ఇండియాగేట్ అనేది భారతీయ సైనికుల స్మారక చిహ్నం. ఒకటో ప్రపంచయుద్ధం, ఆఫ్ఘన్ యుద్ధాలలో 90,000 మంది భారతీయ సైనికులు అసువ్ఞలు బాశారు. వారి త్యాగానికి గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన స్మారకచిహ్నమే ఈ ఇండియా గేట్.
1921, ఫిబ్రవరి 10న డ్యూక్ ఆఫ్ కన్నాట్‌చే పునాదిరాయి వేయబడి దాదాపు 10 సంవత్సరాల నిర్మాణ సమయం తరువాత 1931లో ఇది పూర్తయింది. దీనిని మొదట 'ఆలిండియా మెమోరియల్ వార్' అని పిలిచేవారు. ఈ కట్టడపు ఇరువైపులా పై భాగంలో ఇండియా గేట్ అనే పదాలు స్పష్టంగా కనిపించేటట్లు చెక్కబడింది.
ఈ కట్టడం భరత్‌పూర్ ఎర్రరాయితో నిర్మించబడింది . దీని నిర్మాణం పూర్తి కావడానికి పది సంవత్సరాల కాలం పట్టింది.
ఇండియా గేట్ ఎత్తు 42మీ. దీనిపైన మధ్యలో గిన్నెలాంటి ఆకారం ఉంటుంది. వార్షికోత్సవాల వంటి సందర్భాలలో దీంట్లో నూనెపోసి దీపం వెలిగిస్తారు.
ఇండియాగేట్‌ను 'ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని కూడా పిలుస్తారు. దీనర్థం 'అఖిల భారత యుద్ధ స్మారక చిహ్నం అని.
ఇండియా గేట్ పైభాగంలో దీని నిర్మాణ నేపథ్యాన్ని ఇంగ్లీషు అక్షరాలలో చెక్కారు. 1971 నుంచి ఇక్కడ అమర్ జవాన్ జ్యోతి కూడా వెలుగుతోంది.
యమునా నది తీరాన ఉన్న భారత దేశపు రాజధాని నగరంలో ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఇండియా గేట్ ఒకటి .
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment