డాప్లర్ ప్రభావం లేదా (డాప్లర్ మార్పు) అనేది సోర్స్ మరియు అబ్జర్వర్ మధ్య తరంగ ఫ్రీక్వెన్సీ(పౌనఃపున్యం) తేడాను గురించి తెలియజేస్తుంది.దీనిని ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త క్రిస్టియన్ డాప్లర్ 1842లో పరగ్వెలో ప్రతిపాదించాడు.ఈయన తరువాత ఈ ప్రభావానికి డాప్లర్ ప్రభావం అనే పేరును పెట్టారు.ఈ ప్రభావాన్ని మనము మన నిత్య జీవితములో రోజూ చూస్తుంటాము.ఉదాహరణకు ఒక వాహనము సైరన్ వేసుకుంటు మన దగ్గరకు వస్తుంటే ఆ వాహనము యొక్క సైరన్ ద్వని ఎక్కువగాను మరియు ఆ వాహనం మనకు దూరముగా వెళ్లేళెటప్పుడు ఆ వాహనము యొక్క సైరన్ ధ్వని తగ్గినట్లు మనకు అనిపిస్తుంది.
నిజానికి ఆ వాహనము యొక్క సైరన్ ద్వని తగ్గడం లేదు. ఇక్కడ మనము అబ్జర్వర్ మరియు వాహనము సోర్స్. సోర్స్ అనేది అబ్జర్వర్ వైపుగా పయినిస్తుంది. సోర్స్ నుండి వచ్చే వరుస తరంగాలు క్రెస్ట్ తరంగాలు,మరియు ఇవి వెంట వెంటనే సోర్స్ నుండి ఉత్పత్తి అవుతూ అబ్జర్వర్ ను చేరవలసిన సమయము కన్నా తక్కువ సమయములో చేరుకుంటాయి. ఇవి అబ్జర్వర్ ను చేరే సమయము చాలా తక్కువగా ఉంటుంది. ఇదే విధముగా సోర్స్ అనేది అబ్జ ర్వర్ కు దూరముగా వెళ్లేటప్పుడు సోర్స్ నుండి వచ్చే ఒక తరంగానికి ఇంకొక తరంగానికి మధ్య వ్యవధి అనేది ఎక్కువగా ఉంటుంది. వేవ్ ఫ్రంట్ల మధ్య దూరము పెరుగుతుంది అందువలన ధ్వని తగ్గినట్లు అనిపిస్తుంది.తరంగముకోసము ఇక్కడ చూడుము. ఈ సిద్దాతం స్రియో కాదో అనేది C. H. D. Buys Ballot|Buys Ballot 1845 చూశాడు
డాప్లర్ ప్రభావం యొక్క అనువర్తనాలను మనము మనకు తెలియకుండానే మన నిత్య జీవితములో ఉపయోగిస్తున్నాము. ట్రాఫిక్ పొలీస్లు దీనిని ఉపయోగించి వాహనాల యొక్క వేగాన్ని చెప్పగలడు. పొలీసు అధికారి మొదటగా తనకు ఏ వాహనం యొక్క వేగము కావాలో నిర్ణయించుకుంటాడు. అతని వద్ద ఉన్న రాడార్ గన్ సహాయంతో ఆ వాహనాన్ని షూట్ చేస్తాడు. ఆ రాడార్ గన్ యొక్క తరంగాలు ఆ వాహనాన్ని డీకొట్టి మరలా ఆ గన్ ను చేరతాయి. ఆ గన్ లో ఒక కంప్యూటర్ ఉంటుంది. ఇది ఆ వాహనము యొక్క వేగాన్ని లెక్కకట్టి అతనికి తెలియజేస్తుంది
మొదటగా వాతావరణ కేంద్రము నుండి రేడియో తరంగాలను గాలిలోనికి పంపిస్తారు. ఇవి గాలిలోనికి వెళ్ళి ఆ మేఘాలను లేదా గాలిలోని వస్తువులను డీ కొడతాయి. తరువాత అవి మరలా వాతావరణ కేంద్రానికి చేరుకుంటాయి. కంప్యూటర్ ఈ తిరిగి వచ్చిన తరంగాలను చూసి, వాతావరణము ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది.
డాప్లర్ ప్రభావం అంటే ఏమిటి?
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment