ఆ ఊరిలో వర్షం పడితే పిల్లలు పెద్దలు కలిసి పొలాల్లో వెదుకుతారు? ఒక్కటి దొరికిందా ఆ ఇంటి దశ తిరిగినట్లే.?

kurnool pagidirai కోసం చిత్ర ఫలితం

సాధారణంగా వర్షం పడితే జనం పొలాలపై పడి వేరుశనగో లేదా మరో పంట సాగు చేయడానికి దుక్కులు చేస్తారు. కానీ అక్కడ వర్షం పడిందంటే చాలు గ్రామాలకు గ్రామాలు పిల్లాల జెల్లా అంతా వెళ్ళి చేలపై వెతుకులాట ప్రారంభిస్తారు. ఎందుకో తెలుసా.. వజ్రాలు.. వజ్రాల కోసం వేట ప్రారంభం అవుతుంది. ఇది ప్రతీ యేడు జరిగే తంతే.. ఎక్కడో తెలుసా... ఒకప్పటి రతనాలసీమ రాయలసీమలో.. వివరాలు 

కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతాల్లోని పగిడిరాయి, జొన్నగిరి, రాతన కొత్తూరు, బసినేపల్లి, ఎర్రగుడి, గిరిగెట్ల, అమినాబాదు, రాతన గ్రామాలు వజ్రాల కారణంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆ గ్రామాల భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి. అదృష్టం కొద్దీ ఎవరికైనా విలువైన వజ్రం దొరికిందంటే చాలు కరువు ప్రాంతంలో ఆ ఇంటి దశ తిరిగినట్లే. 

15 రోజుల క్రితం గుంతకల్లు మండలం మలకలపెంటకి చెందిన వ్యక్తికి రూ. 30 లక్షల విలువ చేసే వజ్రం దొరగ్గా తుగ్గలి మండలానికి చెందిన వ్యాపారి దానిని కొనుగోలు చేసి డాన్‌కు చేరవేసినట్టు సమాచారం. ఏడేళ్ల క్రితం పెరవలి ప్రాంతంలో హంద్రీ నీవా కాలువ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌కు తవ్వకాలలో రంగురాయి దొరికినట్టు సమాచారం. 

దీన్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నట్టు సమాచారం. కొన్నేళ్ల క్రితం రాంపల్లిలో ఓ నిరుపేదకు వజ్రం లభ్యమైంది. దాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని పత్తికొండ ట్రెజరీలో భద్రపరిచారు. ఆ నిరుపేదకు నిరాశేమిగిలింది. 

13 ఏళ్ల క్రితం తుగ్గలి మండలం పగిడిరాయి దొననుండి మద్దికెర మండలం పెరవలి వరకూ ఎస్‌ఆకారంలో కేంద్ర భూగర్భ ఖనిజ వనరుల శాఖ పరిశోధన చేసింది. భూగర్భంలో వజ్ర నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. వెలికితీసేందుకు ఆయ్యే ఖర్చు వాటి విలువల కన్నా అధికమవుతుందని నివేదించడంతో కేంద్రం పట్టించుకోవడం మానేసింది.


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment