నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాల గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకోండిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాతతరం వారు విశ్వసించేవారు.
ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధిచినది. నేటి పాశ్చాత్య వైద్యులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా సూచిస్తున్నారు.
మన శరీరం చుట్టు రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి. మొదటిది పాదం నుండి తలవరకు, తల నుండి పాదం వరకు తిరుగుతుంది. రెండవది ఎడమ వైపునుండి కుడికి, కుడివైపు నుండి ఎడమకు మన చుట్టుతా తిరుగుతుంది. అనుకూల దిశగా మన శరీర కదలిక వల్ల రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది.
ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ద దశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడును. ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివిఎపునకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహం బలం పుంజుకుంటుందని తెలుపడం జరుగుతోంది.
పిల్లలు తమ పనిలో మందకోడిగా ఉన్నట్లయితే ఎడమవైపునకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు.
ఎడమ వైపు వత్తిగిలి నిద్రలేస్తే, గుండెపై వత్తిడి కొంచెం ఎక్కువ అవ్వడానికి అవకాశం వుంది. ఎందుకంటే అనేక మంది రాత్రి పడుకోబోయే ముందు నీరు త్రాగకుండా పడుకుంటారు, దానివల్ల రక్తంలో నీరు తక్కువై తెల్ల వారే సరికి, బాగా రక్తం చిక్కబడి, తలకు శరీరంలోని ప్రతి కణానికీ ఆక్సిజెన్ అవసరం
ఆక్సిజన్ అంతా రక్తం ద్వారానే కణాలకు చేరవేయాలి కనుక, మరి ఆక్సిజన్ ని కొనిపోయే రక్తనాళాల్లో రక్తాన్ని ప్రవహింప చేయడానికి గట్టిగా మరింత బలంగా గుండె రక్తాన్ని అందులోనూ చిక్కని రక్తాన్ని పంప్ చెయ్యాలంటే రక్తనాళాల్లోని రక్తాన్నిమరింత గట్టిగా నెట్టాలి సరిగ్గా ఇక్కడే గుండె కండరాలు (మహోకార్డియం మజిల్స్)ఎక్కువ శ్రమకు గురౌతూ వుంటాయి, అలాంటి సమయంలో గుండె కండరాలు చనిపోవడం జరుగుతుంది.
ఇలా గుండెలోని కండరాలు పని చెయ్యక చనిపోవడాన్ని హార్ట్ ఎటాక్ అనీ దీనినే Myocardial Infarction అంటారు. ఒక్కోసారి అందుకనే హార్ట్ ఎటాక్, పరాలిసిస్ నిద్రలోనూ ఉదయాల్లోనూ రాకుండా వుండడానికి రెండు గ్లాసుల నీరు రాతి పూట పడుకోబోయే ముందు తాగి పడుకోమని చెప్తారు కార్డియాలజీ డాక్టర్లు. అసలే నీరు తాగే అలవాటు లేని వారు, నీరు తాగడాన్ని బద్దకించిన వారు, వారి వొంట్లో చిక్కగా వుండే రక్తాన్ని పంప్ చెయ్యడానికి వారి గుండె కండరాలు మయో కార్డియల్ మజిల్స్ మరింత ఎక్కువగా పని చేసి మరింత అలసటకు గురై వుంటాయి.
దానికి తోడు ఎడమ వైపునకు వత్తిగిలి లేస్తే అసలే చచ్చీ చెడీ పని చేసి అలసిపోయిన ఆ గుండె మరింత అలసటకి గురయ్యే అవకాశం వుంది. కనుక కుడి వైపునకు వత్తిగిలి లేవమనీ, ఎడమ వైపునకు వత్తిగిలి పడుకోవద్దనీ అనుభవజ్ఞులైన అనేక మంది పెద్ద కార్డియాలజిస్టులు, గుండె స్పెషలిస్టులైన డాక్టర్లు చెప్తారు
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment