ఈఫిల్ టవర్(Eiffel Tower) చరిత్ర



ప్రపంచంలో నిర్మించబడిన అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణాల్లో ఒకటైన ఈఫిల్ టవర్.. ప్యారిస్’లోని సీన్ నది పక్కన వున్న చాంప్ డి మార్స్ పై ఎత్తైన ఇనుప గోపురం. ప్యారిస్’లో ఎంతో ఎత్తైన ఈ నిర్మాణాన్ని.. గుస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ రూపొందించాడు. 1889 నుంచి నానాటికి దీన్ని సందర్శించే సంఖ్య మరింతగా పెరుగుతుండటంతో.. ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది.

eiffel tower making కోసం చిత్ర ఫలితం

ఈఫిల్ టవర్ చరిత్ర :
ఈ టవర్’ను గుస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ రూపొందించాడు. 1887 - 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని.. ఈ నిర్మాణ ఏర్పాటు కార్యక్రమాలను మొదలుపెట్టారు. నిజానికి ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనాలో ఈ టవర్’ను నిర్మించాలనుకున్నాడు. కానీ అక్కడి అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ భావించి.. తమ నగర డిజైన్’లో సరిపడదని చెప్పారు. దీంతో ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్’లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. వాళ్లు దీనిని పరిశీలించిన అనంతరం అక్కడే 1889లో దీన్ని నిర్మించడం జరిగింది.
eiffel tower making కోసం చిత్ర ఫలితం

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ టవర్’ను కేవలం 20 సంవత్సరాలవరకు మాత్రమే వుండేటట్లుగా ఒప్పందం కుదిరింది. అంటే.. టవర్’ను రూపొందించే పనిలో భాగంగా దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా వుండాలని నియమం వుండేది. ఆ నియమం ప్రకారం దాన్ని 1909లోనే కూల్చివేయాలి. కానీ.. కాలక్రమంలో అది కమ్యూనికేషన్, మిలిటరీ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుండటంతో ఆ ఒప్పందం అయిపోయిన తర్వాత కూడా అలాగే వుంచేయడం జరిగింది. ప్రస్తుతం నేడు ప్రపంచంలోకెల్లా అత్యధిక పర్యాటకులు సందర్శించే టవర్’గా చరిత్ర రికార్డుల్లోకి ఎక్కిపోయింది.
                       eiffel tower కోసం చిత్ర ఫలితం       eiffel tower కోసం చిత్ర ఫలితం

మరిన్ని విశేషాలు :
- ఈ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు వుండగా.. అందులోని లోహపు బరువు 7,300 టన్నులు. ఇందులో వాడిన లోహాలు తప్పుపట్టకుండా వుండేందుకు 7 ఏళ్లకోసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్’ను వాడుతారు.
- దీన్ని నిర్మించేటప్పుడు ఈఫిల్ 72 మంది ఫ్రెంచి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర ప్రముఖుల పేర్లు రాయించాడు. ఈ పేర్లన్నింటినీ 20వ శతాబ్దపు మొదట్లో తుడిచివేశారు. కానీ.. టవర్’కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకునే సంస్థ చొరవతో మళ్లీ ఆ పేర్లను 1986-87లో పునర్ముద్రించడం జరిగింది.
- 1889 సెప్టెంబర్ 10న థామస్ అల్వా ఎడిసన్ దీన్ని సందర్శించి.. అతి పెద్దదైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించినందుకు ఈఫిల్’కు అభినందనలు తెలియజేస్తూ గెస్ట్ బుక్’లో సంతకం చేశాడు.
- 1902లో మెరుపుల ప్రభావంతో 100 మీటర్ల పైభాగం దెబ్బతింది. అప్పుడు టవర్’ని కాంతితో నింపే కొన్ని దీపాలను మార్చాల్సి వచ్చింది.
- 1910లో థియోడర్ ఉల్ఫ్ దీన్ని సందర్శించి.. టవర్ ఆడుగున, పైభాగాన విడుదలయ్యే ఉష్ణశక్తిని అంచనా వేశాడు. దాని మూలంగానే ఆయన కాస్మిక్ కిరణాలను కనుగొన్నాడు.
- 1956 జనవరి 3న అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో టవర్ పైభాగం దెబ్బతింది.
- 1957లో టవర్ పైభాగాన ప్రస్తుతమున్న రేడియో యాంటెన్నాను అమర్చారు.



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment