ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015), భారత దేశపు ప్రముఖ క్షిపిణి శాస్త్రవేత్త మరియు 11 వభారత రాష్ట్రపతి. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.
భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998 లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు.
అవుల్ పకీర్ జైనుల్బదీన్ అబ్దుల్ కలాం రామేశ్వరం, రామనాథపురం జిల్లా, తమిళనాడు రాష్ట్రంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించాడు. తండ్రి జైనుల్బదీన్, పడవ యజమాని మరియు తల్లి ఆశిఅమ్మ, గృహిణి. పేద కుటుంబ కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించాడు.
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT - చెన్నై) నుండి పట్టా పొందిన తరువాత 1960 లో, కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ DRDOలో ఉద్యోగం చేయడంతొ ఆయన సంతృప్తి చెందలేదు. కలాం ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ కింద INCOSPAR కమిటీలో పనిచేశారు. 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేరి ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచేశారు.
జూలై 1980 లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్య లో విజయవంతంగా చేర్చినది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 1963-64 లో, NASA యొక్క లాంగ్లే రీసెర్చ్ సెంటర్ ను(హాంప్టన్ వర్జీనియా లో కలదు) మరియు గ్రీన్బెల్ట్, మేరీల్యాండ్ లోని గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మరియు తూర్పు వర్జీనియా తీరంలో కల Wallops ఫ్లైట్ సౌకర్యం సందర్శించారు. 1970 మరియు 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV మరియు SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్ట్లు విజయవంతం అయినాయి.
పురస్కారాలు
పురస్కారాలు
సంవత్సరం | పురస్కారం | అందచేసినవారు |
---|---|---|
2014 | సైన్స్ డాక్టరేట్ | ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం,UK |
2012 | గౌరవ డాక్టరేట్ | సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం |
2011 | IEEE గౌరవ సభ్యత్వం | IEEE |
2010 | ఇంజనీరింగ్ డాక్టర్ | వాటర్లూ విశ్వవిద్యాలయం |
2009 | గౌరవ డాక్టరేట్ | ఓక్లాండ్ యూనివర్శిటీ |
2009 | హూవర్ పతకం | ASME ఫౌండేషన్, USA |
2009 | ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు | కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, USA |
2008 | ఇంజనీరింగ్ డాక్టర్ | నాణ్యంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, సింగపూర్ |
2007 | కింగ్ చార్లెస్ II పతకం | రాయల్ సొసైటీ, UK |
2007 | సైన్సు రంగంలో గౌరవ డాక్టరేట్ | వోల్వర్థాంప్టన్ యొక్క విశ్వవిద్యాలయం, UK |
2000 | రామానుజన్ అవార్డు | ఆళ్వార్లు రీసెర్చ్ సెంటర్, చెన్నై |
1998 | వీర్ సావర్కర్ అవార్డు | భారత ప్రభుత్వం |
1997 | నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందిరా మహాత్మా గాంధీ పురస్కారం | భారత జాతీయ కాంగ్రెస్ |
1997 | భారతరత్న | భారత ప్రభుత్వం |
1994 | గౌరవనీయులైన ఫెలోగా | ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (భారతదేశం) |
1990 | పద్మ విభూషణ్ | భారత ప్రభుత్వం |
1981 | పద్మ భూషణ్ | భారత ప్రభుత్వం |
రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం జూలై 27, 2015 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్‌లోని ఏఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం.. హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాంను స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆయన గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆతర్వాత సుమారు గంట వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.
అబ్దుల్ కలాం జీవిత చరిత్ర బుక్
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment