూ భూమికి అవతల గ్రహాంతర వాసుల మాట అటుంచితే... అస్సలు జీవం అన్నదే లేదు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే మనిషి ఇప్పుడిప్పుడే విశ్వాన్ని చూడటం మొదలుపెట్టాడుకొన్ని దశాబ్దాల క్రితం వరకూ మనిషికి సౌరకుటుంబానికి ఆవల ఏముందో తెలిసేది కాదు.. ఆ తరువాత అవతల కూడా నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయని గుర్తించగలిగాడు.

గ్రహాంతర వాసులు కోసం చిత్ర ఫలితం

మనిషి ఇప్పటివరకూ మనకు కేవలం నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిని దాటి వెళ్లింది కూడా లేదు. దీన్నిబట్టి అర్థమయ్యేది ఏమిటంటే... అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ జీవం పురుడు పోసుకోవచ్చు అని. ఇదే పోలిక గ్రహాంతర వాసులకూ వర్తిస్తుంది. సౌరకుటుంబానికి ఆవల ఉన్న కోటానుకోట్ల గ్రహాల్లో ఉన్న పరిస్థితులేమిటన్నది మనిషి ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ అవి ఎంత కఠినంగా ఉన్నప్పటికీ జీవం ఉండేందుకు అవకాశాలు మాత్రం ఉంటాయన్నది సుస్పష్టం

గ్రహాంతర వాసులు కోసం చిత్ర ఫలితం

 1977లో తొలిసారి వాయేజర్ ఉపగ్రహం ద్వారా గ్రహాంతర వాసులను ఉద్దేశించి మనిషి ఒక సందేశం పంపాడు. బంగారు రేకులపై మనిషి రూపురేఖలను, భూమి స్థానాన్ని సూచించే గుర్తులు, కొన్ని శబ్దాలను పొందుపరిచి పంపిన ఈ సందేశంపై ఇప్పటివరకూ ప్రత్యుత్తరం లేదు. అలాగే సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరస్టియల్ లైఫ్ (సెటీ) భూమ్మీద ఉన్న అత్యంత భారీ రేడియో టెలిస్కోపుల సాయంతో సుదూర గ్రహాలకు సంకేతాలు పంపుతూనే ఉంది. గ్రహాంతర వాసులెవరైనా ఉంటే ఈ సంకేతాలు అందుకుని స్పందించకపోతారా? అన్న అశతో జరుగుతున్న ఈ ప్రయత్నం ఇప్పటివరకూ ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు.

గ్రహాంతర వాసులు కోసం చిత్ర ఫలితం

 కానీ 1977 ఆగస్టు 15న అందిన ఒక్క సందేశం మాత్రం గ్రహాంతర వాసులపై మనకున్న ఆసక్తిని పెంచేలా చేసింది. ఒహాయో స్టేట్ విశ్వవిద్యాలయ టెలిస్కోపు ద్వారా అందిన ఈ సంకేతాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్త అదే కాగితంపై ‘వావ్’ అని రాశాడంటే అదెంత ఆసక్తికరమైందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ సంకేతాన్ని మరోసారి పొందేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇక 1974లో కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు పూర్టరికోలోని ఆర్సిబో వేధశాల నుంచి 210 బైట్ల సైజున్న ఓ సందేశాన్ని ఎం13 నక్షత్ర మండలంవైపు పంపించారు. మానవుల, కీలకమైన రసాయన అణువుల, డీఎన్‌ఏ రసాయన నిర్మాణం వంటి వివరాలతో కూడిన ఈ సందేశం వన్‌వే ట్రాఫిక్ మాదిరిగానే మిగిలిపోయింది.
గ్రహాంతర వాసులు కోసం చిత్ర ఫలితం


అణుభౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మీ 1950 ప్రాంతంలో గ్రహాంతర వాసులకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. 

enrico fermi కోసం చిత్ర ఫలితం

1. ఈ విశ్వంలో గ్రహాంతర వాసులు ఉంటే వారు మనతో ఎందుకు మాట్లాడటం లేదు?

2. భూమ్మీదకు ఎందుకు రావడం లేదు?

3. రహస్యంగా వచ్చిపోతున్నారని అనుకుంటే కనీసం వేడి, విద్యుదస్కాంత శక్తి వంటి ఆనవాళ్లయినా వదిలి వెళ్లాలి కదా? అవెక్కడ? అన్న ఈ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు.
enrico fermi కోసం చిత్ర ఫలితం


గ్రహాంతర వాసులు ఈ భూమి మీదకు లేదా విశ్వంలో గ్రహాల మధ్య ప్రయాణించడానికి ఉపయోగించే వాహనాలు. వీటినే U.F.O (Unidentified Flying Objects) అని అంటారు. దీనికి సంబందించిన శాస్త్రాన్ని యుఫొలజి (Ufology) అని అంటారు.



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment