చాలా దేశాల్లో గబ్బిలం చెడుకు సంకేతంగా భావిస్తారు. కానీ చైనా, థాయ్‌లాండ్‌వంటి దేశాలు దానిని శుభసూచకంగా చెబుతారు. ఆ విషయం పక్కనబెడితే...ప్రతి గబ్బిలం గంటకు 1200 దోమలు లేదా కీటకాలను తింటుంది. ఇది రైతులకు, మనుషులకు అవి చేసే పెద్దసాయం. క్షీరదాల్లో ఎగిరే పక్షి ఇదొక్కటే. ఎగిరే ఉడతలు క్షీరదాలే అయినా అవి ఎగరడాన్ని గ్లైడింగ్ (గెంతడం)గానే చెబుతారు. వాంపైర్ బాట్స్‌గా పిలిచే రక్తంతాగే గబ్బిలాలు కేవలం మూడు జాతులే ఉన్నాయి. ఇవి కేవలం జంతువుల రక్తాన్ని తాగుతాయి. వాటికి నొప్పి తెలియకుండా గాయం చేసి రక్తాన్ని చప్పరిస్తాయి. రోజుకు కేవలం ఒక టేబుల్‌స్పూన్ రక్తాన్ని మాత్రమే అవి తాగుతాయి.
గబ్బిలాల రెట్ట చాలా బలమైన ఎరువు. కేవలం వీటి ఎరువును ఎగుమతి చేసి బతికేస్తున్న ప్రాంతం టెక్సాస్. మనుషులకు వేలిముద్రలు ఎలా వేర్వేరుగా ఉంటాయో అలాగే, గబ్బిలాల్లో, అవి చేసే శబ్దం, వాటి రంగు, వాటి శరీరంనుంచి వచ్చే వాసన దేనికి దానికి ప్రత్యేకంగా ఉంటాయి. వేలాది గబ్బిలాల పిల్లల మధ్య ఉన్నా తన పిల్లను తల్లులు ఈ ప్రత్యేక అంశాల ఆధారంగా గుర్తుపడతాయి. ప్రపంచంలో ఫ్లయింగ్‌ఫాక్స్‌గా పిలిచే గబ్బిలాలు అతిపెద్దవి. రెక్కలు విప్పితే ఆరడగుల వెడల్పుండే ఇవి ఇండోనేషియాలో కన్పిస్తాయి.
కాలి బొటనవేలంత ఉండే బంబల్‌బీ బేట్స్ అతి చిన్నవి. ఇవి థాయ్‌లాండ్‌లో కన్పిస్తాయి. ప్రపంచంలోని క్షీరదాల్లో మూడోవంతు ఇవే. అన్నట్లు తీవ్రమైన చలిని, తీవ్రమైన వేడిని ఇవి ఇష్టపడవు. అయినా మంచుగడ్డల్లో చుట్టేసినా ఇవి చాలాకాలం బతికేయగలవట
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment