ఏదేనీ సమతలంగా, నునుపుగా ఉన్న ప్రదేశంపై కాంతి పడినప్పుడు అది వెంటనే ఆ వస్తువు నుంచే వెనుకకు మరలుతుంది. నున్నటి ఉపరితలం నుండి కాంతి వెనుకకు మరలటాన్ని పరావర్తనం అంటారు. ఈ కాంతి పరావర్తనం రెండు రకాలు.
ఒకటి నియతం, రెండూ అనియతం. నియత పరావర్తనం నునుపైన, మెరిసే ఉపరితలం నుండి, అనియత పరావర్తనం గరుకైన ఉపరితలం నుండి కలుగుతుంది. మామూలు అద్దం నుండి చూసినప్పుడు కాంతి ప్రతిఫలించడం వల్లే మన ప్రతిబింబం ఏర్పడుతుంది. గరుకుగా ఉన్న ఉపరితలంపై పడిన కాంతి వివిధ దిశలకు వెదజల్లబడుతుంది. కాంతి ఒక సమతల ప్రదేశం నుండేకాక వంకర ఉపరితలం నుండి కూడా పరావర్తనం చెందుతుంది.
ఈ సూత్రం ఆధారంగానే పుటాకార, కుంభాకార దర్పణాలను తయారుచేస్తారు. కుంభాకార దర్పణాలను కార్లు, మోటారు వాహనాలు నడిపే డ్రైవర్లు వెనుక నుండి వచ్చే వాహనాలను చూడడానికి ఉపయోగిస్తారు. పుటాకార దర్పణాన్ని మన ప్రతిబింబాలను స్పష్టంగా చూసుకునేందుకు వినియోగిస్తాం. వివిధ పరికరాలను తయారుచేసేందుకు కూడా అద్దాల ద్వారా కాంతిని ప్రతిబింబింపజేస్తారు.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment