యాగంటి దేవాలయము కర్నూల్ జిల్లాల్లో చాలా ప్రసిద్ది చెందిన ఆలయము. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం వున్నది. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషద గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం వున్నది ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలఙానం లో ప్రస్థావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. ఇక్కడ కల నంది విగ్రహం ఒకటి నేటికీ పెరుగుతూ వుంటుంది. (అయితే, ఇటువంటి విగ్రహమే, బెంగుళూరు లో కూడా కలదు. కాని ఇది పెరగటం బలవంతంగా ఆగింది).ఈ నంది విగ్రహం జీవం పోసుకున్న రోజున జీవం పోసుకుని పరుగెత్తటం మొదలు పెట్టిన రోజున ప్రళయం సంభవిస్తుందని, కాలం ఆగి పోతుందని చెపుతారు. మరి దాని పరుగు కంటే ముందే మనం పరుగు పెట్టి ప్రళయం నుండి తప్పించుకుంటే మంచిదేమో. ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు. |
ఆంధ్రప్రదేశ్ లో కాకులు కనపడని ఊరు మీకు తెలుసా ?
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
ఆంధ్రప్రదేశ్ లో కాకులు కనపడని ఊరు యాగంటి ఒక్కటే కాదు కడప జిల్లాలో పుష్పగిరి అనే గ్రామంలో కూడా కాకులు కనబడవు , ఇది కూడా మీ వీక్షకులకు చెప్పండి
ReplyDelete