1. వహాబీ ఉద్యమం ఎవరి పరిపాలనలో ప్రారంభం అయ్యింది ? -నాజర్ ఉద్దౌలా |
2. వాస్కోడిగామా మొదట భారతదేశానికి చేరినప్పుడు కాలికట్ రాజు ఎవరు ? - జామొరీన్ |
3. వేదాలను, ఉపనిషత్తులను బెంగాలీ భాషలోకి అనువదించినవారు ? - రాజారామ్మోహనరారు |
4. పోర్చుగీస్ తర్వాత ఇండియాకు వచ్చిన యూరోపియన్లు ? డచ్‌వారు (నెదర్లాండ్స్) |
5. సాలార్ జంగ్ దివాన్‌గా వచ్చిన సంవత్సరం ? - 1853 |
6.భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి ఎవరు సహకరించారు ? - రాజారామ్మోహనరారు |
7. 1857 తిరుగుబాటులో హైదరాబాద్‌లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడినది ? -తుర్రేబాజ్ ఖాన్ |
8. ఇండియాకు వచ్చిన చివరి యూరోపియన్లు ? - ఫ్రెంచివారు |
9. ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు ? - క్రీ.శ. 1664 |
10. మూసీ నదికి భారీగా వరదలు వచ్చిన సంవత్సరం ? -1908 |
11. కర్ణాటక యుద్ధాలు ఎవరెవరి మధ్య ప్రధానంగా జరిగాయి ? - బ్రిటిషర్లు, ఫ్రెంచివారు |
12. హైదరాబాద్ రాష్ట్రంలో పోలీస్ శాఖ నెలకొల్పిన సంవత్సరం ? -1865 |
13. ఫ్రెంచి సైన్యాన్ని సెయింట్‌జార్జీ కోటపైకి నడిపిన అధికారి ? - డూప్లే |
14. సిటీ కాలేజీ (హైదరాబాద్‌లో) స్థాపించిన సంవత్సరం ? - 1870 |
15. అడవి బాపిరాజు మీజాన్ అనే పత్రికను ఏ భాషలో ప్రచురించేవారు ? - తెలుగు |
16. కవికోకిలగా ప్రసిద్ధి చెందింది ? - దువ్వూరి రామిరెడ్డి |
17. గజ బేటకార బిరుదును పొందినవారు ? - రెందో దేవరాయులు |
18. వందేమాతర గేయాన్ని రచించినవారు ? - బకిం చంద్రఛటర్జీ |
19.మద్రాసు మహాజన సభ స్థాపన ? - 1884 |
20. మొదటి కర్ణాటక యుద్ధంలో విజయం సాధించినవారు ? - ఫ్రెంచివారు |
21. హైదరాబాద్ రాష్ట్రంలో పేపర్ కరెన్సీ ప్రవేశపెట్టిన సంవత్సరం ? -1918 |
22. ఆంధ్రలో హోంరూల్ ఉద్యమ కార్యదర్శి ? -గాడిచర్ల హరి సర్వోత్తమరావు |
23. జాగిర్దారీ కాలేజ్ హైదరాబాద్‌లో ఎక్కడ, ఏ సంవత్సరంలో స్థాపించారు ? - బేగంపేట, 1928లో |
24.కర్నూల్, కడప (కేసీ కెనాల్ ) కెనాల్ నిర్మాణం జరిగిన సంవత్సరం ? - 1890 |
25.చీరాల- పేరాల పన్నుల వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించినవారు ? - దుగ్గిరాలత చంద్రఛటర్జీ |
26.జైనులకు, వైష్ణవులకు మధ్య విభేదాలను పరిష్కరించిన విజయనగర రాజు ? - మొదటి బుక్కరాయలు |
27. ఆంధ్రలో గదర్ పార్టీ సభ్యుడు ? - దర్శి చెంచయ్య |
28.ఆంధ్రప్రదేశ్‌లో మొదట ఏ ప్రాంతంలో శాశ్వత భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టారు ? - రాయలసీమ ప్రాంతంలో |
29.ఆంధ్రలో కమ్యూనిస్ట్ పార్టీ అవతరణ ? - 1934 |
30.ఏ మొఘల్ గవర్నర్‌ను ఓడించి నిజాం ఉల్‌మల్క్ మొదటి హైదరాబాద్ నిజాం రాజ్యస్థాపన చేశాడు ? - ముబారిజ్ ఖాన్ |
31.హైదరాబాద్‌లో భూమిశిస్తు సంస్కరణలకు ఆద్యుడు ? - చార్లెస్ మెట్ కాఫ్ |
32. అక్కన్న, మాదన్న సోదరులు ఎవరి మంత్రులు ? -అబుల్ హాసన్ తానీషా |
33. మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కవోసం నియమించిన పార్టీ కమిటీ అధ్యక్షుడు? - కుమార స్వామిరాజా |
34. మాలిక్ కపూర్ చేతిలో ఓడిన కాకతీయ రాజు ? - రెండో ప్రతాపరుద్రుడు |
35. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనం ఎక్కడ, ఏ సంవత్సరంలో నిర్మితమైంది ? -అఫ్జల్‌గంజ్, 1891లో |
36. స్వామి దయానంద సరస్వతి రచనలు ? - సత్యార్థ ప్రకాశ్, రుగ్వేద భాష్య భూమిక (హిందీలో) |
37.పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం ? - 1794 |
38. ఐవోల్ శాసనం ఎవరి గురించి తెలుపుతుంది ? - రెండో పులకేశి |
39. కాకతీయుల కాలంనాటి చిత్రకళ ఎక్కడ ఉంది ? - పిల్లలమర్రి దేవాలయాలు |
40. గాలివాన కథ రచయిత ? - పాలగుమ్మి పద్మరాజు |
41. విశాలాంధ్ర భావాన్ని మొట్టమొదట ప్రచారం చేసినవారు ? - కమ్యూనిస్టులు |
42.హైదరాబాద్‌లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం స్థాపకుడు ? - కొమర్రాజు లక్షణ్ రావు |
43. 1887లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైన తొలి ముస్లిం నాయకుడు ఎవరు ? - బద్రుద్దీన్ త్యాబ్జీ |
44. ప్రర్థనా సమాజాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు ? ఆత్మారాం పాండురంగ, 1867, బొంబాయి |
45. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ప్రచురించిన పత్రిక - క్రిసెంట్ |
46. మా కొద్దీ తెల్ల దొరతనం రచియత ఎవరు ? - గరిమెళ్ల సత్యనారాయణ |
47. హైదరాబాద్ రాజ్యంలోని రజకార్ల ఉద్యమ నాయకుడు ? - ఖాసీంరజ్వీ |
48. హైదరాబాద్ రాజ్యంలో భారత ప్రభుత్వం తన తరపున నియమించిన ముఖ్య ప్రతినిధి ? -కె.ఎం.మున్షీ |
49.థార్ కమీషన్ (1948) ఎప్పుడు ఏర్పాటైంది ? - జూన్ 17న |
50.పెద్ద మనుషుల ఒడంబడిక (1956) ముఖ్యంగా దేనికి సంబంధించింది ? - తెలంగాణ ప్రాంత ప్రజల కోసం |
51. 1910లో అలహాబాదులో భారత్ స్త్రీ మహామండల్ సంస్థను స్థాపించింది ఎవరు ? - సరళాదేవి చౌధురాణి |
52. బ్రహ్మర్షి బిరుదు గల సంఘ సంస్కర్త ? - రఘుపతి వెంకటరత్నం నాయుడు |
53. రెండో దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించింది ఎవరు ? - అబ్దుల్ రజాక్ |
54. స్వామి సీతారామ శాస్త్రి సెప్టెంబర్ 20 నుంచి 35 రోజులపాటు ఏ సంవత్సరంలో నిరాహార దీక్ష చేశాడు ? - 1951 |
55.అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు విజయవాడలో జరిగిన సంవత్సరం ? - 1921 |
56. ఉమెన్స్ ఇండియా అసోసియేషన్‌ను స్థాపించిన ఐర్లండ్ దేశస్తురాలు ఎవరు ? - దొరోతి |
57. హైదరాబాద్ సంస్థానంలో సత్యాగ్రహాన్ని నిర్వహించిన నాయకుడు ? - స్వామి రామనంద తీర్థ (1947-48) |
58.తెలుగు భాషకు ఎనలేని సేవచేసిన ఆంగ్లేయుడు ? - సి.పి. బ్రౌన్ |
59.పైడా రామకృష్ణయ్య దేనికోసం పాటుపడ్డాడు ? - వితంతు వివాహాలు |
60.రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియామకం ఏ సంవత్సరంలో జరిగింది ? - 1953 |
61. తెలుగులో ప్రథమ రాజకీయ పత్రిక ఆంధ్ర ప్రకాశిక స్థాపకుడు ? - ఎ.పి.పార్థసారథి నాయుడు |
62. 1950లో విశాలాంధ్ర ప్రథమ సమావేశం జరిగిన నగరం ? - వరంగల్ |
63. ఆంధ్రలో వీరేశలింగం సాంఘిక సంస్కరణోద్యమాన్ని వ్యతిరేకించింది ? - కొక్కండ వెంకటరత్నం |
64. రజాకార్ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ? - 1940 |
65. వితంతు పునర్వివాహ చట్టం రూపకల్పనకు కృషిచేసిన వ్యక్తి ఎవరు ? - ఈశ్వరచంద్ర విద్యాసాగర్ |
66.భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆంధ్రుడు ? - పి.ఆనందాచార్యుడు |
67. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్‌ను ఎవరు స్థాపించారు ? - ఎం.జి రనడే |
68. జన్మభూమి వారపత్రిక సంపాదకుడు ? - పట్టాభి సీతారామయ్య |
69.ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని 1926లో మొదట ఎక్కడ స్థాపించారు ? - విజయవాడ |
70.కొండా వెంకటప్నపయ్య బిరుదు ? - దేశభక్తి |
71.తెలంగాణలో ఆంధ్ర మహాసభలను ఎదుర్కొనేందుకు నిజాం ఏ సంవత్సరంలో ఇతైహాదులో ముస్లిమీన్ సంస్థను స్థాపించారు ? - 1927 |
72.ఉర్దూను రాజభాషగా చేసిన నిజాం రాజు ? - మహబూబ్ ఆలీఖాన్ |
73. 1887లో నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ? - అఘోరనాథ్ ఛటోపాధ్యాయ |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment