ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి ఎవరు ? ఆంధ్రరాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు?- పోటీ పరీక్షల ప్రత్యేకం బిట్స్




1.1937 మద్రాస్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎవరి నాయకత్వంలో ఏర్పడింది ?
 - సి.రాజగోపాలాచారి

2.ఆంధ్ర పితామహుడు ?
- మాడపాటి హన్మంతరావు 

3.కొల్లాయి గట్టితేనేమి, మా గాంధీ, కోమటై పుట్టితేనేమి అని రచించినది ఎవరు ?
- బసవరాజు అప్పారావు

4.మీర్‌ ఖమ్రద్ధీన్‌, చిన్‌కిలిచ్‌ ఖాన్‌ అనేది ఎవరి పేరు ?
- నిజాం ఉల్‌ముల్క్‌

5.హైదరాబాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ స్థాపనకు ముఖ్య కారకులు ?
- స్వామి రామానంద తీర్థ

6. 1891లో యావత్‌ భారతదేశంలోనే ప్రథమంగా ఏర్పడిన జిల్లా సంఘం ?
 -కృష్ణాజిల్లా సంఘం

7. మాద్రాసులో సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించింది ?
- టంగుటూరి ప్రకాశం

8. హైదరాబాద్‌ నిజాంకు రుణాలు మంజూరు చేసిన బ్రిటిష్‌ కంపెనీ ?
- పామర్‌ అండ్‌ కంపెనీ

9.కర్నూల్‌ సర్క్యులర్‌ రూపొందించింది ?
- కళా వెంకట్రావు)1942, జూలై)

10.పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం ?
- 1794

11. ఆంధ్రలో పన్నుల నిరాకరణోద్యమానికి సంబంధం ఉన్న గ్రామం ?
- పెదనందిపాడు

12. థార్‌ కమిటీ, జె.వి.పి కమిటీలు దేనికి సంబంధించినవి ?
- భాషా ప్రయుక్త రాష్ట్రాలు

13. ప్రయోగశాలలోని గాజు పరికరాల తయారీకి ఉపయోగించే గాజు ?
 - క్వార్ట్‌ ్జగాజు

14.కృష్ణాపత్రికకు దీర్ఘకాలం సంపాదకత్వం వహించింది ఎవరు ?
 -ముట్నూరి కృష్ణారావు

15.స్టార్‌ ఆఫ్‌ ఇండియా ఎవరు?
- అఫ్జలుద్దౌలా

16.   ఆంధ్రరాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు
?
 - టంగుటూరి ప్రకాశం
టంగుటూరి ప్రకాశం కోసం చిత్ర ఫలితం

17. జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు ?
- కాకాని వెంకటరత్నం

18. భావార్థ దీపిక రరయిత ?
 - జ్ఞానేశ్వరుడు

19. యంగ్‌మెన్‌ లిటరరీ అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు ?
- జొన్నవిత్తుల గురునాథం

20. విద్యుత్‌ బల్బులు, దృశ్య పరికరాల తయారీకి ఉపయోగించే గాజు ?
- పైరెక్స్‌

21. అల్పవ్యాకోచం, కుదుపు, రసాయనాలను తట్టుకునే గాజు ?
 - బోరో సిలికేట్‌

22. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొట్టమొదటి జమిందారు ?
-పర్లాకమిడి నారాయణ దేవ్‌

23. మాలపల్లి నవలా రచయిత ?
- ఉన్నవ లకీనారాయణ

24. సింహాసన ద్వాత్రింశక రచయిత ?
- కొరవి గోపరాజు

25.తెలంగాణలో ధాన్యరూపంలో పొందే రుణం ?
- నాగు

26. కోరిన ఆకృతి ఉన్న గాజు వస్తువులను తయారు చేసే సాంకేతిక నైపుణ్యాన్ని ఏమంటారు ?
- గ్లాస బ్లోయింగ్‌

27. సాక్షి వ్యాసాలు ఎవరివి ?
 - పానుగంటి లకీనరసింహారావు

28.1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభల అధ్యక్షుడు ?
- బి.ఎస్‌.శర్మ

29.పల్నాడు అటవీ చట్టాల ఉల్లఘన ఉద్యమంలో ప్రాణాలు కల్పోయిన నాయకుడు ?
 - కన్నెగంటి
హనుమంతు

30.పాలంపేటలో ఉన్న రాయప్ప దేవాలయాన్ని నిర్మించిన సంవత్సరం ?
 - క్రీశ.1213

31. 1948 సెప్టెంబరులో హైదరాబాద్‌లో పోలీసు చర్య ఎవరి నాయకత్వంలో జరిగింది ?
- మేజర్‌ జనరల్‌ జేఎన్‌ చౌదరి

32. ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి  ఎవరు ?
- నీలం సంజీవరెడ్డి
నీలం సంజీవరెడ్డి కోసం చిత్ర ఫలితం


33. గ్లాస్‌ బ్లోయింగ్‌కు ఉపయోగించే గాజు ?
- పైరెక్స్‌, బోరోసిలికేట్‌

34. మహ్మద్‌ కులీ కుతుబ్‌షా గోల్కొండ సింహాసనాన్ని అధిషించిన సంవత్సరం ?
- 1518

35.కులపతి ఎవరి బిరుదు ?
- రఘుపతి వెంకటరత్నం

36. కర్బన పదార్ధాల పాలిమర్‌లను ఏమంటారు ?
- ప్లాస్టిక్స్‌ (లేదా) రెసిన్స్‌

37. పచ్చల సోమేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది ?
- పానగల్లు ( నల్లగొండ జిల్లా)

38.కళాప్రపూర్ణ బిరుదు ఎవరిది ?
 - గిడుగు రామ్మూర్తి

39.ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టును ఎక్కడ స్థాపించారు ?
- గుంటూరు

40.రాయలసీమలో రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టి ఆ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేసిన
ఆంగ్లేయ కలెక్టర్‌ ?
 - థామస్‌ మన్రో

41. కరుణశ్రీ, ఉదయశ్రీ రచనలు ఎవరివి ?
- జంధ్యాల పాపయ్య శాస్త్రి

42. విద్యుత్‌ బంధకాలు, దువ్వెనలు, టీవీ, రిఫ్రిజిరేటర్లకు ఉపయోగించే ప్లాస్టిక్‌ ?
 - పాలీ స్టెరీస్‌

43. సాళువ తిమ్మరసు ఎవరి మంత్రి ?
- శ్రీకృష్ణదేవరాయలు

44.కాకతీయుల కాలంలో మోటుపల్లి రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు ?
- మార్కోపోలో

45.హైదరాబాద్‌ సంస్థానంలో క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ?
- స్వామి రామానంద తీర్థ

46. జమ్నాలాల్‌ బజాజ్‌ నాయకత్వంలో నాగ్‌పూర్‌లో జెండా సత్యాగ్రహం జరిగిన సంవత్సరం?
 -1933

47. ఫిల్ములు, టేపుల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్‌ ఏది ?
- పాలీ ఎస్టర్స్‌ 

48.ఆంధ్రలో ఉప్పుసత్యాగ్రహ ఉద్యమ నాయకుడు ?
 - కొండా వెంకటప్పయ్య

49.పాలంపేటలో సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి ?
- రేచర్ల రుద్రుడు

50.హైదరాబాద్‌లో ఆర్య సమాజాన్ని స్థాపించిన సంవత్సరం ?
 - 1892

51. ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధి గాంచిన స్వాతంత్రోద్యమ నాయకుడు ?
- పర్వతనేని వీరయ్య చౌదరి

52. తుపాకీ గుండు వాదం అనే శీర్షికన తన నేషలిష్ట్‌ పత్రికలో జలియన్‌ వాలాబాగ్‌ దురంతాన్ని ఖండిస్తూ వ్యాసారాలు సారింది ఎవరు ?
- గాడిచర్ల హరిసర్వోత్తమరావు

53. బ్రష్‌లు, బ్రషల ముళ్లు, తీవాచీల తయారీకి ఉపయోగించేవి ?
 - నైలాన్‌ 6, 61

54. మతపరంగా, విద్యా విషయకంగా దక్షిణ కాశీగా పేరుపొందిన నగరం ?
- కంచి

55. రుద్రమ దేవి చేతిలో ఓడిపోయిన యాదవరాజు ?
 -మహాదేవుడు

56. మొదటి సాలార్‌ జంగ్‌ ఎవరి రాజప్రతినిధి ?
 - మహబూబ్‌ ఆలీఖాన్‌

57. సాంఘిక శుద్ధి సంఘాన్ని స్థాపించి హరిజనోద్దరణకు పాటుపడిన బ్రహ్మసజమాజ నాయకుడు ?
 - రఘుపతి వెంకటరత్నం

58. సాలార్‌జంగ్‌-1 అసలు పేరు ?
 - తురాబ్‌ అలీ ఖాన్‌

59. సావిత్రి రచన ఎవరిది ?
- అరవిందుడు

60. హిమాలయోత్తుంగ శృంగం నా బతుకు అన్నది ?
- అడవి బాపిరాజు


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment