వై-ఫై అంటే ఏమిటి?

 వై-ఫై పాత్ర కీలకం. వైర్‌లెస్‌ వ్యవస్థలైన వీటి ద్వారా సమాచారాన్ని వేగవంతంగా షేర్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులు చాలా మందికి వీటి గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. రెండు డివైజ్ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్ల సాయం లేకుండా సమాచారాన్ని షేర్‌ చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని 'బ్లూటూత్‌' అంటాం. 
wifi కోసం చిత్ర ఫలితం
ఇది పరిమిత స్థాయిలో పనిచేస్తుంది. వై-ఫై విషయానికొస్తే.. ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్‌ చేసుకోవచ్చు. వై-ఫై పద్ధతిలో పరికరాల మధ్య సమాచారాన్ని మరింత వేగవంతంగా షేర్‌ చేసుకోవచ్చు. వై-ఫై కనెక్టివిటీ గురించి పలు ఆసక్తికర వాస్తవాలు..

- వై-ఫై పూర్తి పేరు వైర్లెస్‌ ఫిడిలిటీ. ఇది కనిపించని తాడు లాంటిది. ఈ వ్యవస్థ మీ కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కలెక్ట్‌ చేస్తుంది.

- వై-ఫై టెక్నాలజీ రూపకల్పనకు అవసరమైన సాంకేతికతను హెడీ లామర్ర్‌ అనే వ్యక్తి కనుగొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు అన్ని ప్రముఖ హోటళ్లు ఉచితంగా వై-ఫైను అందిస్తున్నాయి. అయితే ఈ వై-ఫై పరిధి వంద మెగా టైట్లు మాత్రమే.

- మీ హోమ్‌ వై-ఫై బలహీనంగా ఉంటే ఓ వైర్‌లెస్‌ రిపీటర్‌ను కొనుగోలు చేయండి. మీ వై-ఫై పరిధి విస్తరిస్తుంది.

- వై-ఫై రేడియో సిగల్స్‌ ఆధారంగా స్పందిస్తుంది. వై-ఫై పరిధిలో సెక్యూరిటీ కోడ్‌ నిబంధన లేనట్లయితే ఏ వై-ఫై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని పొందొచ్చు.

- వై-ఫై వ్యవస్థను 24 గిగాహెట్జ్‌ నుంచి 5 గిగా హెట్జ్‌ వరకు ప్రీక్వెన్సీ రేంజ్‌ గల రేడియో తరంగాలను వినియోగిస్తారు.


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment