భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట

ఆర్యభట్ట ఉపగ్రహం భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం భారతీయ పురాతన ఖగోళశాస్త్రవేత్త, గణితశాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడు,(astronomer)అయిన ఆర్యభట్ట జ్ఞానపకార్థం ఈ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని నామకరణం చేసారు.

ఆర్యభట్ట కోసం చిత్ర ఫలితం

1975 సంవత్సరం నాటికి భారతదేశానికి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టు అంతరిక్ష సాంకేతికవిజ్ఞానం అందుబాటులో లేదు.అందువలన అప్పటికి భారతదేశానికి మిత్రదేశమైన సోవియట్ యూనియన్ దేశం సహాకారంతో వారి దేశంలోని అతరిక్ష ప్రయోగకేంద్రం నుండి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.అంతరిక్ష విజ్ఞానం లో పరిణితి,అభివృద్ధి సాంధించుతకై, ఆర్యభట్ట ఉపగ్రహాన్ని భారతదేశానికి చెందిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ అర్గనైజెసన్(Indian Space Research Organisation (ISRO))తయారు చేసినది ఆర్యభట్ట ఉపగ్రహాన్ని సోవియట్ యూనియన్  అంతరిక్ష వాహన ప్రయోగ కేంద్రం నుండి ,కాస్మోస్ -3Mఅనే ఉపగ్రహ వాహాక రాకెట్ సహాయంతో, 1975 వ సంవత్సరం, ఏప్రిల్ 19వ తేదిన విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు 
ఆర్యభట్ట కోసం చిత్ర ఫలితం
ఈ ఉపగ్రహ ప్రయోగం నిమిత్తమై ఇండియా,సోవియట్ యూనియన్ మధ్య U.R ,రావు గారి సారధ్యంలో 1972 లో అంగీకారం కుదిరినది.వారు ఉపగ్రహం ప్రయోగించినందుకు ప్రతి ఫలంగా సోవియట్ యూనియన్ వారు భారతదేశం రేవుల నుండి,ఓడల మరియు లాచింగ్ వాహనాల మార్గాలనుజాడలుపట్టుటకు/ ట్రాక్(track) చెయ్యుటకు వారికి అనుమతి ఇవ్వడమైనది

ఉపగ్రహం సాంకేతిక వివరాలు- కక్ష్య వివరాలు


అంతరిక్షములో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 96.46 నిమిషాల భ్రమణకాలం/ప్రదక్షిణకాలం పట్టు కక్ష్యలో, 611 కిలోమీటర్ల అపోజీ(భూమినుండి ఎక్కువదూరం),568 కిలోమీటర్ల పెరిజీ(భూమినుండి దగ్గరిదూరం)ఎత్తులో,50.6 డిగ్రీల ఏటవాలులో ఉండునట్లు ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు.ఈ ఉపగ్రహ ప్రయోగ ఉద్దేశ్యం ఖగోళశాస్త్ర ఎక్సు కిరణాల అధ్యాయనం(ray astronomy),భౌతిక, రసాయనిక విధానాధ్యయనం (aeronomics) మరియు,సూర్య సంబంధిత విజ్ఞాన అధ్యాయనంపై పరీక్షలు నిర్వహించడం.ఈ ఉపగ్రహం 26 పార్శతలాలు కలిగిన ,బహుభుజ/తల సౌష్టవం కలిగి,1.5 మీటర్ల వ్యాసం తో నిర్మించబడినది.ఉపగ్రహం యొక్క పై మరియు క్రింది భాగాలు మినహాయించి అన్ని తలాల/పార్శాల మీద సోలారు ఫలకాలు అమర్చబడినవి.ప్రయోగించిన నాలుగు రోజుల తరువాత,60 ప్రదక్షణలు పూర్తయిన తరువాత,ఉపగ్రహంలో విద్యుత్తుఉత్పత్తిలో లోపం వలన, ఈఉపగ్రహం పనిచెయ్యడం మానివేసినది.సోవియట్ యూనియన్ మీడియా వార్తల ప్రకారం ఈ ఉపగ్రహం అటు తరువాత కూడా కొంతకాలం వరకు పనిచేసి సమాచారాన్ని పంపినట్లు తెలుస్తున్నది.ఈ ఉపగ్రహం తిరిగి 1992 ఫిబ్రవరి 11 న భూవాతవరణంలో ప్రవేశించినది.

ఈ ఉపగ్రహం యొక్క చిత్రాన్ని 1976 మరియు 1997 భారతదేశపు 2రూపాయల కరెన్సీనోట్ల పై,మరియు P-79a-m.సంఖ్య గల 1 రూపాయి నోట్లపై ముద్రించారు


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment