లిథువేనియా(Lithuania) - ప్రపంచ దేశాల సమాహారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం.

లిథువేనియా

Image result for lithuania



లిథువేనియా పూర్తి పేరు  రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా ఐరోపాలో బాల్టిక్ సముద్రానికి ఆగ్నేయతీరాన ఉన్న ఒక దేశము. 

లిథువేనియా ఐరోపా సమాఖ్య మరియు నాటోలలో సభ్యదేశంగా ఉంది.
14వ శతాబ్దంలో లిథువేనియా ఐరోపాలో అతిపెద్ద దేశంగా ఉండేది. నేటి బెలారస్, ఉక్రెయిన్లే కాక పోలాండ్, రష్యాలలోని కొన్ని ప్రాంతాలు కూడా లిథువేనియా సామ్రాజ్యంలో అంతర్భాగాలుగా ఉండేవి.


Image result for lithuania

1569లో లిథువేనియా పోలాండ్‌తో కలిసి పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ నెలకొల్పినది. ఆ కామన్వెల్త్ 1795లో విచ్ఛిన్నం కాగా రాజ్యంలో అధికభాగం రష్యా పరమయ్యింది. 

1918లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్ర్యాన్ని సాధించిన లిథువేనియా రెండవ ప్రపంచ యుద్ధంలో ముందు సోవియట్ యూనియన్ (1940), ఆ పై నాజీ జర్మనీ, తిరిగి సోవియట్ యూనియన్ (1944) వశమయ్యింది. 

Image result for lithuania

1990, మార్చి 11న లిథువేనియా సోవియట్ యూనియన్ నుండి విడిపోయినది. ఇది సోవియట్ నుంచి వేరుపడిన మొట్టమొదటి రిపబ్లిక్.

నేటి లిథువేనియా ఐరోపాలోని అభివృద్ధి చెందితున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. 2009లో లిథువేనియా నామ సహస్రాబ్ది వేడుకలు చోటు చేసుకోనున్నాయి.


Image result for lithuania flag





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment