నెట్‌వర్క్‌ లేకపోయినా మీ స్నేహితులకు ఎస్సెమ్మెస్‌ పంపించుకోవచ్చు?

మీరు మీ స్నేహితులతో కలసి టూర్‌కు వెళ్లారు. అది అటవీ ప్రాంతం. హఠాత్తుగా మీరు తప్పిపోయారు. మీకు దారి తెలియడం లేదు. స్నేహితులకు మొబైల్‌ ద్వారా సమచారం ఇవ్వాలంటే అక్కడ నెట్‌వర్క్‌ లేదు. దిక్కుతోచని స్థితి. ఊహించుకుంటేనే భయమేస్తోంది కదూ..! 
ఇలాంటి పర్యటనల సమయంలో  కంపెనీ రూపొందించిన ఈ చిన్న పరికరం ఉంచుకుంటే ఇలాంటి సమస్యలు రావు. మీరు తప్పి పోయినప్పుడు సెల్‌ నెట్‌వర్క్‌ లేకపోయినా మీ స్నేహితులకు ఎస్సెమ్మెస్‌ పంపించుకోవచ్చు. పరికరం ద్వారా అనుసంధానమై ఉంటుంది. 

దాని నుంచి ఓ చిన్న పాటి ఫ్రీక్వెన్సీ గల రేడియో తరంగాలు విడుదలవుతాయి. ఇవి గరిష్టంగా 50 మైళ్ల వరకు వెళ్లగలవు. 

మీ సెల్‌ ఫోన్‌ లో లేదా అప్లికేషన్‌ ద్వారా ఇతర  యూజర్లకు అపరిమితమైన, యాడ్స్‌ లేని మెసేజ్‌ పంపుకోవచ్చు. లేదా మీ జీపీఎస్‌ లొకేషన్‌ మీ స్నేహితులకు తెలియజేయొచ్చు. వాయిస్‌ కాల్స్‌ సౌకర్యం మాత్రం ఉండదు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment