విండోస్‌ 10 ఇన్‌స్టాలేషన్‌ చేసుకోవడం ఎలా?

windows 10 కోసం చిత్ర ఫలితం

మైక్రోసాఫ్ట్‌ సరికొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ' విండోస్‌ 10'ను విడుదల చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో లభ్యమవుతోంది. విండోస్‌ 7, 8.1 జెన్యున్‌ ఓఎస్‌లను వినియోగిస్తున్న వారు తమ పీసీలో విండోస్‌ 10ను ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను మీ పీసీలో ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకునేందుకు  వివరణాత్మక టుటోరియల్‌ను విడుదల చేసింది. ఈ టుటోరియల్‌ను ఫాలో అవటం ద్వారా విండోస్‌ 10 మీడియా క్రియేషన్‌ టూల్‌ విండోస్‌ 10ను మాన్యువల్‌గా మీ పీసీలో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. 

విండోస్‌ 10ను ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకునేందుకు అవసరమైనవి: 
విండోస్‌ 7, లేదా విండోస్‌ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (జెన్యున్‌ కాపీ), మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10 మీడియా క్రియేషన్‌ టూల్‌, మంచి ఇంటర్నెట్‌ కనెక్షన్‌, (గమనిక: విండోస్‌ 10ను మీ పీసీలో ఇన్‌స్టాల్‌ చేసుకునేందుకు డివైస్‌లోని డేటాను పూర్తిగా బ్యాకప్‌ చేసుకోవాలి). ఇన్‌స్టాలేషన్‌ ప్రక్రియ ప్రారంభించే ముందు మీ సిస్టమ్‌ సామర్థ్యాన్ని బట్టి ఈ రెండు ఫైల్స్‌లో ఒకదాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. స్టాల్‌ చేసుకునేందుకు ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోండి.

- మీ సిస్టమ్‌ కాన్ఫిగరేషన్‌కు సరిపోయే మీడియా క్రియేషన్‌ టూల్‌ను ఎంపిక చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోండి

- టూల్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తరువాత విండోస్‌ 10ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు మీడియా క్రియేషన్‌ టూల్‌లోని  బటన్‌ పై క్లిక్‌ చేయండి. ఇప్పుడు విండోస్‌ 10 డౌన్‌లోడ్‌ అవటం స్టార్ట్‌ అవుతుంది.

- టూల్‌ మీ డౌన్‌లోడింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తుంది.

- విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను మీ పీసీలో ప్రవేశపెట్టేందుకు అవసరమైన అన్ని ఫైల్స్‌ను మీడియా క్రియేషన్‌ టూల్‌ సమకూరుస్తుంది.

- విండోస్‌ 10 ఇన్‌స్టాలర్‌ మీ పీసీలో లోడ్‌ అవుతుంది.

- విండోస్‌ 10 ఇన్‌స్టాలర్‌ మీ పీసీని చెక్‌ చేసుకుంటుంది.

- లైసెన్స్‌ టర్మ్‌ ను చేయటం ద్వారా విండోస్‌ 10 ఇన్‌స్టాలేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

- ఇన్‌స్టాలర్‌ టూల్‌ విండోస్‌ ఇన్‌స్టాలేషన్‌ ప్రకియను మీ పీసీలో ప్రారంభించే ముందు మీ పీసీకి ఇంకేమైనా అప్‌డేట్స్‌ అవసరమేమోనని మరొకసారి చెక్‌ చేసుకుంటుంది. 

- అర్‌ బటన్‌ పై క్లిక్‌ చేసినట్లయితే విండోస్‌ 10 మీ పీసీలో మొదలవుతుంది.

- విండోస్‌ 10 సెటప్‌ను మీకు నచ్చినట్లు సెలక్ట్‌ చేసుకుని చీవఞ్‌ బటన్‌ పై క్లిక్‌ చేసినట్లయితే విండోస్‌ 10 ఇన్‌స్టాల్‌ అవుతుంది.


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment