PSLV-C-30

ఖగోళంలో అంతుచిక్కని అంశాలపై అధ్యయనం కోసం భారత్ రూపొందించిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహ ప్రయోగం (indian astronomy satellite mission) పీఎస్ఎల్వీ సీ30 విజయవంతం అయింది. దీంతో దశాబ్దాల కల నెరవేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు.

పీఎస్‌ఎల్వీ సీ30 రాకెట్ సహాయంతో ఆస్ట్రోశాట్‌తోపాటు ఇండోనేషియా, కెనడాలకు చెందిన రెండు ఉపగ్రహాలను, అమెరికాకు చెందిన నాలుగు నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. పీఎస్‌ఎల్వీ సీ 30 ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను మిషన్ రెడినెస్ రివ్యూ కమిటీ (ఎంఆర్‌ఆర్), లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) పర్యవేక్షించాయి. ఇండోనేషియా, అమెరికా, కెనడా దేశాల శాస్త్రవేత్తలు దగ్గరుండి మరీ దీన్ని పర్యవేక్షించారు. 



ఈ ప్రయోగంతో సాంకేతికంగా భారతదేశం మరో అడుగు ముందుకు వేసినట్టయింది. మనదేశానికి చెందిన ఆస్ట్రోశాట్‌తో పాటు.. పాటు కెనడా, ఇండోనేషియాకు చెందిన రెండు, యూఎస్‌కు చెందిన నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి పంపారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగానికి 350 కోట్లు ఖర్చుచేశారు. ఆస్ట్రోశాట్ రూపకల్పన కోసం 178 కోట్లు వెచ్చించింది ఇస్రో. ఇప్పటి వరకు మన దేశ ఖగోళ శాస్త్రానికి సంబంధించి ప్రత్యేకమైన ఉపగ్రహం లేదు. గతంలో పంపిన పరికరాలను వేరే వాటిలో అనుసంధానం చేసి పంపేవారు. ప్రస్తుతం ఖగోళశాస్త్రానికి ప్రత్యేకంగా ఆస్ట్రోశాట్‌ ఉపగ్రహాన్ని తయారు చేసి పంపుతున్నారు.

ఈ ఆస్ట్రోశాట్‌ ఐదేళ్లు పని చేస్తుంది. ఈ సమయంలో ఇది 300 టెర్రాబైట్‌ డేటాను సేకరిస్తుందని స్పేస్‌ సెంటర్‌ అధికారులు తెలిపారు. ఈ ఉపగ్రహంలో 40 సెంటీమీటర్లు ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలీస్కోప్, లార్ట్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్, సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్, మాస్క్ ఇమేజర్ , స్కానింగ్ స్కై మానిటర్ అనే ఉపకరణాలను అమర్చారు. 


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment