దక్షిణాఫ్రికాలో పెరిగే తాటిచెట్టు జాతికి చెందిన పాండనస్ కాండెలాబ్రమ్ అనే అరుదైన మొక్క.. వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పేస్తుందట!
సాధారణంగా వజ్రాలు.. కింబర్లైట్ రాళ్లలో లభిస్తుంటాయన్నది శాస్త్రవేత్తల అంచనా. ఆ రాళ్లలో పెరిగే ఏకైక మొక్క పాండనస్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముళ్లతో..చిన్నగా పెరిగే ఇవి లైబీరియాలోని కింబర్లైట్ రాతి ప్రారంభంలో మాత్రమే పెరుగుతాయని చెబుతున్నారు. మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్ అధికంగా ఉండే ఈ రాళ్లు ఆ చెట్ల ఎదుగదలకు ఎరువులుగా ఉపయోగపడతాయట!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 6000 కింబర్లైట్ పైపులున్నాయని.. అందులో 600 వాటిల్లో మాత్రమే వజ్రాలు లభిస్తాయని.. అందులోనూ 60 వాటిల్లో మాత్రమే నాణ్యమైనవి లభిస్తాయని చెబుతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు దీనిపై ప్రయోగాలు చేశారు.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment