బెనిన్(Benin) - ప్రపంచ దేశాల సమాహారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం.

బెనిన్

Image result for benin country

బెనిన్ దేశాన్ని 1975 వరకు దహోమీ అని పిలిచేవారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుండి బానిసలను కొని ఇతర దేశాలకు తరలించేవారు.
Image result for benin country

1892లో ఫ్రాన్స్ దేశం దీనిని తన అధీనంలోకి తెచ్చుకుంది. 1904 వరకు ఇది ఫ్రెంచ్ వెస్ట్ ఆఫ్రికాగా పరిగణించబడింది. అప్పటి నుండి 1972 వరకు దేశంలో అంతర్గత యుద్ధాలు చెలరేగాయి. 1990 మార్చి 1న రిపబ్లిక్ ఆఫ్ బెనిన్‌గా అధికారికంగా పేరు నిర్ధారించారు


Image result for benin country partinovo lake

ఉండడానికి చిన్న దేశమే అయినా ప్రకృతి పరంగా ఒక గొప్పదేశం. సముద్రతీర ప్రాంతంలో నోకౌ, పోర్టోనోవో లాంటి గొప్ప సరస్సులు ఉన్నాయి.

పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 12 భాగాలుగా విభజించారు. ఈ విభాగాలను డిపార్టుమెంట్‌లు అంటారు. ఈ డిపార్టుమెంట్‌లు తిరిగి 77 కమ్యూన్‌లుగా విభజింపబడ్డాయి. ఇవి పన్నెండు డిపార్టుమెంట్‌లు అలిచోరి, అటకోరా, అట్లాంటిక్, బోర్గు, కోలిన్స్, డోంగో, కౌఫో, లిట్టోరల్, మోనో, ఓవుమి, ప్లాటూ, జోవ్. బెనిన్ దేశంలో ప్రజలు ఎక్కువగా దేశపు దక్షిణ భాగంలోనే నివసిస్తారు. జనాభాలో అత్యధిక శాతం యువత ఉంది. దాదాపు 42 ఆఫ్రికన్ తెగలు ఈ దేశంలోనే ఉన్నాయి. యోరుబా, డెండి, బారిబా, ఫులా, బేటమ్మా రిబే, సోంబా, ఫాన్, అబోమీ, మీనా, జూడా, అజా తెగలు దేశంలో ప్రముఖమైనవి. ఈ దేశంలో భారతీయులు కూడా వివిధ వ్యాపార రంగాలలో ఉన్నారు.
Image result for benin country assembly


బెనిన్ దేశానికి పోర్టోనోవో రాజధాని. ఈ నగరాన్ని హాగ్‌బోనోవ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒకప్పుడు ఫ్రెంచ్ దహోమీకి రాజధానిగా ఉండేది. ఈ నగరం ఒక డిపార్టుమెంటు, మరియు కమ్యూన్‌గా ఉంది. దీని వైశాల్యం 110 చదరపు కిలోమీటర్లు. ఈ నగరంలోనే శాసనసభ ఉంది.  టోఫా రాజ భవనం కూడా ఇక్కడ ఉంది. 


Image result for benin country

దేశంలో తీరప్రాంతాల ప్రజలు జలచరాలను ముఖ్యంగా రొయ్యలు, పీతలు, ఎండ్రకాయలను ఇష్టంగా తింటారు. ఇతర ప్రాంతాలలో మొక్కజొన్నపిండి, టమోటారసం, పామోలిన్ నూనె ఎక్కువగా వాడుతారు. కొన్నిప్రాంతాలలో వరి అన్నం కూడా తింటారు.


Image result for benin country partinovo lake

పశ్చిమ ఆఫ్రికా దక్షిణ భాగం లో ఉండే ఈ బెనిన్ దేశం ఆకారం ఐస్‌క్రీమ్ కోన్‌ను నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది .



Image result for benin country

బెనిన్ పూర్తి పేరు : రిపబ్లిక్ ఆఫ్ బెనిన్

నినాదం : "Fraternity, Justice, Labour"

జాతీయ గీతం : The Dawn of a New Day

రాజధాని : Porto-Novoa

అధికార భాషలు : French

ప్రభుత్వము : Presidential republic

- President : Yayi Boni

Legislature :National Assembly

స్వాతంత్ర్యం : 
- from France August 1, 1960 

వైశాల్యం  :Total 114 km2 

జనాబా  : 10,323,000

 - Density  :  78.1/km2 

GDP : Total $7.429 billion

Currency  : West African CFA franc (XOF)


BENIN CURRENCY కోసం చిత్ర ఫలితం

BENIN CURRENCY కోసం చిత్ర ఫలితం

BENIN CURRENCY కోసం చిత్ర ఫలితం

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment